వాట్సప్ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా...

Written By:

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ చిన్న వ్యాపార సంస్థల సౌకర్యం కోసం వాట్సప్‌ బిజినెస్‌' పేరుతో ఉచిత ఆండ్రాయిడ్‌ యాప్‌ విడుదల చేసింది. కంపెనీలు తమ కస్టమర్లతో కనెక్ట్‌ అయ్యేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. 130 కోట్ల వాట్సప్‌ యూజర్లు వ్యాపార సంస్థలతో చాట్‌ చేయడం ఇకపై మరింత సులువు అవుతుందని కంపెనీ పేర్కొంది. ప్రజల కోసం రూపొందించిన వాట్సప్‌ను వ్యాపార అవసరాలకూ ఉపయోపడేలా మెరుగుపరచాలనుకుంటున్నట్టు తెలిపింది. దీన్ని ఎలా మీ ఫోన్లో అప్ డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

వాట్సప్ సమస్య నిజమేనంటున్న Xiaomi, ఎర్రర్‌ సమస్యను ఇలా ఫిక్స్ చేసుకోమంటోంది !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో కెళ్లి..

మీరు మీ మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో కెళ్లి ఈ యాప్ ని వాట్సప్ మాదిరిగానే డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కాగా ఈ యాప్ మీరు మరో నంబరుతో వాడుకోవచ్చు.

తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి ..

ఈ యాప్‌లో తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి వెరిఫికేషన్ పూర్తైన తర్వాత వెరిఫైడ్ అంటూ గ్రీన్ కలర్ టిక్ వస్తుంది. కస్టమర్లతో మంచి సంబంధాలను నెరపడానికి.. వారు అడిగిన వాటికి త్వరగా రిప్లై ఇ్వవడానికి.. వారికి గ్రీటింగ్ మెసేజ్‌లు పంపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే కస్టమర్ల అనుమతితోనే వ్యాపారులు మెసేజ్‌లు పంపగలరు.

వ్యాపార వేళలను వినియోగదారులకు..

వ్యాపార వేళలను వినియోగదారులకు మెసేజ్ ద్వారా తెలుపుతుంది. కాగా బిజినెస్ యాప్ రానున్న రోజుల్లో భారీ వ్యాపార ప్రణాళికలకు ఉపయోగపడగలదని అంటున్నారు. ఎయిర్ లైన్స్, ఈ కామర్స్ సైట్స్, బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను పెంచుకోవచ్చని అంటున్నారు.

 

 

ల్యాండ్‌లైన్ యాడ్

వాట్సప్ బిజినెస్‌లో ల్యాండ్‌లైన్ నంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాట్సప్‌లో ఈ ఫీచర్ లేదు. ఎక్కువ మంది వ్యాపారస్తులు ల్యాండ్‌లైన్ నంబర్ యూజ్ చేస్తుండటంతో ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది.

ఆటో రిప్లైస్

మీరు వాట్సప్ బిజినెస్‌లో ఆటో రిప్లై ఫీచర్ సెట్ చేసుకోవచ్చు. బిజీగా ఉండి అవతలి వారికి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో రిప్లై సెట్ చేసుకోవచ్చు.

 

 

బిజినెస్ టైప్

మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో దానికి సంబంధించిన కాంటాక్ట్ లను యాడ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ ఇందులో లేకుంటే అదర్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు.

మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో..

వాట్సప్ బిజినెస్‌లో మీకు వచ్చిన అలాగే మీరు పంపిన మొత్తం మెసేజ్‌లను స్టాటిస్టిక్స్ రూపంలో తెలుసుకోవచ్చు.మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో దానికి సంబంధించిన కాంటాక్ట్ లను యాడ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ ఇందులో లేకుంటే అదర్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు.

గ్రీన్ టిక్

ఇంతకుముందు వాట్సప్ లో మీరు పంపిన మెసేజ్‌లు అవతలి వారు చదివారడానికి గుర్తుగా బ్లూ ట్రిక్స్ వచ్చేవి. కాని వాట్సప్ బిజినెస్‌లో మీ ఇది గ్రీన్ కలర్‌లో ఉంటుంది.

లోగో

బిజినెస్ వాట్సప్ లోగో ఉంటుందో తెలుసా..బి ఆకారంలో ఉంటుంది. అలాగే ఇందులో మైనస్ కూడా ఉంది. ఈ బిజినెస్ వాట్సప్‌లో రెండు వాట్సప్‌లను ఒకేసారి వాడలేరు. కాని వాట్సప్‌లో ఆ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్లో రెండు నంబర్లు వాడాల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Business app launched: Here’s everything you need to know More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot