Whatsappలో ఇక మెసేజ్‌ల‌ను ఎడిట్ చేయ‌డం సాధ్య‌మే.. ఇది చ‌ద‌వండి!

|

Metaకు చెందిన ప్ర‌ముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం Whatsapp, ప్ర‌పంచంలోనే భారీ యూజ‌ర్ల‌ను క‌లిగి ఉంది. ఈ కంపెనీ త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు అనేక కొత్త ఫీచ‌ర్ల‌ను విడుద‌ల చేస్తుంది. తాజాగా, వాట్సాప్ "ఎడిట్ మెసేజ్" Edit message అనే మ‌రో కొత్త ఫీచర్‌పై పని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదేంటంటే.. వినియోగ‌దారులు త‌మ మిత్రుల‌కు పంపిన సందేశాన్ని(మెసేజ్ ఎడిట్‌) సవరించడానికి అనుమతిస్తుంది.

 
Whatsappలో ఇక మెసేజ్‌ల‌ను ఎడిట్ చేయ‌డం సాధ్య‌మే.. ఇది చ‌ద‌వండి!

గ‌తంలో Whatsappలో మెసేజ్‌ల‌లో ఏమైనా త‌ప్పులు దొర్లితే మెసేజ్ పూర్తిగా డెలీట్ చేసి కొత్త మెసేజ్ పంప‌డ‌మే ప‌రిష్కారంగా ఉండేది. కానీ, ఈ ఎడిట్ మెసేజ్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే.. ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్ ప‌డుతుంది. అవ‌త‌లి వ్య‌క్తుల‌కు మ‌నం పంపిన మెసేజ్‌లో త‌ప్పు దొర్లినా మ‌ళ్లీ ఎడిట్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ ఫీచర్ బీటా ప్రోగ్రామ్‌లో భాగమైనందున, WhatsApp యొక్క భవిష్యత్తు అప్‌డేట్‌ల‌లో ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని అంతా భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉంది:

ప్ర‌స్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉంది:

WhatsApp కొత్త ఫీచర్‌లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo ప్రకారం, వాట్సాప్ కంపెనీ ఎడిట్ మెసేజ్ అనే కొత్త ఫీచ‌ర్‌కు సంబంధించి ప్ర‌స్తుతం టెస్టింగ్ చేస్తోంది. ఎవ‌రైనా వినియోగ‌దారులు అవ‌త‌లి వ్య‌క్తులకు ఆద‌రాబాద‌రాగా మెసేజ్ పంపిన‌పుడు అందులో త‌ప్పులు దొర్లే అవ‌కాశం ఉంటుంది. అయితే.. అలాంటి త‌ప్పుల్ని ఎడిట్ చేసుకోవ‌డానికి వీలుగా ఈ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డనుంది. ప్రస్తుతం, ఈ ఫీచ‌ర్ అభివృద్ధి ద‌శ‌లో ఉంది మరియు ఆండ్రాయిడ్ 2.22.20.12 వెర్షన్ లోని WhatsApp ఇది గుర్తించబడింది.

బీటా టెస్ట‌ర్ల ఫీడ్‌బ్యాక్ త‌ర్వాత అంద‌రికీ అందుబాటులోకి:

బీటా టెస్ట‌ర్ల ఫీడ్‌బ్యాక్ త‌ర్వాత అంద‌రికీ అందుబాటులోకి:

Whatsapp ఎడిట్ మెసేజ్ ఫీచర్ భవిష్యత్ అప్‌డేట్‌ల ద్వారా వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ, సాధార‌ణ యూజ‌ర్ల‌కు అందుబాటులో తేవ‌డానికి ముందు ఈ ఫీచ‌ర్‌ను ప‌రీక్ష‌ల నిమిత్తం బీటా టెస్ట‌ర్‌ల‌కు ముందుగా చేరువ చేస్తారు. బీటా టెస్టర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.

