Home
Apps

వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌.. కొత్త నంబర్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లకు లిమిట్‌..!

Whatsapp : ప్రముఖ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌.. భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ల కోసం అనేక ఫీచర్‌లను క్రమంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ తరహాలో యూజర్‌నేమ్‌ ఫీచర్‌ ను కూడా త్వరలో తీసుకురానుంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్ ధరలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త యూజర్లకు ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేయాల్సిన అవసరం లేకుండా, యూజన్‌ నేమ్ ద్వారా వాట్సాప్‌ లో చాట్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్‌ ఇటీవల కాలంలో చాట్‌ లో అనేక అదనపు ఫీచర్లను జోడిస్తోంది. ఇటీవలే వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌ రూపంలో మార్చుకొనేందుకు ఫీచర్‌ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా ఏదైనా సందర్భంలో వాయిస్‌ మెసేజ్‌లను వినలేని పరిస్థితుల్లో, ఆయా మెసేజ్‌లను సులభంగా టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకోవచ్చు.

Whatsapp developing a new feature to limit messages from new users

అయితే తాజాగా వాట్సాప్‌ మరో ఫీచర్‌ ను తీసుకొచ్చింది. అదే మెసేజ్‌ ట్రాన్స్‌లేషన్ ఫీచర్. ఈ ఫీచర్‌ ద్వారా వచ్చిన మెసేజ్‌లను, వాట్సాప్ సపోర్టు చేసిన భాషల్లోకి సులభంగా ట్రాన్స్‌లేట్‌ (అనువాదం) చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో ఇతర భాషల వ్యక్తులతో సులభంగా చాట్‌ చేసుకోవచ్చు.

ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌.. చాట్స్‌తోపాటు, గ్రూప్‌, ఛానల్‌లకు కూడా సపోర్టు చేస్తుందని వాట్సాప్‌ తెలిపింది. iOS యూజర్ల 21 భాషలకు వరకు సపోర్టు చేస్తుంది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ సపోర్టు చేస్తుంది. వాట్సాప్‌ యూజర్ల భద్రత, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మరో ఫీచర్‌ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

వాట్సాప్‌ కొత్త ఫీచర్ :
ప్రస్తుతం కొత్త నంబర్‌ల నుంచి వాట్సాప్‌ యూజర్లకు అనేక మెసేజ్‌లు వస్తుంటాయి. అందులో కొన్ని అవసరం అయినవి, మరికొన్ని స్పామ్‌లు ఉండే అవకాశం ఉంది. కొత్త నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నియంత్రించేందుకు, వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? :
వాట్సాప్‌లో మీకు కొత్త నంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చిందని అనుకుందాం. ఆయా మెసేజ్‌లను మీరు గంటలు లేదా రోజులపాటు చూడకపోతే, వాట్సాప్‌ లో త్వరలో రానున్న కొత్త ఫీచర్‌.. ఆ నంబర్‌ నుంచి మీకు మరిన్ని మెసేజ్‌లు రాకుండా కట్టడి చేస్తుంది. అంటే కొత్త నంబర్ నుంచి అప్పటికే వచ్చిన, మెసేజ్‌లను చూస్తేనే, ఆ నంబర్‌ నుంచి మరిన్ని మెసేజ్‌లు రావడానికి అవకాశం ఉంటుంది.

ఈ కొత్త ఫీచర్‌ ద్వారా స్పామ్‌ మెసేజ్‌లకు చెక్ పెట్టాలని వాట్సాప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను సంస్థ ప్రతినిధి TechCrunch తో పంచుకున్నారు. అయితే ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

వాట్సాప్‌లో స్పామ్‌ మెసేజ్‌లను కట్టడి చేసేందుకు Unsubscribe ఆప్షన్‌ ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్‌ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో కొత్త ఫీచర్‌ వైపు వాట్సాప్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp developing a new feature to limit messages from new users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X