గూగుల్ బ్యాన్ తరువాత హువాయి కొత్త వ్యూహాం ఏంటి ?

గ్లోబల్ దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ హువావేపై ముప్పెటదాడి కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో అక్కడి కంపెనీలు వరుసబెట్టి హువావే కంపెనీతో వ్యాపార సంబంధాలను తెంచుకుంట

|

గ్లోబల్ దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ హువావేపై ముప్పెటదాడి కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో అక్కడి కంపెనీలు వరుసబెట్టి హువావే కంపెనీతో వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ ఇందుకు నాంది పలికింది. హువావే కంపెనీ మాత్రం దేనికి బెదరడం లేదు. వాటిని ఢీ కొట్టేందుకు రెడీ అయింది.గూగుల్ కి షాకిస్తూ కొత్త ఆపరేటింగ్ సిస్టంను తయారు చేసేందుకు సిద్ధమైంది.

 
గూగుల్ బ్యాన్ తరువాత హువాయి కొత్త వ్యూహాం ఏంటి ?

హువాయి గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా సరికొత్త వినూత్నమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తోందని చైనా మీడియా పేర్కొంటోంది. సొంతం ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పనతో హువాయి ఒకేసారి గూగుల్, ఆపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయింది.

 హాంగ్‌మెంగ్

హాంగ్‌మెంగ్

హువాయి ఓఎస్ పేరు హాంగ్‌మెంగ్ అయ్యి ఉండొచ్చని అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే హువాయి 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తోందని తెలిపాయి. ఈ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే క్రమంగా తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో ఈ ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందని నివేదికలు తెలిపాయి.

 అనేక ఆరోపణలు

అనేక ఆరోపణలు

కాగా అంతర్జాతీయ గూఢచార సంస్థలు, రోబొట్ ఆర్మ్స్‌ల దొంగతనం, నాశనం చేయలేని డైమండ్ కోటెడ్ గ్లాసులు, ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు తదితర అంశాలకు సంబంధించి ఈ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల మధ్య అమెరికా హువాయి కంపెనీని బ్లాక్ లిస్టులో ఉంచింది. గూగుల్ కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ నిలిపివేస్తున్నామని తెలిపింది.

 గూగుల్ సర్వీసులు
 

గూగుల్ సర్వీసులు

గూగుల్‌ నిర్ణయంతో హువాయి, హానర్ స్మార్ట్‌ఫోన్లకు రానున్న కాలంలో గూగుల్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చు. గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ ప్లేస్టోర్ వంటి యాప్స్ వినియోగించుకోలేరు. పాత కస్టమర్లకు వచ్చిన నష్టమేమీ లేదు. కొత్త ఫోన్ల పరిస్థితే అర్థంకావడం లేదని పలువురు చెబుతున్నారు.

ప్లాన్ బి అమలు

ప్లాన్ బి అమలు

హువాయికు గూగుల్ ఝలక్ ఇవ్వడంతో ఆ కంపెనీ ప్లాన్ బి అమలు చేయాలని చూస్తోంది. సొంతంగానే ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది. కంపెనీ ఇప్పటికే ప్రత్యేకమైన ఓఎస్‌పై పనిచేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా హువాయి హాంగ్‌మెంగ్ రానుందని తెలుస్తోంది.

సరికొత్త ఉద్యమం

సరికొత్త ఉద్యమం

ఇదిలా ఉంటే చైనాలో సరికొత్త ఉద్యమం ఊపందుకుంది. ఆపిల్‌కు వ్యతిరేకంగా, హువాయికు మద్దతుగా చైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు. హవాయిను బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన అమెరికా, 90 రోజుల వెసులుబాటు మాత్రమే కల్పించింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో గూగుల్ కూడా హువాయికు సేవలు నిలిపేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో చైనా యువత హువావేకు మద్దతుగా నిలబడ్డారు.

 ఆపిల్ ఉత్పత్తులు బ్యాన్

ఆపిల్ ఉత్పత్తులు బ్యాన్

ఆపిల్ ఉత్పత్తులు బ్యాన్ చేయాలని పిలుపు చైనాకు చెందిన యువత, వినియోగదారులు.. ఆపిల్ ఉత్పత్తులు బ్యాన్ చేయాలని పిలుపునిస్తున్నారు. చైనా యువత ఇలా నిరసన కారణంగా డ్రాగన్ దేశంలో ఆపిల్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఫోన్ తయారీ సంస్థ హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వంపై చైనా యువత మండిపడుతోంది.

Best Mobiles in India

English summary
What next after Google’s move to cut off Huawei

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X