వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్లు అదుర్స్
మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. తాజాగా మరో మూడు సరికొత్త ఫీచర్‌లను వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు తీసుకొచ్చింది .
మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. తాజాగా మరో మూడు సరికొత్త ఫీచర్‌లను వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు తీసుకొచ్చింది . వాటిలో మొదటిది PiP, రెండవది Swipe to Reply ఫీచర్ కాగా మూడవది Stickers download . PiP ఫీచర్ ఇప్పటికే iOS లో అందుబాటులో ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం విడుదల చేసింది .

PiP ఫీచర్ ...
ఏదైనా వీడియో ను ప్లే చేస్తూ ఉండగా ఫోన్ తో వేరే ఇతర పనులు ఉంటె ఆ వీడియో ను క్యాన్సల్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఈ PiP ఫీచర్ ఉంటె ఆ అవసరం లేదు ఎందుకంటే ఈ ఫీచర్ ద్వారా మీరు స్క్రీన్ ని ఇతర సైట్స్ అనగా యూట్యూబ్,పేస్ బుక్ , ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ పై మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్ పొందాలంటే...
మీ వాట్సాప్ ను అప్ డేట్ చేసి ఉండి మీరు ఈ PiP ఫీచర్ ను చూసి ఉండకపోతే ఈ ఫీచర్ ను పొందడానికి మీ వాట్సాప్ చాట్ హిస్టరీ ని బ్యాక్ అప్ చేసుకొని వెంటనే రీ ఇన్ స్టాల్ చేయండి .

వినియోగదారులు కొత్త PiP మోడ్ ను ఉపయోగించడానికి....
వినియోగదారులు కొత్త PiP మోడ్ ను ఉపయోగించడానికి 2.18.301 WhatsApp Android బీటా వెర్షన్ ను అప్ డేట్ చేయాలి.

iOS వినియోగదారులకు....
ఈ PiP ఫీచర్ జనవరిలో iOS వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది త్వరలోనే అన్ని Android మొబైల్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది .

Swipe to Reply ....
ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలంటే దానిపై లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై అలా కాదు. రిప్లై ఇవ్వాలనుకున్న మెసేజ్‌పై కుడి వైపునకు స్వైప్ చేస్తే చాలు. వెంటనే మనం కావాలనుకున్న మెసేజ్‌కు రిప్లై ఇవ్వవచ్చు. ఈ ఫీచర్ ఐఫోన్ లో వాట్సాప్ ను వాడుతున్న యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్‌పై వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న వారికి అందుబాటులోకి వచ్చింది. త్వరలో పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ఈ Swipe to Reply ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Stickers download ....
ఇక వాట్సాప్ బీటా వెర్షన్‌లో కొత్తగా వచ్చిన మరో ఫీచర్ Stickers download. వాట్సాప్ యూజర్లు థర్డ్‌పార్టీ యాప్స్ నుంచి కూడా స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

త్వరలో Dark Mode ఫీచర్....
అయితే వాట్సాప్‌లో త్వరలో Dark Mode ఫీచర్ కూడా లభ్యం కానుంది. దీని వల్ల రాత్రి పూట వాట్సాప్‌ను వాడేటప్పుడు యాప్ నల్లని థీమ్‌కు మారుతుంది. దీని వల్ల కళ్లపై అంతగా ప్రభావం పడదు. అయితే ఈ ఫీచర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో ఆ వివరాలను మాత్రం వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే ఈ ఫీచర్ కూడా యూజర్లకు లభ్యమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








