WhatsApp లో కొత్త ఫీచర్!!! షాపింగ్ చేయడం మరింత సులభం...
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ప్రభుత్వాలు సామాజిక దూరం పాటిస్తూ బయట తిరగడానికి అనుమతులను ఇచ్చింది. కానీ ప్రస్తుత సమయంలో ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి డిజిటల్ యాప్ లను అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే వీటి యొక్క వినియోగం కూడా గణనీయంగా కూడా పెరిగింది. వాట్సాప్ తన బిజినెస్ వినియోగదారుల కోసం ప్రతిరోజూ కొత్త కొత్త ఫీచర్లను జతచేస్తోంది. ఇప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్తగా కార్ట్స్ అనే ఫీచర్ ను జోడించింది.

వాట్సాప్ బిజినెస్ అకౌంట్ 'కార్ట్స్' కొత్త ఫీచర్
వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో కొత్తగా జోడించిన కార్ట్స్ ఫీచర్ తో వినియోగదారులు ఇప్పుడు నేరుగా కేటలాగ్‌ను బ్రౌజ్ చేయగలరు. ఇందులో వినియోగదారులు ఒకే సారి అనేక ఉత్పత్తులను ఎంచుకోవచ్చు మరియు వాటిని ఆర్డర్ చేయడానికి మెసేజ్ కూడా పంపగలరు. ఈ ఫీచర్ వ్యాపారాలకు చేసిన ఆర్డర్ ఎంక్వైరీలను ట్రాక్ చేయడం, కస్టమర్ల నుండి అభ్యర్థనలను స్వీకరించడం మరియు అమ్మకాలను నిర్వహించడం మరియు మూసివేయడం వంటి వాటిని మరింత సులభం చేస్తుంది. రెస్టారెంట్ లేదా బట్టల దుకాణంలో ఒకే సారి అనేక వస్తువులను మీరు కొనుగోలు చేసేటప్పుడు ఈ కొత్త ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని వాట్సాప్ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

వాట్సాప్ కార్ట్స్ షాపింగ్ ఫీచర్
వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో కార్ట్స్ కొత్త ఫీచర్ ఈ రోజు నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. దీని యొక్క సాయంతో మీకు సమీపంలో ఉన్న రెస్టారెంట్ నుండి మీకు నచ్చిన వంటకాన్ని ఆర్డర్ చేయవచ్చు. అలాగే షాపింగ్ కోసం బయటకు పోకుండా మీకు దగ్గరలో గల బట్టల దుకాణం నుండి మీకు నచ్చిన బట్టలను ఎన్ని కావాలి అన్న ఒకేసారి కొనుగోలు చెయవచ్చు. వ్యాపారం చేసే వినియోగదారులకు ఈ కార్ట్స్ ఫీచర్ ఒక కల్పవృక్షంలా పనిచేస్తున్నది.

వాట్సాప్ కార్ట్స్ ఫీచర్ ఉపయోగించే విధానం
వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో కార్ట్స్ ను ఉపయోగించడం చాలా సులభం. వినియోగదారులు ఎవరైనా సరే వారు కొనాలనుకుంటున్న వస్తువులను మొదట సెర్చ్ చేసి వాటిని ఎంచుకొని "యాడ్ టూ కార్ట్" నొక్కండి. కార్ట్ పూర్తయిన తర్వాత వినియోగదారులు దానిని వ్యాపారస్తునికి మెసేజ్ రూపంలో పంపవలసి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల జాబితా
ప్రపంచవ్యాప్తంగా 175 మిలియన్లకు పైగా ప్రజలు ప్రతిరోజూ వాట్సాప్ బిజినెస్ అకౌంటు ద్వారా మెసేజ్ లను పంపుతున్నారు. భారతదేశంలో 3 మిలియన్లకు పైగా ప్రజలు వాట్సాప్ బిజినెస్ అకౌంటు జాబితాలో ఉన్నారని కంపెనీ ప్రకటించింది. వాట్సాప్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో 76 శాతం మంది ఒక సంస్థతో వ్యాపార లావాదేవీలు వాట్సాప్ ద్వారా చేస్తున్నారు. ఈ చాట్‌ల ద్వారా ఎక్కువ షాపింగ్ జరుగుతుండటంతో కొనుగోలు మరియు అమ్మకం మరింత సులభతరం చేయడానికి కొత్త ఫీచర్ ను విడుదల చేసినట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








