iOS యూజర్లకు అందుబాటులో వాట్సాప్ కనుమరుగయ్యే మెసేజ్స్ ఫీచర్...
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన యొక్క ఆండ్రాయిడ్ మరియు IOS వినియోగదారుల కోసం అనేక రకాల కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నది. వాట్సాప్ లో కనుమరుగవుతున్న మెసేజ్ ల ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్ త్వరలోనే iOS వినియోగదారులకు కూడా అందుబాటులోకి రాబోతోంది. రాబోయే ఫీచర్లను గుర్తించడంలో చాలా ఖచ్చితమైన WABeatInfo నుండి వస్తున్న ఒక నివేదిక ప్రకారం iOS బీటా వినియోగదారుల కోసం కనుమరుగవుతున్న మెసేజ్ ల ఫీచర్ ను వాట్సాప్ విడుదల చేయడం ప్రారంభించింది.

వాట్సాప్ లో కనుమరుగయ్యే మెసేజ్ లు iOS బీటా వినియోగదారుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్ అందరికీ అతి త్వరలో విడుదల అవుతుందని చెప్పడం తప్పు కాదు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అని ఖచ్చితమైన కాలమానం తెలియదు. కాని రాబోయే వారాల్లో ఐఫోన్ వాట్సాప్ యాప్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ విడుదల అవుతుందని మేము ఆశిస్తున్నాము.

వాట్సాప్ దిసప్పెరింగ్ మెసేజ్స్ ఫీచర్
వాట్సాప్ లోని కొత్త ఫీచర్ కనుమరుగవుతున్న మెసేజ్ ఫీచర్ అనేది iOS బీటా వినియోగదారుల కోసం దశలవారీగా విడుదల చేయబడుతోంది. కాబట్టి మీరు iOS బీటా వినియోగదారు అయితే కనుక ఈ క్రొత్త అప్ డేట్ ను త్వరలోనే పొందవచ్చు. ఇది చాలా మంది వినియోగదారులు ఎదురుచూస్తున్న వారికి కనుమరుగవుతున్న మెసేజ్ ల ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఇంకా కొత్త అప్ డేట్ అందకపోతే కనుక యాప్ స్టోర్ కి వెళ్లి వాట్సాప్ ను అప్ డేట్ చేయండి. అయితే ముందుగా మీ మొబైల్ డివైస్ ను స్థిరమైన వైఫై కనెక్షన్‌కు కనెక్ట్ చేయాలని నిర్ధారించుకోండి.

వాట్సాప్ దిసప్పెరింగ్ మెసేజ్స్ ఎలా పనిచేస్తుంది
కనుమరుగయ్యే మెసేజ్స్ ఫీచర్ సాయంతో మీడియా ఫైళ్ళతో పాటు వీడియోలు, ఫోటోలు, ఆడియో ఫైల్స్ వంటి వాటిని కనుమరుగు చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రాథమికంగా ఇన్‌స్టాగ్రామ్ యొక్క కనుమరుగవుతున్న మెసేజ్ల వలె పనిచేస్తుంది. ఇది కొంతకాలంగా అందుబాటులో ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ 'వన్స్ వ్యూ' ఫీచర్ vs వాట్సాప్ దిసప్పెరింగ్ మెసేజ్స్
ఇన్‌స్టాగ్రామ్ దీనిని 'వన్స్ వ్యూ' ఫీచర్ అని పిలుస్తుంది. అయితే వాట్సాప్ "దిసప్పెరింగ్ మెసేజ్స్" పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఫీచర్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటంటే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులను టెక్స్ట్ / ఇమేజ్ / వీడియోను ఒక్కసారి మాత్రమే చూడటానికి అనుమతిస్తుంది. అయితే దిసప్పెరింగ్ మెసేజ్స్ టెక్స్ట్ పంపిన సమయం నుండి 7 రోజుల తర్వాత తొలగించబడతాయి లేదా అదృశ్యమవుతాయి.

వాట్సాప్ యొక్క రాబోయే ఫీచర్లు
వాట్సాప్ సంస్థ రాబోయే నెలల్లో అనేక కొత్త ఫీచర్లను విడుదల చేయడానికి పనిచేస్తోంది. ఇన్స్టంట్ మెసేజ్ యాప్ ప్రవేశపెట్టినప్పటి నుండి వినియోగదారులకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యలలో ఒకటైన మల్టీ-డివైస్ ఫీచర్‌పై కూడా ఫేస్‌బుక్ పనిచేస్తుందని ధృవీకరించింది.

వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్
వాట్సాప్ ప్రస్తుతం మల్టీ-డివైస్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది మరియు ఇది త్వరలోనే విడుదల చేయాలని తన యొక్క ప్రయత్నాలను చేస్తున్నది. మొదట బీటా వినియోగదారుల కోసం మరియు తరువాత మిగిలిన అందరికీ కూడా. ప్రారంభంలో మల్టీ-డివైస్ ఫీచర్ వాట్సాప్ వెబ్ మరియు డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం విడుదల చేయబడుతుంది. తరువాత మొబైల్ యాప్ వినియోగదారులకు. ప్రారంభంలో ఈ ఫీచర్ ఒకేసారి నాలుగు పరికరాలలో లింక్ చేయగలదు.


Click it and Unblock the Notifications








