ఆకట్టుకునే ఫీచర్లతో వివో జెడ్1ఎక్స్ విడుదల
చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం వివో తన జెడ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. వివో జెడ్1ఎక్స్ పేరుతో దీన్ని ఇండియాలో లాంచ్ చేసింది. కాగా వివో జెడ్-సిరీస్‌లో ఇది కంపెనీ నుంచి రెండవ ఫోన్. ఇందులో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 సాక్, 22 వాట్ ఫ్లాష్‌చార్జ్ స్పెషల్ ఫీచర్లుగా ఉన్నాయి. ఫాంటమ్ పర్పుల్, ఫ్యూజన్ బ్లూ రంగులలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో జెడ్ 1 ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

6 జీబీర్యామ్/ 64 జిబి స్టోరేజ్ మోడల్ ధరను రూ .16,990గా కంపెనీ నిర్ణయించింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను కంపెనీ రూ.18,990గా నిర్ణయించింది. 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే దాదాపు మూడు గంటల పాటు పనిచేస్తుంది. అలాగే సోషల్ మీడియాకు వినియోగిస్తే నిరంతరాయంగా ఈ ఫోన్ 32.6 గంటల పాటు పనిచేస్తుంది.

ఆఫర్ల విషయానికొస్తే, వివో జెడ్ 1 ఎక్స్ ఫోన్ కొనుగోలుపై రిలయన్స్ జియో రూ .6,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు రూ .1,250 ఆఫర్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుండి అమ్మకానికి రానుంది.

6.38-అంగుళాల సూపర్ అమోలెడ్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే , స్నాప్‌డ్రాగన్ 712 ఎఐఈ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై , 48+ 2+8 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా, 32 ఎంపీ సెల్పీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, Game Mode 5.0 feature, 22.5w వోల్టేజ్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.

సాధారణంగా వివో ఫోన్లు అంటేనే అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది కెమెరాల కోసమే. ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే వెనకవైపు మూడు కెమెరాలు ఇందులో అందించారు. ప్రధాన కెమెరాగా సోనీ ఐఎంఎక్స్582 సెన్సార్ ను కలిగి ఉన్న 48 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇంకా వైడ్ యాంగిల్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను, పొర్ట్రెయిట్ ఎఫెక్ట్ కోసం మరో 2 మెగా పిక్సెల్ ను అమర్చారు.

సెల్ఫీ ప్రియుల కోసం ఏఐ సామర్థ్యమున్న 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే గేమింగ్ ప్రియుల కోసం, మల్టీ టాస్కింగ్ చేసే వారికోసం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 712 చిప్ సెట్ ను ఇందులో అమర్చారు. ఇకపోతే ఇందులో ఫ్లాష్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఫోన్ అత్యంత వేగంగా అంటే కేవలం 0.48 సెకన్లలోనే అన్ లాక్ చేసేస్తుంది.


Click it and Unblock the Notifications