Home
Apps

Arattai App : వాట్సాప్‌నకు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్‌ అరట్టై గురించి తెలుసా.. ఇటీవల చర్చంతా దీనిపైనే..!!

వాట్సాప్‌కు ప్రత్యా‌మ్నాయంగా చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్‌ అరట్టై (Arattai App) పేరుతో తీసుకొచ్చిన యాప్‌ ట్రెండింగ్‌ లో ఉంది. ఇటీవల ప్రధాన మంత్రి స్వదేశీ ఉత్పత్తులు, సేవల పిలుపుతో కేంద్ర మంత్రులు ఈ యాప్‌ గురించి తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ స్వదేశీ యాప్‌ (Made in india Messaging App) గురించి X లో పోస్ట్‌ చేశారు. అనంతరం ఈ యాప్‌ ట్రెండ్‌లో వచ్చింది.

సోషల్‌ నెట్‌వర్కింగ్ విభాగంలో నంబర్‌ 1 స్థానం :
ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ విభాగంలో నంబర్‌ 1 స్థానంలో ఇటీవల నిలిచింది. అరట్టై అంటే తమిళంలో మాట్లాడుకోవడం (Casual Chat) అని అర్ధం. వాట్సాప్‌ తరహాలోనే ఇందులోనూ అనేక ఫీచర్లు ఉన్నాయి. మెసేజ్‌ లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ షేర్‌ చేసుకోవచ్చు.

swadesi messaging Arattai App

ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ :
దీంతోపాటు వాయిస్‌, వీడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. స్టోరీస్‌, ఛానల్స్‌ ఆప్షన్‌ కూడా ఉంది. ప్రస్తుతానికి వాయిస్‌, పీడియో కాల్స్‌ కు మాత్రమే ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్ ఉంది. భవిష్యత్‌ లో మెసేజ్‌లకు కూడా ఈ ఆప్షన్‌ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటే మీ మెసేజ్‌లను ఇతరులు చదివేందుకు అవకాశం ఉండదు.

100 రెట్లు పెరిగిన సైన్‌ అప్‌లు! :
గతంలో పోలిస్తే అరట్టై యాప్‌ భారీగా సైన్‌ అప్‌లను నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ యాప్‌ రోజువారీ SignUp ల సంఖ్య 3,000 నుంచి 350,000 చేరినట్లు తెలుస్తోంది. అంటే సుమారు 100 రెట్లు పెరిగింది.

24 గంటలూ పనిచేస్తున్నాం! :
రోజువారీ యాప్‌ ట్రాఫిక్‌కు అనుగుణంగా తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలూ పనిచేస్తున్నట్లు సంస్థ చెబుతోంది. చాలా గ్లోబల్‌ యాప్‌ లు యూజర్ల వ్యక్తిగత డేటాను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తుంటాయి. అయితో అరట్టై యాప్‌ యూజర్ల వ్యక్తిగత డేటాను వాణిజ్య అవసరాల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించబోమని జోహో సంస్థ చెబుతోంది.

ఈ యాప్‌పై పెద్ద ఎత్తున చర్చ :
అయితే యూజర్ల అవసరాలకు అనుగుణంగా మరిన్ని భద్రత, గోప్యతకు సంబంధించిన ఫీచర్‌ లను తీసుకురావాల్సి ఉంటుంది. వాట్సాప్‌ వంటి ప్లాట్‌ఫాంలకు పోటీగా నిలవాలంటే పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్‌.. ప్రభుత్వంలోని ప్రముఖుల మద్దతును కూడా సంపాదించుకుంది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది.

Take a Poll

చెన్నైలో అరట్టై ప్రధాన కార్యాలయం :
అరట్టై యాప్‌ ను జోహో కార్పొరేషన్‌ తయారు చేసింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఈ సంస్థ అనేక విభాగాల్లో 55 కు పైగా బిజినెస్‌ అప్లికేషన్లను కలిగి ఉంది. అనేక దేశాల్లో సర్వీసులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీధర వెంబు ప్రస్తుతం ఈ సంస్థ చీఫ్‌ గా ఉన్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
what are the features of swadesi messaging Arattai App here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X