ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ QR code సపోర్ట్

|

ఆన్‌లైన్ నగదు లావాదేవీలకు మరింత ఊతమిస్తూ విప్లవాత్మక క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతానికి టెస్టింగ్ ఫేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బేటా ఛానల్‌లో ఉన్న యాజర్లకు మాత్రమే లభ్యమవుతోంది. మరికొన్ని వారాల్లో అఫీషియల్ యాప్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వాట్సాప్ క్యూఆర్ కోడ్స్ ద్వారా నగదు పంపాలనుకునే బేటా యూజర్లు వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. పేటీఎమ్ వంటి డిజిటల్ పేమెంట్ సర్వీసులతో పోటీపడే క్రమంలో వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

 
ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ QR code సపోర్ట్

ఈ నేపథ్యంలో తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఫీచర్‌తో వాట్సాప్ ఆండ్రాయిడ్ బేటా యూజర్లు క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేసుకోవటం ద్వారా నగదును పంపుకునే వీలుంటుంది. ఇదిలా ఉండగా 'Send to UPI ID' పేరుతో మరో ఫీచర్‌ను వాట్సాప్ ఇటీవల విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా UPI IDని ఉపయోగించుకుని యూజర్లు నగదును పంపుకోవచ్చు.

వాట్సాప్ పేమెంట్స్ క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?
వాట్సాప్ క్యూఆర్ కోడ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి WhatsApp beta 2.18.93 వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. బేటా వెర్షన్ ఇన్‌స్టాల్ అయిన తరువాత యాప్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి Payments ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని న్యూ పేమెంట్ పై క్లిక్ చేసి క్యూఆర్ కోడ్‌ను ఎంపిక చేసుకోవాలి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ QR code సపోర్ట్

క్యూఆర్ కోడ్ సెలక్ట్ అయిన వెంటనే స్కానర్ ఓపెన్ అయి కోడ్‌ను రికగ్నైజ్ చేసుకుంటుంది. ఆ తరువాత పేమెంట్‌ను ఎంటర్ చేసి ప్రమాణీకరించటానికి మీకు కేటాయించబడిన UPI PINను ఉపయోగిస్తే సరిపోతుంది. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా లావాదేవీని విజయవంతంగా పూర్తి చేయాలంటే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సప్‌ ఆఫర్‌ చేసే పేమెంట్స్‌ ఫీచర్‌ ఉండాలి.

ఎయిర్‌టెల్‌కి పోటీగా ఐడియా రోజుకు 2జిబి డేటా ప్లాన్ఎయిర్‌టెల్‌కి పోటీగా ఐడియా రోజుకు 2జిబి డేటా ప్లాన్

నోట్ల రద్దు తరువాత నగదురహిత లావాదేవీలకు భారత్‌లో ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో IMPS ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే UPI ఆధారిత చెల్లింపు సర్వీసులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ మెసేజింగ్ సర్వీసులైన WeChat, Hike Messengerలు ఇప్పటికే పేమెంట్ సర్వీసులను సపోర్ట్ చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్ కూడా ఈ తరహా పేమెంట్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. వాట్పాప్‌కు భారత్‌లో 200 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ పేమెంట్స్ సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఎక్కువుగా వాట్సాప్‌నే వినియోగించుకుంటారు.

Best Mobiles in India

English summary
WhatsApp has started rolling out support for QR codes that enable monetary transactions. This feature is currently being enabled for users in the Android beta channel, with a wider rollout expected in the next few weeks.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X