రెండు కొత్త ఫీచర్లతో దూసుకొస్తున్న వాట్సాప్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం Consecutive Voice Messages, Group Call Shortcut పేర్లతో మరో రెండు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

ఇండియా మార్కెట్లో విడుదలైన Asus RoG ఫోన్ఇండియా మార్కెట్లో విడుదలైన Asus RoG ఫోన్

 Consecutive Voice Messages

Consecutive Voice Messages

వాట్సాప్ ఈ Consecutive Voice Messages ఫీచర్ ను వాట్సాప్ బీటా వెర్షన్ అయిన 2.8.362 లో పొందుపరిచింది. ఈ ఫీచర్ లో Consecutive Voice Messages ను కంటిన్యూస్ గా ప్లే చేసి వినిపిస్తుంది. వాట్సాప్ రెండు,మూడు వాయిస్ మెసేజ్లను డిటెక్ట్ చేసిన వెంటనే ఈ ఫీచర్ వర్క్ చేయడం ప్రారంభిస్తుంది.ఈ ఫీచర్ ను ఉపయోగించుకుని వాట్సాప్ రిసీవర్ కు వచ్చిన వాయిస్ మెసేజ్లను ఆటోమేటిక్ గా సీక్వెన్స్ లో ప్లే చేయడం జరుగుతుంది.

 

ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే...

ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే...

ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే రిసిప్టెంట్ కనీసం ఒక వాయిస్ నోట్‌నైనా ప్లే చేయవల్సి ఉంటుంది . ఒక్కో వాయిస్ నోట్ ఎండ్ అయ్యే సమాయానికి వాట్సాప్ ఓ షార్ట్ ఆడియో టోన్‌ను ప్లే చేస్తుంది. ఈ ఇండికేటర్ టోన్‌ను తరువాత ప్లే అవ్వటానికి సిద్థంగా ఉన్న వాయిస్ నోట్‌కు సంబంధించినదిగా యూజర్ గుర్తించాల్సి ఉంటుంది.

 

 

Group Call Shortcut...
 

Group Call Shortcut...

ఈ గ్రూప్ కాలింగ్ కోసం ఒకరికి కాల్ చేసిన తర్వాత మరొకరికి కాల్ చేసుకోవాల్సి ఉండేది . అయితే వాట్సప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో ఇప్పుడు ఒకే సారి అనుకున్న వారితో గ్రూప్ కాలింగ్ చేసుకోవచ్చు. గ్రూప్ కాల్ బటన్‌తో ఏక కాలంలో ఎంపిక చేసిన వారిని కాల్‌లోకి తీసుకోవచ్చు. అయితే ఈ గ్రూప్ కాలింగ్‌ నలుగురితో మాత్రమే అనుమతి ఉంటుంది.

ఆడియో, వీడియో కాల్స్‌కు ఇది వర్తిస్తుంది....

ఆడియో, వీడియో కాల్స్‌కు ఇది వర్తిస్తుంది....

ఆడియో, వీడియో కాల్స్‌కు ఇది వర్తిస్తుంది. అంతే కాకుండా గ్రూప్‌లోని ముగ్గురు వ్యక్తులతో ఒకేసారి చాట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐఓస్‌ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Best Mobiles in India

English summary
WhatsApp Consecutive Voice Messages, Group Call Shortcut Spotted in Android Beta.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X