వాట్సప్ అలర్ట్,తెలియకుండానే మెసేజ్‌లు డిలీట్ అవుతున్నాయి

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సప్ వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ లు జారీ చేయకుండానే మీ మెసేజ్ లు డిలీట్ చేస్తోంది.

|

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సప్ వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ లు జారీ చేయకుండానే మీ మెసేజ్ లు డిలీట్ చేస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఈ దిగ్గజం ఆగస్టులో బ్యాకప్ డేటాపై వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. దాదాపు 1. 5 బిలియన్ల యాక్టివ్ యూజర్లతో రోజుకు 60 బిలియన్ల మెసేజ్ లను పంపుకునే విధంగా వాట్సప్ యూజర్లను కట్టిపడేస్తోంది. ఇప్పుడు ఈ మెసేజ్ లు అన్నింటిని ఏరిపారేసే పనిలో ఈ దిగ్గజం తలమునకలైంది.

మళ్లీ దిగ్గజాలకు షాకిచ్చేందుకు శాంసంగ్ రెడీ, ఈ సారి tabletతో..మళ్లీ దిగ్గజాలకు షాకిచ్చేందుకు శాంసంగ్ రెడీ, ఈ సారి tabletతో..

వాట్సప్ తన యూజర్లకు డేటాను వెంటనే బ్యాకప్ తీసుకోవాలని సూచిస్తోంది....

వాట్సప్ తన యూజర్లకు డేటాను వెంటనే బ్యాకప్ తీసుకోవాలని సూచిస్తోంది....

ఇందులో భాగంగా వాట్సప్ తన యూజర్లకు డేటాను వెంటనే బ్యాకప్ తీసుకోవాలని సూచిస్తోంది. గూగుల్ డ్రైవ్‌లో ఏడాది కన్నా ఎక్కువ కాలం పాటు స్టోర్ అయి ఉన్న డేటాను వెంటనే బ్యాకప్ తీసుకోవాలని, లేదంటే ఆ డేటా యూజర్లకు లభ్యం కాదని వాట్సప్ సూచించింది.

వాట్సప్ గతంలోనే ప్రకటించగా....

వాట్సప్ గతంలోనే ప్రకటించగా....

ఇప్పటికే ఈ విషయంపై వాట్సప్ గతంలోనే ప్రకటించగా, ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని అమలు పరుస్తోంది. ఏడాది కన్నా ఎక్కువ కాలం పాటు స్టోర్ అయి ఉన్న డేటాను వాట్సప్ గూగుల్ డ్రైవ్ నుంచి తొలగించే పనిలో పడింది.

వాట్సప్ డేటా గూగుల్ డ్రైవ్‌లో ఉంటే....

వాట్సప్ డేటా గూగుల్ డ్రైవ్‌లో ఉంటే....

కనుక చాలా పాత వాట్సప్ డేటా గూగుల్ డ్రైవ్‌లో ఉంటే వెంటనే దాన్ని బ్యాకప్ తీసుకోవాలని వాట్సప్ తన యూజర్లకు తెలిపింది. నవంబర్ 12 నుంచి వాట్సప్ ఈ డిలీటింగ్ పక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాబట్టి యూజర్లు వీలయినంత త్వరగా తమ డేటా బ్యాకప్ ని చేసుకోవాలని సూచించింది.

 

 

డేటా బ్యాకప్ ఎలా చేసుకోవాలి..

డేటా బ్యాకప్ ఎలా చేసుకోవాలి..

వాట్సప్ లో మీరు డేటాను బ్యాకప్ ఎలా చేసుకోవాలంటే వాట్సప్ సెట్టింగ్స్ లో కెళ్లి అక్కడ కన్వర్షన్ ఆనే ఆప్సన్ మీద క్లిక్ చేసి బ్యాకప్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్యాకప్ కి డేటా చాలా అవసరం అవుతుంది కాబట్టి వైఫై ఉన్న చోట ఈ వాట్సప్ డేటాను బ్యాకప్ చేసుకోవడం ఉత్తమం. లేకుంటే మీ డేటా మొత్తం నిమిషాల వ్యవధిలో అయిపోతుంది. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే. ఆపిల్ ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్ లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
WARNING! WhatsApp To Delete All Your Messages more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X