ప్రైవసీ ఇంకా సెక్యూరిటీకే మా మొదటి ప్రాధాన్యత : వాట్సాప్

ఫేస్‌బుక్ డేటా స్కాండిల్ యూవత్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న నేపథ్యంలో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్, తమ యూజర్లకు కల్పిస్తోన్న డేటా భద్రతకు సంబంధించి వివరణ ఇచ్చుకుంది.

|

ఫేస్‌బుక్ డేటా స్కాండిల్ యూవత్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న నేపథ్యంలో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్, తమ యూజర్లకు కల్పిస్తోన్న డేటా భద్రతకు సంబంధించి వివరణ ఇచ్చుకుంది. వాట్సాప్ వ్యక్తిగత మెసేజ్‌లకు సంబంధించి ఏ విధమైన డేటాను తాము సేకరించటం చేయటం లేదని, వారి డేటా పూర్తిస్థాయిలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఫేస్‌బుక్ యాజమాన్యంలో కొనసాగుతోన్న వాట్సాప్ మోస్ట్ పాపులర్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్లకు పైగా యూజర్లు వినియోగించుకుంటున్నారు. భారత్ విషయానికి వచ్చేసరికి సరాసరిన 200 మిలియన్ల మంది యూజర్లు వాట్సాప్ సేవలను వినియోగించుకుంటున్నారు.

whatsapp

పీటీఐకు వివరణ...
భారత్‌లో వాట్సాప్ మేసిజింగ్ సర్వీసును యాక్టివ్‌గా వినియోగించుకుంటోన్న వారి ప్రైవసీకి ముప్పు పొంచి ఉందన్న ఆందోళన ఉదృతమవుతోన్న నేపథ్యంలో వాట్సాప్ వివరణ ఇచ్చుకుంది. పీటీఐ విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం వాట్సాప్ చాలా కొద్ది మొత్తంలో డేటాను కలెక్ట్ చేస్తుందని, ఇదే సమయంలో యూజర్ల మధ్య షేర్ కాబడి ప్రతి మెసేజ్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తాము కల్పిస్తున్నామని వాట్సాప్ అధికార ప్రతినిధి ఒకరు పీటీఐకు తెలిపారు. యూజర్లకు సంబంధించి ప్రైవసీ అలానే సెక్యూరిటీకి తాము అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.

వాట్సప్ యూజర్ల డేటా చౌర్యం,పేమెంట్ చేస్తే అంతే సంగతులు !వాట్సప్ యూజర్ల డేటా చౌర్యం,పేమెంట్ చేస్తే అంతే సంగతులు !

శత్రుదుర్భేద్యంగా వాట్సాప్..
ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చిన తరువాత వాట్సప్ శత్రు దుర్భేద్యంగా మారింది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత వాట్సాప్ ద్వారా నిర్వహించుకునే అన్ని లావాదేవీలు మరింత గోప్యంగా ఉంటాయి. సెండర్ నుంచి వెళ్లిన మెసేజ్‌ను కేవలం రిసీవర్ మాత్రం చూడగలరు. నేరస్థులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ, హ్యాకర్లు కానీ ఎవ్వరూ ఆ మెసేజ్‌లను అక్రమంగా చూసే ప్రసక్తే లేదు.

మాక్సీ మార్లిన్ స్పైక్..
మాక్సీ మార్లిన్ స్పైక్ అనే క్రిప్టోగ్రాఫర్ ఈ ఎన్‌స్క్రిప్షన్ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ వల్ల వాట్సప్ మెసేజ్‌లను సెండర్, రిసీవర్ తప్ప మూడవ వ్యక్తి చదవలేడు. ఒకవేళ చదవాలనుకున్నా ఆ మెసేజ్‌లోని అక్షరాలు చదవలేని భాషలో కనిపిస్తాయి.

ఎన్‌క్రిప్షన్ డీఫాల్ట్‌గా ఆన్ అయి పోతుంది..
ఆగష్టు 2016 నుంచి ఈ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ అకౌంట్‌ను కలిగి ఉండే ప్రతి డివైస్‌లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది డీఫాల్ట్‌గా ఆన్ అయి పోతుంది. ఈ ఫీచర్ ఆన్ అయి ఉండటం వల్ల వాట్సాప్ యాజమాన్యం కూడా మీ మెసేజ్‌లను చదవలేదు.

Best Mobiles in India

English summary
Facebook-owned WhatsApp, the popular instant messaging service with over 200-million active users in India, might not be as secure as being claimed..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X