200 కోట్లు దాటిన వాట్సాప్ యూజర్స్, డార్క్ మోడ్ ఫీచర్ ట్రై చేయండి

By Gizbot Bureau
|

ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్‌ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. గతేడాది జూలై గణాంకాల ప్రకారం వాట్సాప్‌నకు భారత్‌లో 40 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. గత నెల, వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. ఈ ఘనతను సాధించిన రెండవ అనువర్తనం మాత్రమే అయ్యింది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే. ఈఘనతను సాధించిన మొదటి యాప్ కూడా వాట్సప్ మాత్రమే. న్యూ ఇయర్ యొక్క వాట్సాప్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు 100 బిలియన్లకు పైగా సందేశాలను పాఠాలు, చిత్రాలు మరియు వీడియోల రూపంలో పంపారు, మునుపటి రికార్డులను బద్దలు కొట్టారు.

డార్క్ మోడ్ ఫీచర్
 

డార్క్ మోడ్ ఫీచర్

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ నుంచి డార్క్ మోడ్ ఫీచర్ వచ్చింది.డార్క్ థీమ్ ఫీచర్‌పై వర్క్ చేస్తున్నామని మెసేంజర్ సంస్థ ఇదివరకే ప్రకటించింది. మొబైల్ యూజర్ల కోసం ఈ కొత్త థీమ్.. అందుబాటులోకి రాబోతుందని, డెస్క్ టాప్ వెర్షన్ కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. వెబ్ వెర్షన్ కోసం వాట్సాప్ వర్క్ చేస్తున్నట్టు రుమార్లు వస్తున్నప్పటికీ ఎప్పుడు లాంచ్ అనేదానిపై క్లారిటీ లేదు. వాట్సాప్ వెబ్ కోసం డార్క్ మోడ్ థీమ్ ఎనేబుల్ చేయాలంటే మీరు వాడే బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్ మెజిల్లా ఫైర్ ఫాక్స్ లేదా గూగుల్ క్రోమ్ ఇన్ స్టాల్ చేసి ఉండాలి. డెస్క్ టాప్ వెర్షన్ పై డార్క్ థీమ్ ఎనేబుల్ చేయడానికి XDA మెంబర్ m4heshd ఒక మోడ్ క్రియేట్ చేశారు. FYI వాట్సాప్ మోడెడ్ వెర్షన్ కాదు. ప్రస్తుత మీ వాట్సాప్ డెస్క్ టాప్ స్టయిలింగ్ మాడిఫై చేస్తుంది మాత్రమే. ఈ సోర్స్ కోడ్ ద్వారా ఎవరైనా యాక్సస్ చేసుకోవచ్చు

ఈ మోడ్ ద్వారా కేవలం స్టయిల్ మాత్రమే

ఈ మోడ్ ద్వారా కేవలం స్టయిల్ మాత్రమే

100 శాతం సురక్షితం కూడా అని ఒక వెబ్ సైట్లో రాసి ఉంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ లేదా యాప్ స్టోర్ వెర్షన్ వాట్సాప్ డెస్క్ టాప్ తో ఈ మోడల్ సపోర్ట్ చేయదు. ఈ మోడ్ ఒక ఓపెన్ సోర్స్ కావడంతో.. డెవలపర్ మీ మెసేజ్ లను చూడలేరు లేదా మీ కాల్స్ కూడా ట్యాప్ చేయలేరు. ఈ మోడ్ ద్వారా కేవలం స్టయిల్ మాత్రమే మారుతుంది తప్ప ఫంక్షనాలటీ కాదని గుర్తించాలి.

ఎనేబుల్ ఎలా ? 

ఎనేబుల్ ఎలా ? 

ఎనేబుల్ ఎలా ?

https://www.whatsapp.com/download లింక్ కాపీ చేయండి.

WhatsApp డెస్క్ టాప్ వెర్షన్ Direct డౌన్ లోడ్ చేయండి.

GitHub నుంచి విండోస్ లేదా మ్యాక్OS కోసం డార్క్ మోడ్ ఎంచుకోండి.

వాట్సాప్ డెస్క్ టాప్ Dark Mode స్టయిలింగ్ డౌన్ లోడ్ చేయండి.

Windows (32Bit/64Bit) కోసం ఈ Link క్లిక్ చేయండి.

MacOS వెర్షన్ కోసం ఈ Link క్లిక్ చేయండి.

zip ఫైల్ ఓపెన్ చేసి WADark.exe లేదా WADark ఒకే పోల్డర్ లో Extract చేయండి.

డార్క్ మోడ్ థీమ్ ఇన్ స్టాల్ పూర్తియ్యేదాక వేచిచూడండి.

ఇదే స్ర్కిప్ట్ ను తిరిగి రన్ చేయడం ద్వారా Light Modeకు మారవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
WhatsApp 200 Crore Global Users milestone, 50 Crore From India, But Security Questions Remain

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X