ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్ కాకుండా Threads App అకౌంట్‌ను డిలీట్ చేసుకోవచ్చు..!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం X (ట్విట్టర్)కు పోటీగా మెటా తీసుకొచ్చిన Threads App కీలక విషయం వెల్లడించింది. థ్రెడ్స్ యాప్ లాంచింగ్ సమయంలో ప్రత్యేకంగా అకౌంట్‌ను క్రియేట్ చేయ్యాల్సిన అవసరం లేకుండా.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కలిగిన యూజర్లు.. థ్రెడ్స్‌లో లాగిన్ అయ్యేందుకు అనుమతి ఇచ్చింది. ఆ రకంగా మిలియన్ల యాజర్లు థ్రెడ్స్‌లో ఖాతాలు తెరిచారు.
అయితే ఈ పద్ధతి ద్వారా ఖాతాలు తెరిచాక.. థ్రెడ్స్ అకౌంట్‌ను డిలీట్ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. థ్రెడ్స్ ఖాతా ఇన్‌స్ట్రాగ్రామ్ (Instagram) అకౌంట్ ఆధారంగా తెరవబడిన కారణంగా.. థ్రెడ్స్ ఖాతా డిలీట్ చేస్తే ఇన్‌స్టా అకౌంట్ కూడా డిలీట్ కానుందని మెటా అప్పట్లో హెచ్చరించింది. దీంతో చాలా మంది థ్రెడ్స్ ఖాతాలు డిలీట్ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఇదో పెద్ద సవాల్!: అయితే ఈ సమస్యకు త్వరలో చెక్ పెట్టనున్నట్లు మెటా చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ మైఖేల్ (Meta) వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో సంబంధం లేకుండా థ్రెడ్స్ యాప్‌ను డిలీట్ చేసే ఫీచర్‌పై ప్రస్తుతం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫీచర్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. టెక్నికల్‌గా ఇది కొంచెం సవాల్‌తో కూడుకున్నదని పేర్కొన్నారు.
ఎలాన్‌మస్క్ ట్విట్టర్‌ను (Twitter) కొనుగోలు చేశాక అనేక కీలక మార్పులు చేశారు. ప్రారంభంలోనే కీలక స్థానాల్లోని వారిని తొలగించారు. దాంతోపాటు వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక.. ఒకరకంగా దానిపై ఎలాన్ మస్క్ ప్రయోగాలు చేశారు. ప్రముఖుల అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌ను తొలగించారు. అనంతరం మళ్లీ పునరుద్ధరించారు.
దాంతోపాటు బ్లూటిక్ కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చాడు. కొన్నిరోజుల క్రితం ట్వీట్లకు పరిమితిని విధించాడు. దీనిపై నెటిజన్ల నుంచి భారీ అసంతృప్తి వ్యక్తం అయింది. వెరిఫైడ్ ఖాతాల కలిగిన వ్యక్తులు రోజుకు పదివేల ట్వీట్లు, వెరిఫైడ్ ఖాతా లేకున్నా చాలా కాలం నుంచి ట్వీట్టర్ అకౌంట్ కలిగి వ్యక్తులు రోజుకు వెయ్యి ట్వీట్లు, కొత్తగా అకౌంట్ తెరిచి వెరిఫైడ్ అకౌంట్ లేకుంటే కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూడగలిగేలా మార్పులు చేశారు.
అయితే ట్విట్టర్‌లో మార్పులపై నెటిజన్లు గతంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు మెటా సంస్థ జులై తొలివారంలో థ్రెడ్స్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రారంభ వారంలోనే 100 మిలియన్ల యూజర్లను పొందింది. అయితే అనంతరం కాలంలో థ్రెడ్స్ యాక్టివ్ యూజర్ల సంఖ్య భారీగా పడిపోయింది. అయితే థ్రెడ్స్‌లో యూజర్ ఎంగేజ్‌మెంట్ పెంచేందుకు మెటా అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా వచ్చిన ఇన్‌సైడర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ఈ సంవత్సరం చివరి నాటికి 23.7 మిలియన్ నెలవారీ యూజర్లను కలిగి ఉంటుందని తెలిపింది. అదే విధంగా ఫేస్‌బుక్ 177.9 మిలియన్, ఇన్‌స్ట్రాగ్రామ్ 135.2 మిలియన్, టిక్‌టాక్ 102.3 మిలియన్ యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగి ఉంటుందని అంచనా వేస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications