Just In
- 22 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్‌లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Finance
షాకిస్తున్న బంగారం ధరలతో సామాన్యులకు పసిడి అందని దాక్షే.. ఈరోజు భారీగా పెరిగిన ధరలిలా!!
- Movies
బ్రేకింగ్: ప్రముఖ నటి జమున కన్నుమూత.. దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ!
- News
సమయం లేదు మిత్రమా.. బీజేపీలో ఈటల రాజేందర్ కు పెద్ద కష్టమే!!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఇండియాలో 22 లక్షల అకౌంటులను బ్యాన్ చేసిన వాట్సాప్!! ఎందుకో తెలుసా?
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడకం అధికంగా ఉండడంతో ఏదైనా పోస్ట్ పెడితే త్వరగా జనాలలోకి చేరుతుంది. కానీ కొంత మంది దీనిని స్వార్థం కోసం ఉపయోగించడంతో ముందు నుంచి కూడా వాట్సాప్ అటువంటి వారిని బ్లాక్ చేస్తూ వస్తోంది. జూలై నెలలో వాట్సాప్ 22 లక్షల అకౌంటులను బ్యాన్ చేసింది. అకౌంటుల బ్యాన్ కోసం వచ్చిన అభ్యర్థనలను సూచిస్తూ కంపెనీ తన నెలవారీ నివేదికను విడుదల చేసింది. జూలై నెలలో వాట్సాప్ నుండి కొత్త నివేదికను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ) రూల్స్ 2021 విభాగం క్రింద ప్రచురించబడింది.

జూన్ 1, 2022 నుండి జూన్ 30, 2022 మధ్యకాలంలో వాట్సాప్ సంస్థ సుమారు 22,10,000 అకౌంటులను బ్యాన్ చేసింది. వాట్సాప్ యొక్క ఫిర్యాదు విధానాల ద్వారా భారతదేశంలోని వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకుంది. ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ భారతదేశంలో బ్యాన్ చేసిన అకౌంటులపై భారత చట్టాలు లేదా వాట్సాప్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడి వాటిపై ఈ చర్యను తీసుకుంది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నివారించడంలో వాట్సాప్ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. సంవత్సరాలుగా వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లోని వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడమే కాకుండా డేటా శాస్త్రవేత్తలు మరియు నిపుణులు ఈ ప్రక్రియలలో స్థిరంగా పనిచేస్తున్నారు. IT రూల్స్ 2021 ప్రకారం మేము జూన్ 2022 నెలలో మా నివేదికను ప్రచురించాము అని వాట్సాప్ ప్రతినిధి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు.

వాట్సాప్ వినియోగదారుల యొక్క భద్రతా నివేదికలో ముఖ్యంగా వినియోగదారులు స్వీకరించబడిన ఫిర్యాదుల వివరాలు మరియు వాట్సాప్ ద్వారా తీసుకున్న సంబంధిత చర్యలు అలాగే వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వాట్సాప్ యొక్క స్వంత నివారణ చర్యలు కూడా అదనంగా ఉన్నాయి. నెలవారీ నివేదికలలో క్యాప్చర్ చేయబడిన తాజా సమాచారం ప్రకారం జూన్ నెల మొత్తంలో వాట్సాప్ 2.2 మిలియన్ అకౌంటులను నిషేధించింది.

వాట్సాప్ హానికరమైన అకౌంటులను ఎలా గుర్తిస్తుంది?
వాట్సాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా మోసపూరిత కార్యాచరణను గుర్తించడానికి వివిధ రకాల సెక్యూరిటీ ఫీచర్‌లు మరియు నియంత్రణలను ఉపయోగిస్తుంది. ఈ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులు, పరిశోధకులు వంటి నిపుణుల బృందాన్ని ఆన్‌లైన్ సెక్యూరిటీ మరియు టెక్నాలజీ అభివృద్ధిలో నియమించినట్లు మెటా-యాజమాన్య సంస్థ పేర్కొంది. అదనంగా వినియోగదారులు అప్లికేషన్‌లోని కాంటాక్ట్‌లను బ్లాక్ చేయవచ్చు మరియు సమస్యాత్మక కంటెంట్‌ను నివేదించవచ్చు. వినియోగదారులు భద్రతతో రాజీపడే అకౌంటులను తొలగించేందుకు ఈ నివేదికలపై పని చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

