Home
Apps

వాట్సాప్‌ గ్రూప్‌ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. కొత్త ఫీచర్‌ మీకు ఉపయోగపడుతుంది..!

ప్రముఖ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ ఇప్పటికే అనేక ఫీచర్లను తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల భద్రత, సౌకర్యం కోసం మరిన్ని ఫీచర్లను (Whatsapp New Features) విడుదల చేస్తోంది. అయితే తాజాగా వాట్సాప్‌ గ్రూప్‌ కాల్స్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ఈ వివరాలను వెల్లడించింది. ఇందులో సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను X ద్వారా షేర్‌ చేసింది.

ఇప్పటి వరకు వాట్సాప్‌ గ్రూప్‌ కాల్స్‌ చేసిన సమయాల్లో ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరికీ కాల్స్ వెళ్తాయి. త్వరలో ఈ పరిస్థితి ఉండదని తెలుస్తోంది. ఇందుకోసం కాల్స్ లింక్‌ ను (Whatsapp Call link) రూపొందించి గ్రూప్‌లో షేర్‌ చేసే ఫీచర్‌ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఫలితంగా అందుబాటులో ఉన్న గ్రూప్‌ సభ్యులు వాట్సా్ప్‌ వాయిస్‌, వీడియో సమయంలో ఆ లింక్‌ని క్లిక్‌ చేసి జాయిన్‌ కావచ్చు.

Whatsapp developing call link feature

ప్రస్తుతం గ్రూప్‌ సభ్యులందరికీ కాల్‌.. :
ఈ ఆప్షన్‌ త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫోటోలు, వీడియోలు పంపేందుకు ఉపయోగిస్తున్న ఆప్షన్‌ వద్దనే ఈ కాల్‌ లింక్‌ కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూప్‌ కాల్‌ చేయడం వల్ల ముఖ్యమైన పనుల్లో ఉన్నవారికి కూడా కాల్‌ వెళ్తుంది. ఫలితంగా వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కొత్త ఆప్షన్‌ ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

ప్రస్తుతం అభివృద్ధి దశలో కాల్‌ లింక్‌ ఫీచర్‌ :
ముఖ్యంగా భారీ సంఖ్యలో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లకు ఈ కాల్‌ లింక్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరియు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఫీచర్‌పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మెటా ఏఐ వాయిస్‌ కమాండ్‌ :
మెటా AI ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్ ఆధారంగా మెటా AI కి వాయిస్‌ మోడ్‌ ఫీచర్‌ను తీసుకొస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ గురించి గత నెలలో వివరాలు వెల్లడయ్యాయి.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.18.18 లో గుర్తించారు. అయితే మెటా ఏఐ వాయిస్ ఫీచర్‌ ఏయే భాషలకు మద్దతు ఇస్తుందో వెల్లడి కాలేదు. ఓపెన్‌ఏఐ మరియు గూగుల్‌ సంస్థలు తమ ఏఐ చాట్‌బాట్‌లతో టూవే కమ్యూనికేషన్‌ అందిస్తున్నా.. చందాదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X