వాట్సప్ గురించి అందరికీ తెలుసు,మరి GBwhatsapp గురించి తెలుసా,అసలేంటిది..?

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు అనేవి ప్రతి ఒక్కరూ వాడుతున్నారు..ఏడాదికి మిలియన్ల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. టాప్ కంపెనీల నుంచి వచ్చే మొబెల్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందులో స్మార్ట్ ఫీచర్లు ఉండటంతో అందరూ వీటివైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్ లేనిదే స్మార్ట్ ఫోన్ ఉండటం లేదు. వాట్సప్, ఫేస్‌బుక్ లాంటి యాప్స్ తప్పనిసరిగా మొబైల్స్ లో ఉండాల్సిందే. అయితే మీరు వాట్సప్ వాడుతున్నట్లయితే మీకో ఇంకో వాట్సప్ గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. అదే జిబి వాట్సప్..అసలు ఈ యాప్ ఏంటీ దానికి దీనికి తేడాలేంటి అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. అయితే దీనిపై మీకు పూర్తి వివరాలను అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

షియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్, మార్చి 14న విడుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు సిమ్‌లు మాదిరిగానే..

మీరు మీ ఫోన్లో రెండు సిమ్‌లు వాడుతున్నట్లే మీ స్మార్ట్‌ఫోన్ నుండి రెండు వాట్సప్ లు ఒకేసారి ఉపయోగించుకునే విధంగా ఇవి ఉన్నాయి. ఒక ఫోన్ లోనే ఎటువంటి అంతరాయం లేకుండా రెండు రకాల అకౌంట్లు నిర్వహించుకోవచ్చు. అందులో ఫీచర్లు కూడా విభిన్నంగా మీకు కనిపిస్తాయి. జిబి వాట్సప్ ని మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎన్నో రకాల ఫీచర్లు, ట్రిక్స్..

ఈ యాప్ లో ఎన్నో రకాల ఫీచర్లు, ట్రిక్స్ ఉన్నాయి. ఇది మీకు గూగుల్ ప్లో స్టోర్ లో కనిపించదు. దీన్ని మీరు నేరుగా ఏపికె ఫైల్ ద్వారా దౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ లో ఉండే ఫీచర్లకు అదనంగా కొన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి. మీరు నేరుగా గూగుల్ నుంచి మీడియా ఫైర్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

50 ఎంబి సైజు వరకు..

ఇందులో మీరు 50 ఎంబి సైజు వరకు వీడియోలను పంపుకోవచ్చు. అయితే మీరు వాడే ఒరిజినల్ వాట్సప్ లో కేవలం 16 జిబి వరకు మాత్రమే వీడియోలను పంపుకునే అవకాశం ఉంది. ఇదొక అడ్వాన్టేజ్ ఫీచర్.

ఒకేసారి 100 ఇమేజ్‌లను ..

ఇక జిబి వాట్సప్ ఉపయోగించి మీరు ఒకేసారి 100 ఇమేజ్‌లను పంపుకునే అవకాశం ఉంది. అదే ఒరిజినల్ వాట్సప్ లో ఇది 30 ఇమేజ్ లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

స్టేటస్, టైపింగ్ స్టేటస్..

GBwhatsappలో మీ స్టేటస్, టైపింగ్ స్టేటస్, లాస్ట్ సీన్, డబుల్ టిక్స్, బ్లూటిక్స్ హైడ్ చేసుకోవచ్చు. అయితే ఒరిజినల్ దానిలో వీటిలో కొన్నింటిని మాత్రమే హైడ్ చేసుకునే అవకాశం ఉంది.

35 క్యారక్టర్లతో..

GBwhatsappలో గ్రూపు పేరును 35 క్యారక్టర్లతో సెట్ చేసుకోవచ్చు. అఫిషియల్ వాట్సప్ లో ఇది చాలా తక్కువగా ఉంటుంది. మీ వాట్సప్ థీమ్ మార్చుకోవచ్చు. 100 వేర్వేరు భాషల్లో మాట్లాడుకోవచ్చు.

ఒకేసారి రెండు అకౌంట్లు

GBwhatsapp నుంచి మీ ఫోన్లో ఒకేసారి రెండు అకౌంట్లు రన్ చేసుకోవచ్చు. అలాగే మీ కాంటాక్ట్స్ కు ఆటో రిప్లేస్ ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఒరిజినల్ దానిలో ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు.

వాట్సప్ కు ఎక్సెటెండెడ్ వర్షన్..

కాగా ఇది వాట్సప్ కు ఎక్సెటెండెడ్ వర్షన్ ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఒరిజినల్ వాట్సప్ కు మోడెడ్ వర్షన్. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే https://modapksdownload.com/gbwhatsapp-apk-download/ ఈ లింక్ ద్వారా ప్రయత్నించవచ్చు. అయితే ఇది ధర్డ్ పార్టీ అప్లికేషన్ .మీరు ప్రయత్నించాలనుకుంటే సొంతంగా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది.

నచ్చిన పేరును..

డౌన్లోడ్ అయిన తరువాత settings > Application > Tap on Unknown sources ద్వారా దాన్ని మీరు మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అది కంప్లీట్ అయిన తరువాత మీరు వెనక్కి వెళ్లి unknown sourcesలో మీరు మీకు నచ్చిన పేరును సెట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What is GBwhatsapp Some Things You Need To Know More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot