Home
Apps

వాట్సాప్‌ నుంచి కీలక ప్రకటన.. భారత్‌లో 66 లక్షల అకౌంట్లపై నిషేధం.. ఎందుకంటే..?

మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో మే నెలలో 66 లక్షల వాట్సాప్‌ (Whatsapp Accounts Banned) ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు తెలిపింది. నిబంధలను ఉల్లఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వీటిలో 12,55,000 అకౌంట్లను ముందస్తుగా బ్లాక్‌ చేసినట్లు వాట్సాప్ తెలిపింది. దీంతోపాటు 13,367 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. భారత్‌ IT చట్టం 2021 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలు మీకోసం.

వాట్సాప్‌ మే నెలకు సంబంధించిన నెలవారీ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. గ్రీవెన్స్‌ అప్పీలేట్ కమిటీ నుంచి 11 ఆదేశాలు వచ్చినట్లు వెల్లడించింది. పారదర్శకతతో వ్యవహరిస్తున్నట్లు, భవిష్యత్‌లోనూ తమ పనితీరును ఇలానే కొనసాగిస్తామని వాట్సాప్‌ తన నివేదికలో వెల్లడించింది. నిబంధనలను ఉల్లఘించిన కారణం సహా ముందస్తు చర్యల్లో భాగంగా మరికొన్నింటిపై నిషేధం విధించింది.

whatsapp taken action on 66 lakhs accounts in india in may

ఏప్రిల్‌ లోనూ భారీగా ఖాతాలపై నిషేధం :
భారత్‌లో ఏప్రిల్ 71 లక్షల అకౌంట్ల పై నిషేధం విధించినట్లు వాట్సాప్‌ గతంలో వెల్లడించింది. వాట్సాప్‌ ఖాతాలపై ఫిర్యాదులు సహా ఇతర సమస్యలపై తమ వద్ద ప్రత్యేక విభాగం ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఇంజినీర్‌ లు, డేటా సైంటిస్ట్‌ లు, అనలిస్ట్‌, పరిశోధకులు మరియు ఆన్‌ లైన్‌ భద్రతా నిపుణులు, చట్టాలపై అవగాహన ఉన్న నిపుణులు ఈ విభాగాల్లో ఉన్నట్లు తెలిపింది.

నిరంతర పర్యవేక్షణ :
దీంతోపాటు మరిన్ని వివరాలు వెల్లడించింది. ఏదైనా ఫిర్యాదులు, అభ్యుంతరకర కంటెంట్‌పై ఫిర్యాదులు మరియు ఏదైనా అకౌంట్‌ను బ్లాక్‌ చేసేందుకు నేరుగా వాట్సాప్‌లోనే అవకాశం ఉందని పేర్కొంది. తప్పుడు సమాచార వ్యాప్తి కట్టడి, యూజర్‌ ఫీడ్‌బ్యాక్‌ సహా సైబర్‌ భద్రతపై నిపుణుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది.

ఈవెంట్స్‌ ఫీచర్‌ :
వాట్సాప్‌ ఇటీవల కాలంలో వినియోగదారుల సౌకర్యం మరియు భద్రత కోసం అనేక కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తోంది. ఇటీవలే గ్రూప్‌ చాట్‌లకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా ఈవెంట్‌లను క్రియేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం కమ్యూనిటీలకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండగా.. సాధారణ గ్రూప్‌లకు కూడా త్వరలో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం కొద్ది మందికే అందుబాటులో ఉంది :
ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులో లేదు. దశలవారీగా విడుదల కానుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు బీటా వెర్షన్‌ను వినియోగించుకోవచ్చు. అయితే కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉందని గుర్తించుకోవాలి. త్వరలోనే వినియోగదారులు అందరికీ అందుబాటులోకి రానుంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటి కప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp banned 66 lakhs accounts in india in may 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X