వాట్సాప్ బిజినెస్‌ యాప్‌తో బోలెడన్ని వ్యాపార ప్రయోజనాలు..

Posted By: BOMMU SIVANJANEYULU

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో అగ్రగామి యాప్‌గా గుర్తింపుతెచ్చుకున్న వాట్సాప్, భారత్‌లోనూ తన సత్తాను చాటుతోంది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాపంగా 1.5 బిలియన్ యూజర్లు యాక్టివ్‌గా ఉపయోగించుకుంటున్నట్లు తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రోజుకు 60 బిలియన్ల మెసేజ్‌లు ఈ యాప్ ద్వారా షేర్ కాబడుతున్నాయట. వినియోగదారుల అవసరాలను బట్టి నిత్యం కొత్తకొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తోన్న వాట్సాప్ రెండు నెలల క్రితం వాట్సాప్ బిజినెస్ వర్షన్‌ను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తోన్న ఈ బిజినెస్ యాప్ త్వరలోనే ఐఓఎస్ ఆధారిత డివైస్‌లను సపోర్ట్ చేసే అవకాశముంది. వ్యాపార ప్రయోజనాల నిమిత్తం ప్రత్యేకించి డిజైన్ చేయబడిన వాట్సాప్ బిజినెస్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ముకేష్ అంబానీ ఇండియాలో పుట్టలేదా, ఎవరికీ తెలియని కొన్ని నిజాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయటం ఎలా..?

వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా వ్యాపార సంస్థలు తమ కస్టమర్‌లతో నిరంతరం టచ్ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా, కస్టమర్‌లు కూడా వాట్సాప్ ద్వారా తమకు కావల్సిన వస్తువు లేదా సర్వీసుకు సంబంధించి ఆయా వ్యాపార సంస్థలతో సంప్రదింపులు జరిపే వీలుటుంది. వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలనుకునే వ్యాపారులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్‌ను తమ స్మార్ట్‌పోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్ అయిన తరువాత మీ బిజినెస్ మొబైల్ నెంబర్ ద్వారా యాప్‌లోకి లాగిన్ కావల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ బిజినెస్ వివరాలను ఎంటర్ చేసినట్లయితే ప్రొఫైల్ క్రియేట్ కాబడుతంది.

 

 

నచ్చిన విధంగా మేనేజ్ చేసుకోవచ్చు..

మీ బిజినెస్ మొబైల్ నెంబర్ పేరుతో వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ అయిన తరువాత యాప్‌ను నచ్చిన విధంగా సెటప్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్ ఆఫర్ చేసే స్మార్ట్ మెసేజింగ్ టూల్స్ పనులను మరింత సులభతరం చేయటంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. కస్టమర్లకు నిరంతం టచ్‌లో ఉండేందుకు వారికి ఆటోమెటిక్ గ్రీటింగ్స్‌ను పంపటంతో పాటు క్విక్ రిప్లైలను కూడా ఇవ్వొచ్చు.

బిజినెస్ టూల్స్‌ను సెటప్ చేసుకోవటం ఎలా..?

ముందుగా యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మెసేజ్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే Away message, Greeting message, Quick replies అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిని మీ అవసరాన్ని బట్టి మేనేజ్ చేసుకోవచ్చు.

 

 

వాట్సాప్ బిజినెస్ యాప్‌ను ఎఫెక్టివ్‌గా వినియోగించుకోవటం ఎలా..?

వాట్సాప్ బిజినెస్ యాప్‌ను మరింత ఎఫెక్టివ్‌గా వినియోగించుకోవాలంటే నిరంతరం మీ కస్టమర్‌లను ట్రాక్ చేస్తూనే ఉండాలి. కస్టమర్‌లను మాన్యువల్‌గా కాంటాక్ట్ లిస్టులో యాడ్ చేసుకుని మీ సంభాషణలకు ప్రత్యేకమైన లేబుల్స్‌ను అసైన్ చేసుకున్నట్లయితే రిజల్ట్స్ పాజిటివ్‌గా వస్తాయి. లేబుల్స్‌ను యాడ్ చేసుకోవాలంటే చాట్ కన్వర్జేషన్‌కు సంబంధించిన మెనూ బటన్ పై క్లిక్ చేసి లేబుల్‌ను సెలక్ట్ చేసుకుని సేవ్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

వాట్సాప్ బిజినెస్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వినియోగించుకోవాలంటే..?

పర్సనల్ వాట్సాప్ అకౌంట్ తరహాలోనే బిజినెస్ వాట్సాప్ అకౌంట్‌ను కూడా డెస్క్‌టాప్ పై ఉపయోగించుకోవచ్చు. యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాట్సాప్ వెబ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటం ద్వారా యాప్ డెస్క్‌టాప్ పై ఓపెన్ అవుతుంది.

 

 

వన్ ఆన్ వన్ సపోర్ట్..

వాట్సాప్ బిజినెస్ యాప్‌ను వినియోగించటం ద్వారా మీ కస్టమర్‌లకు వన్ ఆన్ వన్ సపోర్ట్‌ను కల్పించే వీలుంటుంది. మీది చిన్న బిజినెస్ అయినట్లయితే ప్రతి కస్టమర్ ఎంక్వైరీని మీరు తీర్చే వీలుంటుంది. వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర అటాచ్‌మెంట్‌లను కూడా మీ కస్టమర్‌లకు పంపుకునే వీలుంటుంది.

టైమ్ టు టైమ్ అప్‌డేట్స్..

వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా మీ కస్టమర్‌లకు టైమ్ టు టైమ్ అప్‌డేట్‌లను పంపుకునే వీలుంటుంది. ఒకేసారి 256 కాంటాక్ట్‌లకు మీరు అప్‌డేట్‌లను షేర్ చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
In January this year, WhatsApp introduced its business-focused app in India, just days after its initial launch. The WhatsApp Business app is currently only available on Android.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot