Vi యాప్ నుంచి రీఛార్జీల‌తో అద్భుత‌మైన ఆఫ‌ర్లు పొందండి!

|

భార‌త‌దేశంలో మూడ‌వ అతిపెద్ద‌ టెలికాం సంస్థ Vodafone Idea (వీఐ) త‌మ స‌ర్వీసుల‌పై యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎల్ల‌ప్పుడూ స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, త‌మ యూజ‌ర్లు రీఛార్జీల కోసం Vi యాప్‌ను వినియోగించేలా మ‌రో ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. త‌మ Vi యాప్ నుంచి రీఛార్జీ చేసుకోవ‌డం ద్వారా రూ.50 క్యాష్‌బ్యాక్ పొంద‌డంతో పాటు, 30 రివార్డు కాయిన్స్ పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 
Vodafone Idea Offering

ప్ర‌స్తుత రోజుల్లో మొబైల్ రీఛార్జ్‌లు చేయడానికి వినియోగదారుల కోసం చాలా థర్డ్-పార్టీ మొబైల్ అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, త‌మ వినియోగదారులు తమ మొబైల్ యాప్‌కి వచ్చి అక్కడి నుంచే నేరుగా రీఛార్జ్ చేసుకోనేలా చేయాల‌ని Vi భావిస్తోంది. అందుకోస‌మే యూజ‌ర్ల‌ను యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ఈ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. అయితే, ఈ Vi యాప్ ద్వారా Vodafone Idea నంబర్‌లను మాత్రమే రీఛార్జ్ చేసుకోగ‌ల‌ర‌నే విష‌యాన్ని యూజ‌ర్లు గుర్తుంచుకోవాలి.

 
Vodafone Idea Offering

త‌మ యాప్ ద్వారానే యూజ‌ర్లు రీఛార్జీ చేసుకోవాల‌ని వీఐ ఎందుకు కోరుకుంటోంది!
వోడాఫోన్ ఐడియా తన మొబైల్ యాప్‌ను సూపర్ యాప్‌గా అభివృద్ధి చేయ‌డానికి అనేక ర‌కాలు కృషి చేస్తోంది. ఇందుకోసం ఆ యాప్‌పై పెట్టుబ‌డులు కూడా భారీగానే పెడుతోంది. ఈ యాప్ నుండి, త‌మ వినియోగ‌దారుల‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌తి విష‌యంలోనూ సూపర్-ప్లాట్‌ఫారమ్‌గా పని చేయాలని కంపెనీ కోరుకుంటుంది. యాప్ ద్వారా వినియోగదారులకు సంగీతాన్ని అందించే సేవ‌లు, ఉద్యోగ అవకాశాలను వెతకడానికి సుల‌భ‌మైన మార్గాలు మరియు గేమ్‌లు ఆడేందుకు యాప్‌లో Vi ప‌లు మార్గాల‌ను ఏర్పాటు చేసింది. అందుకే వినియోగదారులు తమ ప్లాట్‌ఫారమ్‌కి రావాలని కంపెనీ కోరుకుంటుంది. తద్వారా యాప్‌లోని ట్రాఫిక్‌ను ఉపయోగించుకోవచ్చు మరియు పైన పేర్కొన్న విధంగా యాప్ వేదిక‌గా వివిధ మార్గాల‌ను ఏర్పరచడం ద్వారా దాన్ని రెవెన్యూ సోర్సుగా కూడా మార్చుకోవ‌చ్చ‌ని భావిస్తోంది. అలా Vodafone Idea సాధ్యమైన ప్రతి మార్గంలోనూ సంపాదించాలనుకుంటోంది. వేగంగా డబ్బు ఆర్జించగల ప్లాట్‌ఫారమ్‌లలో మొబైల్ యాప్ ఒకటి కాబ‌ట్టి వీఐ ప్రస్తుతం ఆ మార్గాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

జియో మరియు ఎయిర్‌టెల్ కూడా తమ మొబైల్ అప్లికేషన్‌లను అనేక రకాల ఉత్పత్తులు మరియు సేవలతో ఇప్ప‌టికే వినియోగ‌దారుల ముందుకు తెచ్చాయి. ఎయిర్‌టెల్, వాస్తవానికి, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లోని కస్టమర్‌లతో పూర్తి స్థాయి బ్యాంకింగ్ అనుభవాన్ని కలిగి ఉంది. అన్ని టెల్కోలు ప్రస్తుత కస్టమర్ బేస్ ద్వారా కొన్ని అదనపు రాబడిని సంపాదించాలని చూస్తున్నాయి, రాబోయే రోజుల్లో, అన్ని టెల్కోలు రీఛార్జ్‌లు మరియు మరిన్నింటి కోసం తమ యాప్‌లను ఉపయోగించుకునే విధంగా కస్టమర్‌లను ప్రోత్సహించడానికి మరింత ప్రయత్నిస్తున్నాయి.

Vodafone Idea Offering

కాగా, ఇప్ప‌డు వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.
ఆకర్షణీయమైన ప్రయోజనాలతో లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు:
వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కోని ప్రైమరీ కనెక్షన్‌గా ఉపయోగిస్తూ తక్కువ చెల్లుబాటు కాలానికి ఎంచుకునే వారు రూ.299, రూ.359, రూ. 399, రూ.499, రూ.475, రూ.319 మరియు రూ.409 ధరల వద్ద లభించే ప్లాన్‌లను ఎంచుకోవడం ఉత్తమం. ఇవన్నీ కూడా హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తాయి. హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాల విషయానికి వస్తే అవి వీకెండ్ డేటా రోల్ ఓవర్, బింగే ఆల్ నైట్ మరియు డేటా డిలైట్స్‌తో కూడిన వివిధ అదనపు ప్రయోజనాల బండిల్ లను కలిగి ఉంటాయి. మీరు అధిక ప్రయోజనాలతో కూడిన స్వల్పకాలిక చెల్లుబాటు ప్లాన్ కోసం వెళ్లాలని చూస్తున్నట్లయితే కనుక ఈ ప్లాన్‌లు విలువైనవి. వీటిలో కొన్ని డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మరియు బోనస్ డేటాతో కూడా వస్తాయి.

అదేవిధంగా వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు మధ్యకాలిక నుండి దీర్ఘకాలిక ప్లాన్ లను కూడా అందిస్తోంది. 2GB రోజువారీ డేటా ప్రయోజనాలతో 56 రోజుల చెల్లుబాటు కాలంతో రూ.539 ధర వద్ద ఒక గణనీయమైన ప్లాన్‌ లభిస్తుంది. ఇది అధిక మొత్తంలో డేటాను వినియోగించాలనుకునే మరియు ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే వినియోగదారులకు అద్భుతమైన ఎంపికగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea Offering Rs 50 Benefit and 30 Reward Coins to Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X