Home
Apps

భారత్‌లో ఫిబ్రవరి నెలలో 75 లక్షల ఖాతాలను నిషేధించిన వాట్సాప్‌.. పూర్తి వివరాలు..!

మెటా నేతృత్వంలోని ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ (Whatsapp) ఇటీవల కాలంలో అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం వివిధ ఫీచర్లను లాంచ్‌ చేస్తోంది. అయితే తాజాగా వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫిబ్రవరిలో ఏకంగా 75 లక్షల ఖాతాలను నిషేధం చేసింది.

ఐటీ రూల్స్‌ 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తన నెలవారీ నివేదికలో వాట్సాప్‌ ఈ వివరాలను వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి 29 వరకు 76,28,000 ఖాతాలను బ్యాన్‌ చేశామని మరియు 14,24,000 అకౌంట్లను ముందస్తుగా నిషేధించినట్లు పేర్కొంది.

Whatsapp Banned 75 lakh accounts

భారత్‌లో వాట్సాప్‌ మెసేంజర్‌కు సుమారు 500 మిలియన్‌ యూజర్లు ఉన్నారు. మరియు ఫిబ్రవరిలో 16,618 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. అదే జనవరి 1-31 తేదీల మధ్య 6,728,000 ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు తెలిపింది. అలాగే 1,358,000 ఖాతాలపై ఎటువంటి ఫిర్యాదులు లేకుండానే ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

వినియోగదారుల భద్రత కోసం డేటా సైంటిస్ట్‌, ఎనలిస్ట్‌, రిసెర్చర్‌ మరియు ఇతర నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. వాట్సాప్‌ గత కొన్ని నెలలుగా వినియోగదారుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఫిర్యాదులు సహా ఇతర నేరాల్లో ప్రమేయం ఉన్న వాట్సాప్‌ ఖాతాలపై చర్యలు తీసుకుంటోంది.

*వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ ఫేస్‌ను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కాలింగ్‌ ఇంటర్‌ ఫేస్‌ యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ 2.24.7.19 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్‌ WaBetainfo ఈ వివరాలను వెల్లడించింది. వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌లో కొత్తగా మినిమైజ్‌ బటన్‌ను తీసుకురానున్నట్లు తెలిసింది. ఫలితంగా వాట్సాప్‌ కాలింగ్ ఇంటర్‌ఫేస్‌ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది.

వాట్సాప్ కాలింగ్‌ సమయంలో ప్రస్తుతం ఉన్న ఆందోళనకు చెక్‌ పెడుతుందని తెలుస్తోంది. వాట్సాప్‌ కాల్‌ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మినిమైజ్‌ బటన్‌ ఉపయోగపడనుంది. ఫలితంగా ఇంటర్‌ఫేస్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో కాలింగ్‌ మరింత సౌకర్యంగా ఉంటుందని తెలుస్తోంది.

* దీంతోపాటు వాట్సాప్‌ స్టేటస్‌ బార్‌లోనూ భారీ మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WAbetainfo ఆధారంగా యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు మరిన్ని టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.7.16 లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందని తెలిపింది. ఈ వెర్షన్‌లో వాట్సాప్‌ స్టేటస్‌ కొత్త ఇంటర్‌ఫేస్‌ను గుర్తించవచ్చు.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ఆధారంగా స్టేటస్‌ డిజైన్‌లో వేర్వేరు మీడియా ఫార్మాట్‌లకు సులభంగా మారవచ్చు. ప్రస్తుతం స్టేటస్‌ బార్‌ వాట్సాప్‌ దిగువన ఉంది. అందులో టెక్ట్స్‌, వీడియో, ఫోటోలను వేర్వేరుగా సెలక్ట్‌ చేసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం నేరుగా వాట్సాప్‌ స్టేటస్‌ బార్ నుంచి మీడియాను సెలక్ట్‌ చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో రానున్న అప్‌డేట్‌లలో విడుదల చేసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Whatsapp Banned 75 lakh accounts in india in february 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X