డార్క్ మోడ్ లో మొబైల్ వాడడం ఎంత వరకు కరెక్ట్ ?
ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని రకాల మొబైల్ అప్లికేషన్లకు డార్క్ మోడ్ ప్రవేశపెట్టబడుతోంది.
ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని రకాల మొబైల్ అప్లికేషన్లకు డార్క్ మోడ్ ప్రవేశపెట్టబడుతోంది. అంటే యూజర్ ఇంటర్ఫేస్ వైట్ బ్యాగ్రౌండ్ లో బ్లాక్ టెక్స్ట్ కాకుండా, బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో వైట్ టెక్ట్స్ ఉండేలా డిజైన్ చేస్తున్నారన్నమాట.సరిగ్గా ఇదే సమయంలో మొబైల్ ఫోన్ల నుండి వెలువడే వైట్ లైట్‌లో బ్లూ టింట్ గురించీ, బ్రెయిన్ మీద దాని ప్రభావం గురించి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని మరికొందరు రెండో ఆలోచన లేకుండా ఎల్లప్పుడు డార్క్ మోడ్ వాడడానికి మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి...

డార్క్ మోడ్ వాడడం వల్ల మీ కళ్ళు విపరీతంగా స్ట్రెయిన్ అవుతాయి.....
నిరంతరం డార్క్ మోడ్ వాడడం వల్ల మీ కళ్ళు విపరీతంగా స్ట్రెయిన్ అవుతాయి. బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో వైట్ టెక్స్ట్ చదివేవారికి అక్షరాలు కొద్దిసేపటికే బ్లర్ అయినట్లు కనిపించడం మొదలు పెడతాయి. అదే ఎప్పటిలా వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ టెక్స్ట్ చదివేవారికి కళ్ళు నిక్కచ్చిగా ఫోకస్ చేయబడతాయి, దాంతో అక్షరాలు స్పష్టంగా ఉంటాయి.

పూర్తిగా బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ పక్కన పెట్టాల్సిన పనిలేదు....
అలాగని పూర్తిగా బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ పక్కన పెట్టాల్సిన పనిలేదు. మీ చుట్టూ ఉన్న లైటింగ్ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అన్న అంశంపై ప్రభావం చూపిస్తుంది.

నార్మల్ మోడ్ కన్నా డార్క్ మోడ్ కళ్ళకు సౌకర్యవంతంగా ఉంటుంది ....
రాత్రి సమయాల్లో నిద్రపోయే ముందు ఫోన్ వాడుతున్నట్లయితే నార్మల్ మోడ్ కన్నా డార్క్ మోడ్ కళ్ళకు సౌకర్యవంతంగా ఉంటుంది. చుట్టూ చీకటి ఉంటుంది కాబట్టి అది అనువుగా ఉంటుంది.

పగటి సమయాల్లో డార్క్ మోడ్ జోలికి అసలు వెళ్ళకండి.....
ముఖ్యంగా పగటి సమయాల్లో డార్క్ మోడ్ జోలికి అసలు వెళ్ళకండి. కొద్దిసేపు ఈ మోడ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మీ కళ్ళు ఒత్తిడికి గురవడం మొదలుపెడతాయి.


Click it and Unblock the Notifications








