Home
Apps

ఇండియాలో ఒక్కటైన జియో , వాట్సప్, కారణం ఇదే !

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సప్‌, దేశీయ టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్‌ జియో ఒక్కటయ్యాయి.

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సప్‌, దేశీయ టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్‌ జియో ఒక్కటయ్యాయి. భారత్‌లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ఈ రెండు కంపెనీలు ఇక నుంచి కలిసి పనిచేస్తున్నాయి. ఈ మేరకు వాట్సప్ అధికార ప్రతినిధి నుంచి ప్రకటన వెలువడింది. జియోతో తాము కలిసి పనిచేస్తున్నామని, తమ ఎడ్యుకేషన్‌ క్యాంపెయిన్‌ను కొనసాగిస్తామని వాట్సాప్‌ అధికార ప్రతినిధి కార్ల్‌ వూగ్‌ చెప్పారు.

జియోఫోన్‌, జియోఫోన్‌ 2లో..

జియోఫోన్‌, జియోఫోన్‌ 2లో..

జియోఫోన్‌, జియోఫోన్‌ 2లో ఈ చాట్‌ యాప్‌కు అనుమతించిన రిలయన్స్‌ జియో, నకిలీ మెసేజ్‌లు, రూమర్లు వ్యాప్తి చెందకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.నకిలీ మెసేజ్‌లు నిరోధించడంపై అవగాహన కల్పిస్తూ ఈ ఎడ్యుకేషనల్‌ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది.

వాట్సప్‌ ఎడ్యుకేషన్‌ మెటీరియల్‌

వాట్సప్‌ ఎడ్యుకేషన్‌ మెటీరియల్‌

జియోఫోన్‌ కొత్త యూజర్లకు వాట్సప్‌ ఎడ్యుకేషన్‌ మెటీరియల్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఫార్వర్డ్‌ వాట్సప్‌ మెసేజ్లను గుర్తించడం ఎలా? అవసరమైన మెసేజ్‌లను షేర్‌ చేయడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తోంది.

నకిలీ మెసేజ్ లతో..

నకిలీ మెసేజ్ లతో..

వాట్సప్‌, సోషల్‌ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ మెసేజ్ లతో మూక దాడులు జరిగి, దాదాపు 30 మందికి పైగా వ్యక్తులు చనిపోయారనే వార్తలతో ఈ నిర్ణక్ష్ం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో..

గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో..

వాట్సప్‌ ద్వారా కొన్ని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మైనార్టీలను టార్గెట్‌ చేశారని పోలీసులు చెప్పారు. నకిలీ మెసేజ్‌లను నిర్మూలించడానికి వెంటనే వాట్సప్‌ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.

యూజర్లకు అవగాహన కల్పించడం కోసం..

యూజర్లకు అవగాహన కల్పించడం కోసం..

దీనిలో భాగంగా యూజర్లకు అవగాహన కల్పించడం కోసం ప్రింట్‌, రేడియో యాడ్‌ క్యాంపెయిన్లను, యాప్‌లో కొత్త ఫీచర్లను తీసుకురావడం, డిజిటల్‌ ఎంపవర్మెంట్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం వంటి వాటిని వాట్సప్ చేపడుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp and Reliance Jio come together to curb fake news in India More News AT Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X