మెసేజ్ ఎడిట్‌కు టైం క్యాప్ పెట్టే అవ‌కాశం:
 

మెసేజ్ ఎడిట్‌కు టైం క్యాప్ పెట్టే అవ‌కాశం:

ఎడిట్ మెసేజ్ ఫీచర్ యొక్క ఇతర వివరాలు ఏవీ ప్రస్తుతానికి తెలియ‌వు. కానీ, ఎడిట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌ల‌కు 'ఎడిటెడ్' లేబుల్‌ను చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని స‌మాచారం. వాట్సాప్ మెసేజ్‌లలో పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఉన్న ఏకైక పరిష్కారం వాటిని తొలగించి వాటిని మళ్లీ పంపడం మాత్రమే. కాబట్టి ఈ ఫీచర్ అందుబాటులోకి వ‌స్తే.. చాలా మందికి ఆ స‌మ‌స్య‌లు తీరిపోతాయి. కాక‌పోతే, ఈ ఫీచర్ సందేశాలను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేయ‌డానికి టైమ్ క్యాప్‌తో రావొచ్చ‌ని కూడా ప‌లువురు భావిస్తున్నారు.

తేదీ ఆధారంగా మెసేజ్‌ల‌ను దొర‌క‌బ‌ట్టే మ‌రో ఫీచ‌ర్ కోసం కూడా ప్ర‌య‌త్నాలు:

తేదీ ఆధారంగా మెసేజ్‌ల‌ను దొర‌క‌బ‌ట్టే మ‌రో ఫీచ‌ర్ కోసం కూడా ప్ర‌య‌త్నాలు:

మీరు Whatsappలో పాత మెసేజ్‌లను కోల్పోవడం లేదా కొన్నిసార్లు అవి చాట్ లో నుంచి డిలీట్ అయిపోవడం వల్ల మీకు ముఖ్యమైన కొన్ని చాట్ లు మీకు గుర్తుకు రావు. ఇలాంటి పరిస్థితి నుంచి మీరు త్వరలో రక్షించబడవచ్చు. దీనికోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. అనేక గ్రూప్ లు మరియు వ్యక్తిగత చాట్‌ల నుండి సందేశాలలో, తరచుగా ప్రజలు వాట్సాప్ ను వాడుతుంటారు.ఈ కొత్త ఫీచర్ తో మీ మొత్తం మెసెజ్ ల నుండి మీకు కావలసిన మెసెజ్ ను కనుగొనడానికి మీకు ఎక్కువ స్క్రోల్ చేయకుండా, తేదీ ఆధారంగా మీరు వాట్సాప్ మెసెజ్ లను కనుగొనవచ్చు.

WeBetaInfo నివేదిక ప్రకారం:

WeBetaInfo నివేదిక ప్రకారం:

WeBetaInfo నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ రెండేళ్ల క్రితం నుంచే పైప్‌లైన్‌లో ఉంది కానీ తర్వాత స్క్రబ్ చేయబడింది. కానీ ప్రస్తుతం, "TestFlight నుండి iOS 22.0.19.73 అప్‌డేట్ కోసం WhatsApp బీటాను విడుదల చేసిన తర్వాత, WhatsApp ఎట్టకేలకు భవిష్యత్తులో మళ్లీ ఫీచర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోందని మేము కనుగొన్నాము!"

ఈ కొత్త ఫీచర్ తో :

ఈ కొత్త ఫీచర్ తో :

ఈ సమాచారం కొన్ని నివేదికల ద్వారా గ్రహించాము. ఈ కొత్త ఫీచర్ తో మీరు మీ చాట్ లో ఒక నిర్దిష్ట తేదీకి త్వరగా వెళ్లవచ్చు. మొత్తం స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు ఆ ఖచ్చితమైన తేదీ నుండి అన్ని సందేశాలను చదవడం ప్రారంభించవచ్చు. తేదీ ఆధారం గా మెసెజ్ లను చూడటం, డిలీట్ చేయడం వంటివి వంటి విషయాలు సులభం కానున్నాయి. ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ప్రత్యేకించి మీరు నిర్దిష్ట కాంటాక్ట్‌తో షేర్ చేసిన మొదటి మెసెజ్ ను కనుగొనాలనుకున్నప్పుడు లేదా నిర్దిష్ట తేదీలో ఏ మెసెజ్ లను షేర్ చేశారో మీరు చదవాలనుకున్నప్పుడు.ఇది ఏంటో ఉపయోగ పడుతుంది.

Best Mobiles in India

English summary
Whatsapp brings new update called Edit Message, its under testing in beta version

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X