వాట్సాప్ కంపానియన్ మోడ్ ఉపయోగం
వాట్సాప్ ప్రతి ఒక్కరికి వాడుకలో ఉండడంతో మీ బాస్ నుండి మీ దూరపు బంధువు వరకు ప్రతి ఒక్కరితో కూడా చాట్ చేస్తూ మీరు తెలుపవలసిన సమాచారాన్ని త్వరగా తెలపడంతో పాటుగా సందర్భోచితంగా పంపడానికి వీలుగా ఉంటుంది. మీరు రోజంతా వేర్వేరు పరికరాలతో పరస్పర చర్య చేస్తున్నందున వాట్సాప్ ప్రతి రకమైన పరికరానికి మద్దతును ఇవ్వడం అవసరంగా ఉంటుంది. ఇప్పటివరకు వాట్సాప్ అనేది స్మార్ట్‌ఫోన్‌లు, ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్‌లు, PC, Mac మరియు వెబ్‌లో మాత్రమే పని చేస్తోంది. కానీ మీరు అదే అకౌంటును మీ ఫోన్ కాకుండా వేరే డివైస్ లో ఉపయోగించాలనుకుంటే వాట్సాప్ వెబ్ అనుమతిస్తుంది. కాకపోతే మీరు మీ యొక్క అదే వాట్సాప్ అకౌంటును మరొక ఫోన్‌లో కూడా ఉపయోగించవచ్చు. 'కంపానియన్ మోడ్' అందుబాటులోకి వచ్చిన తరువాత ఒకే వాట్సాప్ అకౌంటును మరొక ఫోన్ లో కూడా ఉపయోగించడానికి అనుమతిస్తుంది అని కంపెనీ తెలిపింది. వాట్సాప్ యొక్క తదుపరి అప్ డేట్ లో అందుబాటులోకి వచ్చే కంపానియన్ మోడ్‌తో ఒకేసారి రెండు ఫోన్‌లలో మీ అకౌంటును యాక్సిస్ చేయడానికి అనుమతిస్తుంది. మీ చాట్ హిస్టరీ అనేది మీరు యాక్సిస్ చేసిన అన్ని డివైస్ ల అంతటా సమకాలీకరించబడుతుంది. ఇది అసలు ఫోన్ నుండి ప్రభావవంతంగా తరలించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల కోసం వాట్సప్ ప్రస్తుతం అందించే చాట్ మైగ్రేషన్ కార్యాచరణ కంటే ఇది ఖచ్చితంగా సులభంగా ఉంటుంది. ప్రస్తుత విధానంలో డేటా బదిలీ కోసం కేబుల్ అవసరం ఉంటుంది. అయితే వాట్సాప్ యొక్క కంపానియన్ మోడ్ అందుబాటులోకి రావడంతో డేటా కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటుంది. కానీ ఈ ఫీచర్ ఒక స్మార్ట్‌ఫోన్ మరియు PCలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లతో సహా మూడు ఇతర పరికరాలకు పరిమితం చేయబడుతుంది. అంటే ప్రాథమిక ఫోన్ కాకుండా మూడు స్మార్ట్ డిస్‌ప్లేలను దీనిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

వాట్సాప్ చాట్ బ్యాకప్ మెను కొత్త ఫీచర్
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అప్లికేషన్‌లో పరీక్షించబడుతున్న తాజా ఫీచర్‌లలో ఒకటైన 'చాట్ బ్యాకప్ మెను' కొత్త ఎంపికను ప్రముఖ ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo గుర్తించినట్లు పేర్కొంది. వీరు ఈ కొత్త ఫీచర్‌కి సంబందించిన స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నారు. ఈ ఫీచర్ బీటా టెస్టర్‌లకు మాత్రమే కాకుండా అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని గమనించడం ముఖ్యం. వాట్సాప్ ఈ ఫీచర్‌ని పూర్తిగా ట్రాష్ చేసే లేదా వేరే విధంగా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు తమ చాట్‌లను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. మీరు ప్రాథమిక పరికరంలో మీ ఖాతాకు లాగిన్ చేసిన ప్రతిసారీ, మీరు మీ గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేయబడిన తాజా బ్యాకప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాకప్‌పై వినియోగదారులకు ఎటువంటి నియంత్రణ ఉండదు. కొత్త ఫీచర్ రాకతో వినియోగదారులు వాట్సాప్ చాట్ బ్యాకప్‌లను వారి స్థానిక ఇంటర్నల్ స్టోరేజ్ లేదా ఏదైనా ఇతర క్లౌడ్ స్టోరేజ్‌లో స్టోర్ చేయగలరు. ఈ బ్యాకప్‌లలో మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు మరియు ఇతర ఫైల్‌లను కలిగి ఉన్న మీ మొత్తం చాట్ డేటాను కలిగి ఉంటాయి. వినియోగదారులు తమ యొక్క చాట్‌ను బ్యాకప్ డౌన్‌లోడ్ చేయగలరు మరియు దానిని తిరిగి గూగుల్ డ్రైవ్‌లో ఉంచగలరు కూడా. ఇది వినియోగదారులకు వారి స్వంత డేటాపై మరింత నియంత్రణను అందిస్తుంది. అంతేకాకుండా వారు కోరుకున్న ప్రదేశంలో స్టోర్ చేసుకునే ఎంపికను కూడా అందిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470