వాట్సాప్‌లో మరో కీలక ఫీచర్.. భారత్ సహా 150 దేశాల్లో అందుబాటులోకి..!
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ గత కొన్ని నెలలుగా వరుసగా కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. వాట్సాప్ వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా తన యూజర్లను ఎంగేజ్ చేయడంలో భాగంగా ఛానల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్ అందుబాటులో వచ్చాక.. డైరెక్టరీ నుంచి నచ్చిన ఛానల్ కోసం ఎంచుకోవచ్చని తెలుస్తోంది. బిజినెస్, సెలబ్రిటీ, మెంబర్లు క్రియేట్ చేసిన ఛానల్‌లో చేరవచ్చని తెలుస్తోంది. ఈ వాట్సాప్ ఛానల్ ఫీచర్ భారత్ సహా 150 దేశాల్లో అందుబాటులోకి రానున్నాయని బుధవారం వాట్సాప్ ప్రకటన చేసింది. ఈ ఫీచర్‌ను ఈ సంవత్సరం మొదట్లో గుర్తించారు. రానున్న కొన్ని రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.

మరిన్ని కొత్త ఫీచర్లు సహా ఇతర సమాచారం కోసం వాట్సాప్ వినియోగదారులు సంస్థ అధికారిక ఛానల్‌లో చేరవచ్చని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇదే తరహా ఫీచర్‌ను కలిగి ఉంది. అదేవిధంగా టెలిగ్రామ్ యాప్ కూడా వన్ వే బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌ను కలిగి ఉంది. నచ్చిన యూజర్లు ఇందులో జాయిన్ కావచ్చు.
వాట్సాప్‌లో ఈ ఛానల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. అందులో జాయిన్ అయ్యేందుకు సరైన లింక్ కలిగి ఉండాలని సంస్థ చెబుతోంది. అయితే ఈ ఛానల్‌లో చేరే వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఫోన్ నంబర్ ఎవరికీ కనిపించకుండా చర్యలు తీసుకుంది.
వాట్సాప్ ఛానల్ ద్వారా పంపిన మెసెజ్‌లు కేవలం 30 రోజుల వరకు మాత్రమే ఉంటాయని సంస్థ తెలిపింది. ఛానల్‌లోని సభ్యులు ఈ మెసేజ్‌లకు రియాక్ట్ కావచ్చని తెలిపింది. అయితే ఈ మెసెజ్‌లు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్‌ను కలిగి ఉండవని తెలిపింది. అయితే వాట్సాప్ మెసేజ్, చాట్, కాల్స్ అన్ని ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్‌ను కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది.
వాట్సాప్ ఛానల్ ఫీచర్‌ను మరింత ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చేందుకు సంస్థ కీలక చర్యలు తీసుకుంటోంది. భారత క్రికెట్ జట్టు, దిల్జిత్ దోసాంజ్, నేహా కక్కర్, కత్రినా కైఫ్ వంటి ప్రముఖులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రాబోయే రోజుల్లో ఏ యాజర్ అయినా తన ఛానల్‌ను క్రియేట్ చేసుకోనేందుకు అనుమతి ఇస్తామని వాట్సాప్ వెల్లడించింది.
వాట్సాప్ ఛానల్ ఫీచర్‌ను రానున్న కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఏ సమయంలో ఈ ఫీచర్ వస్తుందో వాట్సాప్ స్పష్టం చేయలేదు. అయితే వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం వాట్సాప్ ఇటీవల కాలంలో అనేక కీలక ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ ఎక్కువ ఎంగేజ్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications