ఈ యాప్‌తో పీసీ గేమ్స్‌ను మొబైల్ ఫోన్‌లలో స్ట్రీమ్ చేసుకోవచ్చు..

ప్రముఖ వీడియో గేమ్ డెవలపర్ ‘వాల్వ్’ (Valve) రెండు సరికొత్త మొబైల్ యాప్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో ఒకటి స్టీమ్ లింక్ యాప్ కాగా మరొకటి స్టీమ్ వీడియో యాప్.

|

ప్రముఖ వీడియో గేమ్ డెవలపర్ 'వాల్వ్' (Valve) రెండు సరికొత్త మొబైల్ యాప్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు యాప్స్ ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లతో పాటు ఐఓఎస్ ఆధారిత్ డివైస్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి. వీటిలో ఒకటి స్టీమ్ లింక్ యాప్ కాగా మరొకటి స్టీమ్ వీడియో యాప్.ఈ రెండు యాప్‌లను ఉపయోగించకోవటం ద్వారా ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యూజర్లు ద్వారా పీసీ
గేమ్‌లను ఆండ్రాయిడ్ (ఫోన్స్ ఇంకా టాబ్లెట్స్) ఇంకా ఐఓఎస్ (ఐఫోన్ ఇంకా ఐప్యాడ్)లలో స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది. ఈ హైస్పీడ్ యాప్స్ ద్వారా డివైసెస్‌లో రన్ అవ్వాలంటే 5GHz వై-ఫై కనెక్టువిటీ తప్పనిసరిగా ఉండాలని కంపెనీ చెబుతోంది.

Valve’s New App

మే 21 నుంచి మార్కెట్లో..
స్టీమ్ లింక్ యాప్ సర్వీస్ మే 21 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. స్టీమ్ లింక్ యాప్‌ను స్టీమ్ కంట్రోలర్ అలానే ఇతర ఎమ్ఎఫ్ఐ కంట్రోలర్స్ ద్వారా ఉపయోగించుకునే వీలుంటుంది. మరో యాప్ స్టీమ్ వీడియో ద్వారా లైబ్రరీలోని స్టీమ్ వీడియోలను మీ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ డివైస్‌లలో స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది.

శాంసంగ్ నుంచి బడ్జెట్ ధరలో 2 స్మార్ట్‌ఫోన్లు, షియోమి ఫోన్లకు గట్టి పోటీశాంసంగ్ నుంచి బడ్జెట్ ధరలో 2 స్మార్ట్‌ఫోన్లు, షియోమి ఫోన్లకు గట్టి పోటీ

మోతాదుకు మించి యాక్షన్..
నేటి తరం యువతలో అత్యధిక శాతం మంది ఆన్‌లైన్ కంప్యూటర్ వీడియో గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. సరదాగా ప్రారంభమైన ఈ అలవాటు వ్యసనంగా మారటంతో పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోతున్నారు. దింతో వారి మానసిక, శారీరక స్థితిగతుల ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనికి తోడు వీడియో గేమ్‌లలో మోతాదుకు మించి యాక్షన్ ఇంకా లైంగిక హింసను చూపిస్తున్నారు.

మితిమీరిన వీడియో గేమింగ్‌కు దూరంగా ఉండటం మంచిది..
రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగానూ ఇంకా శారీరకంగానూ సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్‌లకు కేటాయిస్తున్న వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు లాంటి సమస్యలు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మితిమీరిన వీడియో గేమింగ్ జోలికి పోకండి.

Best Mobiles in India

English summary
Valve has just announced two new applications for iOS and Android devices. This is Steam Link App and Steam Video App, two tools that, according to the company, will serve to ‘extend the services and accessibility of Steam’.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X