ఇప్పటి నుంచి వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్ షాట్ తీయడం వీలుకాదు.. చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల (Whatsapp New Privacy Feature) భద్రత, సౌకర్యం కోసం అనేక ఫీచర్లను విడుదల చేస్తోంది. ప్రధానంగా యూజర్ల భద్రత కోసం వివిధ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా వాట్సాప్ కీలక ఫీచర్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
వాట్సాప్ తాజాగా అందుబాటులోకి తెచ్చిన భద్రతా ఫీచర్ ద్వారా వాట్సాప్ ప్రొఫైల్‌ను స్క్రీన్‌షాట్ (Whatsapp No Longer allowed profile picture screenshots) తీసే అవకాశం ఉండదు. వాట్సాప్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను వినియోగిస్తున్న వారికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే వినియోగదారులు వ్యక్తిగత సమాచార భద్రత కోసం వ్యూ ఓన్లీ వన్స్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తొలుత ఆండ్రాయిడ్ పోలీస్‌లో గుర్తించారు. అయితే మెటా గానీ వాట్సాప్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేయలేదు. ఎవరైనా వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్‌షాట్ తీసేందుకు ప్రయత్నం చేస్తే.. వ్యక్తిగత సమాచారం కారణంగా స్క్రీన్‌షాట్ తీసేందుకు అనుమతి లేదనే పాప్‌అప్ వస్తోంది.
అనేక మంది వాట్సాప్ వినియోగదారులు ముఖ్యంగా మహిళలు తమ ఫొటోలను వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొనేందుకు ఆసక్తి ఉన్నా.. వివిధ భద్రతా కారణాల రీత్యా వెనక్కి తగ్గుతున్నారు. ఆయా ఫోటోలను స్క్రీన్‌షాట్ తీసి చెడు మార్గాల్లో వినియోగిస్తారనే ఆందోళనతో వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా (DP) తమ ఫొటోలను వినియోగించడం లేదు. తాజాగా విడుదలైన ఫీచర్‌తో ఆ ఆందోళనలకు చెక్ పెట్టినట్లు అయింది.

*వాట్సాప్ సంస్థ ప్రకారం ప్రతి చాట్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే చాటింగ్ సమయంలో ఇందుకు సంబంధించి ఎటువంటి సింబల్ లేదా లేబుల్ కనిపించదు. అయితే త్వరలో ఇందుకు సంబంధించి లేబుల్ చాట్ స్క్రీన్‌పైన కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉందని Wabetainfo తెలిపింది. ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు గత కొన్ని రోజులుగా ఈ ఫీచర్ అందుబాటులో ఉందని తెలిపింది. వాట్పాస్ ఆండ్రాయిడ్ బీటా 2.24.3.17 అప్‌డేట్‌లో గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్ కింద ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ లేబుల్ కనిపిస్తోంది.
యాజర్ల చాట్, వీడియోలు సహా ఇతర కంటెంట్‌కు అధిక ప్రాధాన్యతతో కూడిన భద్రతను కలిగి ఉంటుందని వాట్సాప్ సంస్థ తన భద్రత గురించి వినియోగదారులకు తెలియజేసేందుకు ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర యాప్‌ల ద్వారా వాట్సాప్‌లో చాట్ చేసేవారి డేటా కూడా ఎంతో భద్రంగా ఉంటుందని వాట్సాప్ చెబుతోంది.
** వాట్సాప్‌లో ఇటీవల కీలక ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా తేదీల వారీగా చాట్‌ను సెర్చ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే iOS, Mac డెస్క్‌టాప్, వాట్సాప్ వెబ్ ద్వారా అందుబాటులో ఉండగా ఇటీవలే ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








