Whatsapp యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ఫీచ‌ర్ల‌తో ఇక పండ‌గే!

|

ప్రముఖ‌ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ అప్లికేష‌న్ Whatsapp త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నిత్యం ఏదో ఒక కొత్త ఫీచ‌ర్ తెచ్చేందుకు ప్ర‌యోగాలు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫాంపై ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న డెలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ (Delete For Everyone) ఆప్ష‌న్ స‌మ‌య ప‌రిమితి పెంచేందుకు సంస్థ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. త‌ద్వారా ఎవ‌రైనా త‌ప్పు మెసేజ్ పంపితే నిర్ణీత స‌మ‌యం దాటిన త‌ర్వాత కూడా డెలీట్ చేసుకునే వెసులుబాటు రానుంది.

 
Whatsapp యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ఫీచ‌ర్ల‌తో ఇక పండ‌గే!

ఇక ఆ ఫీచ‌ర్ త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విష‌యాన్ని Whatsapp త‌మ ట్విట‌ర్ ఖాతాలో స్క్రీన్ షాట్ పోస్ట్ ద్వారా పేర్కొంది. ఈ కొత్త ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు రెండు రోజుల కాల ప‌రిమితి వ‌ర‌కు కూడా Delete For Everyone ఆప్ష‌న్‌ను వినియోగించుకోవ‌చ్చు.

Delete For Everyone స‌మ‌య ప‌రిమితి పెంపు:

Delete For Everyone స‌మ‌య ప‌రిమితి పెంపు:

Whatsapp కంపెనీ ట్విట‌ర్‌లో ఈ విధంగా వెల్ల‌డించింది. "మీరు వాట్సాప్ నుండి పంపిన మీ సందేశాలను తొలగించడానికి మీకు 2 రోజుల కంటే ఎక్కువ సమయం ఉంటుంది." గ‌తంలో ఈ Delete For Everyone ఆప్ష‌న్‌కు 1 గంట‌, 8 నిమిషాల 16 సెకండ్ల వ‌ర‌కు స‌మ‌య ప‌రిమితి ఉంది. తాజాగా వాట్సాప్ విడుద‌ల చేసిన ఈ ఫీచ‌ర్‌తో ఈ డెలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ ఫీచ‌ర్ స‌మ‌య ప‌రిమితి రెండు రోజుల 12 గంట‌ల‌కు పెర‌గ‌నుంది. ఇది ప్ర‌స్తుతానికి iOS బీటా టెస్టింగ్ యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంద‌ని.. మ‌రికొన్ని వారాల్లో ఎక్కువ మందికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపింది.

రెండు రోజులలోపు మెసేజ్‌లను డిలీట్ చేయడానికి, మీతో పాటు రెసిపియెంట్స్ కూడా WhatsApp యొక్క తాజా వెర్షన్‌ను కలిగి ఉండాలి. ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మేనా లేదా ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుందా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించడం ఎలా అంటే.. మీరు డెలీట్ చేయాల‌నుకుంటున్న సందేశాన్ని నొక్కి ప‌ట్టుకోవాలి.. ఆ త‌ర్వాత డెలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి. అలా చేయ‌డం ద్వారా మీరు ఎంపిక చేసుకున్న మెసేజ్ డెలీట్ అవుతుంది.

గ్రూప్ అడ్మిన్‌ల‌కు అధికారాలు..
 

గ్రూప్ అడ్మిన్‌ల‌కు అధికారాలు..

Whatsapp గ్రూపుల్లో స‌భ్యులు చేసిన ఏ మెసేజ్‌ను అయినా డెలీట్ చేసే అవ‌కాశం గ్రూప్ అడ్మిన్‌కు క‌ల్పించే ఫీచ‌ర్ కోసం కూడా సంస్థ‌ ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అద‌న‌పు స‌మాచారం కంపెనీ నుంచి వెలువ‌డ‌లేదు. త్వ‌ర‌లోనే వినియోగదారుల కోసం ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసే మరో అప్‌డేట్ రానుందని నివేదిక వెల్ల‌డించింది.

ఇవేకాకుండా మ‌రిన్ని అద్భుత ఫీచ‌ర్లు:

ఇవేకాకుండా మ‌రిన్ని అద్భుత ఫీచ‌ర్లు:

వాట్సాప్ యూజ‌ర్ల‌కు మ‌రింత ప్రైవ‌సీని అందించే ల‌క్ష్యంతో మ‌రిన్నఫీచ‌ర్ల‌ను కూడా ఆ కంపెనీ ఇటీవ‌ల ప‌రిచ‌యం చేసింది. ఏదైనా గ్రూప్ చాట్‌లో నుంచి ఎవ‌రికీ స‌మాచారం లేకుండా బ‌య‌ట‌కు వైదొల‌గే ఫీచ‌ర్‌ను తీసుకువ‌స్తోంది. అంతేకాకుండా, వ్యూ వ‌న్స్ మెసేజ్‌ల‌ను ఎవ‌రూ స్క్రీన్ షాట్ తీసుకోకుండా చేసేలా ఫీచ‌ర్ల‌ను తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మెటా సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఇటీవ‌ల ఓ పోస్ట్‌లో వెల్ల‌డించారు.

వాట్సాప్ గ్రూపులను సైలెంట్‌గా వదిలివేయవచ్చు:

వాట్సాప్ గ్రూపులను సైలెంట్‌గా వదిలివేయవచ్చు:

వాట్సాప్ త్వరలో గ్రూప్ యొక్క యూజర్ల ను తాము నిష్క్రమించినట్లు ఇతర వినియోగదారులకు తెలియజేయకుండా, వారు భాగమైన ఏదైనా గ్రూప్ ల నుండి నిశ్శబ్దంగా నిష్క్రమించడానికి అనుమతిస్తుంది. గ్రూప్ లను విడిచిపెట్టినప్పుడు మీ వైపు దృష్టిని ఆకర్షించకూడదనుకున్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు చాలా కాలం నుండి నిష్క్రమణ ఇబ్బందికరంగా ఉండటానికి మీరు భాగమైన వారికి ఇది చాల అనుకూలంగా ఉంటుంది.

'View Once' మెసేజ్ లను స్క్రీన్‌షాట్ తీయడాన్ని నిరోధిస్తుంది:

'View Once' మెసేజ్ లను స్క్రీన్‌షాట్ తీయడాన్ని నిరోధిస్తుంది:

WhatsApp వినియోగదారులు త్వరలో 'View Once' ఫీచర్ లో అద‌నంగా మ‌రో ఫీచ‌ర్‌ను పొంద‌నున్నారు. ఇదువ‌ర‌కు ఈ వ్యూ వన్స్ మెసేజ్‌లను, ఫొటోలను స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉండేది. వ్యూవన్స్ మెసేజ్‌లు, ఫొటోలను కొందరు స్క్రీన్ షాట్స్ తీసుకొని దాచుకునే వారు. అయితే వాట్సాప్‌ దీనికి పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. వ్యూవన్స్ మెసేజ్‌లకు స్క్రీన్ షాట్‌ల తీయ‌డానికి అవ‌కాశం లేకుండా చేయ‌నుంది.

Best Mobiles in India

English summary
WhatsApp ‘Delete for Everyone’ Feature Gets Extension to Over 2 Days

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X