వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. వీడియో కాల్స్, GIF సపోర్ట్, ఫోటో ఎడిటింగ్

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ విభాగంలో రోజురోజుకు పోటీ వాతావరణం పెరిగిపోతున్న నేపథ్యంలో వాట్సాప్ తన స్థానాన్ని పదలిపరుచుకునేందుకు లేటెస్ట్ ఫీచర్లను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీడియో కాలింగ్, GIF సపోర్ట్, ఫోటో ఎడిటింగ్ వంటి సరికొత్త ఫీచర్లు వాట్సాప్‌లో కొద్ది రోజుల క్రితమే యాడ్ అయ్యాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : మిజు 3జీబి ర్యామ్ ఫోన్, రూ.6,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియో కాలింగ్

వాట్సాప్ ఎట్టకేలకు తన ఆండ్రాయిడ్ వర్షన్ యూజర్ల కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ బేటా యాప్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బేటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో నమోదైన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ v2.16.316 ఆ తరువాత వచ్చిన వాట్సాప్ బేటా వర్షన్‌లలో పనిచేస్తోంది.

వాట్సాప్ కాల్స్ టాబ్ ద్వారా ..

ఈ సరికొత్త వీడియో కాలింగ్ సదుపాయాన్ని వాట్సాప్ కాల్స్ టాబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ చేసుకునే క్రమంలో డైలర్ ఐకాన్ పై టాప్ చేయవల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డైలర్ ఐకాన్ పై..

డైలర్ ఐకాన్ పై ప్రెస్ చేయగానే వీడియో లేదా వాయిస్ కాల్ అని అడుగుతుంది. వీడియో కాల్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా కాల్ వెళుతుంది. మీరు వీడియో కాల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవతలి వ్యక్తులు కూడా వాట్సాప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉండాలి. అంటే వాళ్లు కూడా ఆండ్రాయిడ్ బేటా టెస్టింగ్ ప్రోగ్రామ్ లో నమోదై ఉండాలి.

వాట్సాప్‌లో GIF మెసేజ్ పంపటం ఎలా..?

వాట్సాప్ ద్వారా GIF ఫైల్ ను తయారు చేయాలంటే ముందుగా యాప్ పేజీలోని అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మీకు 6 రకాల ఆప్షన్స్ మీకు కనపిస్తాయి. వాటిలో కెమెరా ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే Take picture, Record Video పేరుతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో రికార్డ్ వీడియో ఆప్షప్ పై క్లిక్ చేసినట్లయితే వీడియో రికార్డింగ్ ఓపెన్ అవుతుంది.

6 సెకన్ల కంటే తక్కువ టైమ్ వ్యవధిలో ఉండాలి

మీరు రికార్డ్ చేసే వీడియో 6 సెకన్ల కంటే తక్కువ టైమ్ వ్యవధిలో ఉండాలి. వీడియో అటాచ్ మెంట్ సిద్ధమైన వెంటనే క్యామ్ కార్డర్ ఐకాన్ తో పాటు ట్రిమ్మింగ్ పేజీ మీకు కనిపిస్తుంది. ఈ పేజీలో GIF ఫైల్ కావల్సిన విధంగా ట్రిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెండ్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే వీడియో కాస్తా GIF ఫైల్ గా మారిపోతుంది

వాట్సాప్‌లో ఫోటోలను ఎడిట్ చేయటం ఎలా..?

వాట్సాప్ ద్వారా మీరో ఇమేజ్ ను చిత్రీకరించిన వెంటనే, ఆ ఫోటో క్రింద కొన్ని ఎడిటింగ్ టూల్స్ మీకు కనిపిస్తాయి. Cropping, Emojis, Type option, Pencil, draw or scribble వంటి ఆప్షన్ లను మీరు చూడొచ్చు. అవసరాన్ని బట్టి వీటి వాడుకోవచ్చు.

పబ్లిక్ గ్రూప్ ఇన్వైట్ లింక్స్

పబ్లిక్ గ్రూప్ ఇన్వైట్ లింక్స్ పేరుతో సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ పరిచయం చేసింది. ఈ ఇన్విటేషన్ లింక్‌ను అందుకున్న వ్యక్తి ఆ గ్రూపు‌ను ఎవరు రన్ చేస్తున్నారు, దానిలో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు వంటి వివరాలను మెసెజ్ రూపంలో పొందుతారు. తద్వారా ఆ గ్రూపులో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Video Calling, GIF Support, Photo Editing: What Else's New in WhatsApp [A Complete How-To Guide]. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot