ఇక Whatsapp లో మెసేజ్ రియాక్ష‌న్‌గా మీకు న‌చ్చిన ఎమోజీని పంప‌వ‌చ్చు!

|

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ Whatsapp నిత్యం ఏదో కొత్త అప్‌డేట్‌తో త‌మ యూజ‌ర్లను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రో కొత్త అప్‌డేట్‌ను వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల త‌మ ప్లాట్‌ఫాంపై Message Reactions ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, ఈ ఫీచ‌ర్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎమోజీలు మాత్ర‌మే యూజ‌ర్లకు మెసేజ్ రియాక్ష‌న్‌కు అందుబాటులో ఉన్నాయి. ఇక‌నుంచి Message Reactions లో భాగంగా మ‌రిన్ని ఎమోజీల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఈ మేర‌కు మెటా వ్య‌వ‌స్థాప‌కులు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ త‌న ఫేస్‌బుక్ పేజీలో చేసిన పోస్ట్ ద్వారా వెల్ల‌డైంది.

 
ఇక Whatsapp లో మెసేజ్ రియాక్ష‌న్‌గా మీకు న‌చ్చిన ఎమోజీని పంప‌వ‌చ్చు!

మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ పోస్ట్ ఆధారంగా తెలిసిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. Whatsapp లో మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌లో ఇదువ‌ర‌కు ఆరు ఎమోజీలు మాత్ర‌మే క‌నిపించేవి. కానీ, ఇక ముందు వాట్సాప్ మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌కు మ‌రిన్ని ఎమోజీల‌ను జ‌త చేస్తుందని మార్క్ వెల్ల‌డించారు. దీంతో, Whatsapp యూజ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన ఎమోజీని మెసేజ్ రియాక్ష‌న్‌గా రిప్లై ఇచ్చే వెసులుబాటు క‌ల్పిస్తున్నామ‌ని మార్క్ తెలిపారు. జుకర్‌బర్గ్ ఈ పోస్ట్‌లో తనకు ఇష్టమైన కొన్ని ఎమోజీలను కూడా పంచుకున్నాడు. ఇది త్వ‌ర‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.

యూజ‌ర్లు త‌మ స్నేహితుడి నుంచి వ‌చ్చిన మెసేజ్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా రియాక్ష‌న్ ఫీచ‌ర్‌ను క‌నుగొన‌వ‌చ్చు. ఇందులో భాగంగా మునుపటి ఆరు ఎమోజీలతో పాటు "+" గుర్తుతో మెనూ ఓపెన్ అవుతుంది. (+) గుర్తును క్లిక్ చేయ‌డం ద్వారా స్మైలీ, ఎమోష‌న‌ల్ స‌హా ప‌లు కొత్త ఎమోజీలను కలిగి ఉన్న మెనూ ఓపెన్ అవుతుంది. Whatsapp లో ఈ మరిన్ని ఎమోజీలు రావడం గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. ఇదువ‌ర‌కే దీనికి సంబంధించి ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాకుండా ఇప్ప‌టికే ఇది ప‌లు డివైజ్‌ల‌లో అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇది మీ వాట్సాప్‌లో ఇంకా కనిపించకుంటే, రాబోయే కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి వ‌స్తుంద‌ని స‌మాచారం.

ఇక Whatsapp లో మెసేజ్ రియాక్ష‌న్‌గా మీకు న‌చ్చిన ఎమోజీని పంప‌వ‌చ్చు!

మ‌రోవైపు Whatsapp లో ఇప్ప‌టికే UPI పేమెట్స్ స‌దుపాయం కూడా అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో UPI చేరిక‌లు త‌క్కువ‌గా ఉన్నాయి. కానీ, ఇటీవ‌ల జూన్ నెల‌లో వాట్సాప్ యూపీఐలో భారీగా చేరిక‌లు పెరిగాయి.

వాట్సాప్ UPI ప్లాట్‌ఫారమ్ లో 2022 జూన్ నెలలో లావాదేవీల పరిమాణ వృద్ధి అధికంగా నమోదు చేసింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి వాట్సాప్ UPI వృద్ధి తక్కువగా ఉండేది. కానీ జూన్ 2022లో కంపెనీ ప్రారంభించిన క్యాష్‌బ్యాక్‌ల కారణంగా భారతీయులు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఎక్కువగా ఉపయోగించుకునేలా ప్రోత్సహించడంతో దేశంలో వాట్సాప్ వృద్ధికి దారితీసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇక Whatsapp లో మెసేజ్ రియాక్ష‌న్‌గా మీకు న‌చ్చిన ఎమోజీని పంప‌వ‌చ్చు!

జూన్ 2022లో వాట్సాప్ పే పనితీరు గణాంకాలు వాట్సాప్ పే UPI ప్లాట్‌ఫారమ్‌లో 2022 సంవత్సరం మే నెలలో మొత్తంగా 34.8 లక్షల లావాదేవీలు నమోదు అయ్యాయి. అయితే ఈ మొత్తం లావాదేవీలలో జరిగిన ట్రాన్సషన్ మొత్తం రూ. 294.98 కోట్లు. కానీ జూన్ 2022లో ఇది మొత్తం 2.30 కోట్ల లావాదేవీలకు మరియు లావాదేవీల మొత్తంలో రూ.429.06 కోట్ల ట్రాన్సషన్ కు పెరిగింది. వాట్సాప్ పేమెంట్ యొక్క పెరుగుదల చూసుకుంటే కనుక భారీగా పెరిగింది. భారతదేశంలో వందల మిలియన్ల మంది కస్టమర్‌లు ఇటీవల ఈ ప్లాట్‌ఫారమ్‌ను కొత్తగా ఎంచుకున్నారు. ఇందులో లభించే క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధిక మంది ఇందులో చేరారు. క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు ఫోన్‌పే మరియు గూగుల్ పే లలో ఉన్నప్పటికీ వాట్సాప్ అందించే మెరుగైన ప్రయోజనాలను కలిగి లేవని యూజ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Best Mobiles in India

English summary
WhatsApp Expands Message Reactions Feature

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X