Whatsapp ఐఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పిన వాట్సాప్.. 5 నెలలు మాత్రమే టైం..!
వాట్సాప్ ప్రస్తుతం మెసేజింగ్ యాప్‌లలో అత్యధిక యూజర్లు కలిగి ఉన్న ప్లాట్‌ఫాంగా ఉంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సేవలు అందిస్తోంది. వ్యక్తిగత సహా బిజినెస్, కార్యాలయాల అవసరాల కోసం వాట్సాప్‌ను (Whatsapp) ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా వాట్సాప్ కొంత మంది ఐఫోన్ యూజర్లకు షాకింగ్ వార్త చెప్పింది. పాత ఐఫోన్ మోడళ్లలో త్వరలో వాట్సాప్ సేవలు నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.
వాట్సాప్ కొత్త నిర్ణయం 2025 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. iOS 15.1 కంటే ముందున్న OS వెర్షన్‌లపై పనిచేస్తున్న ఐఫోన్‌లు ప్రభావితం కానున్నాయి. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, మరియు 6 ప్లస్ వంటి మోడళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

2025 మే నెల నుంచి iOS 15.1 కంటే పాత OS వెర్షన్‌లపై పనిచేస్తున్న ఐఫోన్‌లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని సంస్థ తెలిపింది. అయితే కొత్త OS వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే వాట్సాప్ సేవలు కొనసాగుతాయని తెలిపింది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఈ వివరాలను వెల్లడించింది.
ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడళ్లు గరిష్ఠంగా iOS 12.5.7 వెర్షన్ పైన మాత్రమే పనిచేస్తాయి. ఈ మోడళ్ల యూజర్లు వచ్చే సంవత్సరం జూన్ నాటికి వాట్సాప్ యాప్‌ను వినియోగించే అవకాశం లేదు. ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుందని, ఆండ్రాయిడ్ యూజర్లపై ఎటువంటి ప్రభావం లేదని తెలిపింది.
వాట్సాప్ ఇటీవల వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌ను Text రూపంలోనికి మార్చుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్ పటిష్ట భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుందని వాట్సాప్ తెలిపింది. యాజర్ల డివైస్‌లోనే వాయిస్ నోట్ టెక్ట్స్‌గా మారుతుందని తెలిపింది. ప్రైవసీ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు. తొలుత కొన్ని భాషలను మాత్రమే సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. అయితే వాయిస్ నోట్ ను అందుకున్న వారు మాత్రమే టెక్స్ట్ ఫార్మాట్‌లోకి మార్చేందుకు అవకాశం ఉంటుందని, పంపిన వారికి ఈ అవకాశం ఉండదని తెలుస్తోంది.
వాట్సాప్‌లో వాయిస్ ట్రాన్సిక్రిప్షన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసేందుకు ప్రత్యేక ఆప్షన్‌లు ఉన్నాయి. ఇందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత చాట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. వాయిస్ మెసేజ్ ట్రాన్సిక్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తోంది. అక్కడ ఉన్న టాగిల్ బటన్ ద్వారా ఆన్ లేదా ఆఫ్ చేసేందుకు అవకాశం ఉంది. మరియు మీకు నచ్చిన భాషను ఎంచుకొనే అవకాశం ఉంది.
వాయిస్ ట్రాన్సిక్రిప్షన్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకున్న అనంతరం వాట్సాప్‌లో వచ్చిన వాయిస్ నోట్ పైన Long Press చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపించిన ట్రాన్స్‌క్రైబ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫలితంగా వాయిస్ నోట్ మీరు ఎంచుకున్న భాషలోకి అనువదించబడుతుంది. తొలుత కొన్ని భాషలను సపోర్టు చేస్తుందని వాట్సాప్ చెబుతోంది.


Click it and Unblock the Notifications








