Whatsapp నెలవారీ నివేదికలో కీలక వివరాలు.. ఈసారి ఏకంగా 85 లక్షల అకౌంట్‌లు..!!
భారత్‌లో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ను (Whatsapp) భారీ సంఖ్యలో యూజర్‌లు ఉన్నారు. సుమారు 60 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అధిక సంఖ్యలో ఉన్న తన యూజర్ల కోసం వాట్సాప్ అనేక ఫీచర్‌లను విడుదల చేస్తోంది. వాట్సా్ప్ యూజర్‌ల సౌకర్యం, భద్రత కోసం ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతోపాటు నెలవారీ వాట్సాప్ తన నివేదికను వెల్లడిస్తుంది. వాట్సాప్ దుర్వినియోగం, ఐటీ చట్టాల ప్రకారం తీసుకున్న చర్యలను ఇందులో ప్రస్తావిస్తుంది.
తాజాగా వాట్సాప్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2024 నెలలో ఏకంగా 85 లక్షల భారత యూజర్ల అకౌంట్‌లపై నిషేధం విధించిందినట్లు (Whatsapp Banned 85 lakh Indian Accounts) తెలిపింది. ఈ మేరకు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. భారత ఐటీ రూల్స్ 2021 సహా వాట్సాప్ దుర్వినియోగం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తన ప్రకటనలో తెలిపింది.

ఈ నివేదిక ఆధారంగా సెప్టెంబర్ నెలలో 85 లక్షల వాట్సాప్ అకౌంట్‌లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. అయితే ఇందులో 16,58,000 అకౌంట్‌లపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, అయితే భారత ఐటీ నిబంధనలు 2021 ను అతిక్రమించినందు వల్ల ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్లు వివరించింది.
వాట్సాప్ దుర్వినియోగం సహా స్థానిక చట్టాల ఉల్లంఘనలకు పాల్పడినా, ఎటువంటి ఫిర్యాదులు అందినా వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. తప్పుడు సమాచారం షేర్ చేయడం సహా స్పామ్ మెసేజ్‌లు పంపే అకౌంట్‌లపై వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. తప్పుడు సమాచార వ్యాప్తికి వాట్సాప్ వేదిక కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఆగస్టు 2024 లోనూ వాట్సాప్ ఇదే స్థాయిలో అకౌంట్‌ను బ్యాన్ చేసింది. సుమారు 84.58 లక్షల అకౌంట్‌లపై నిషేధం విధించింది. ఇందులో 16,61,000 అకౌంట్‌లను ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా బ్యాన్ చేసినట్లు వాట్సాప్ గత నెల నివేదికలో వెల్లడించింది. చట్టాలు, యాప్ దుర్వినియోగం కారణంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రాంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెన్షన్ ఫీచర్.. వాట్సాప్ యూజర్‌లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ అప్‌లోడ్ సమయంలో మనకు నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేయవచ్చు. దీంతో మన స్టేటస్ గురించి నోటిఫికేషన్ రూపంలో వారికి సమాచారం అందుతుంది.
వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ సమయంలో మెన్షన్ సింబల్ గా @ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు నచ్చిన వారిని ఎంచుకొని.. ట్యాగ్ చేయవచ్చు. ఇన్‌స్టాలో ఈ ఫీచర్ ఇప్పటికే ఉంది. అయితే ట్యాగ్ చేసిన వ్యక్తి ఐడీ అందరికీ కనిపిస్తుంది. అదే వాట్సాప్‌లో ఎవరికి ట్యాగ్ చేశామో వారికి తప్ప.. మిగిలిన వారికి తెలియదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








