వాట్సప్‌లో పంపిన మెసేజ్‌‌లు డిలీట్ చేయడానికి ఎక్కువ సమయం, కొత్త అప్‌డేట్

Written By:

మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్‌ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తో దూసుకొచ్చింది. వాట్సప్లో పొరపాటున ఏదైనా మెసేజ్‌ ఎవరికైనా పంపితే ఇప్పుడు ఏడు నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్‌ చేసేయవచ్చు. ఇలా మెసేజ్‌ను డిలీట్‌ చేసుకునే అవకాశాన్ని వాట్సప్‌ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ పీచర్‌తో సెంటర్‌ తనతో పాటు రిసీవర్‌ వద్ద కూడా మెసేజ్‌ను డిలీట్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఏడు నిమిషాల వ్యవధి సమయాన్ని వాట్సప్‌ మరింత పెంచింది. చాట్‌లో మెసేజ్‌ను డిలీట్‌ చేయడానికి 4,096 సెకన్ల(68 నిమిషాల 16 సెకన్ల) సమయాన్ని యూజర్లకు కేటాయించింది. అంటే వాట్సాప్‌ యూజర్లకు మెసేజ్‌ డిలీట్‌ చేయడానికి గంట సమయం ఉంటుంది.

వాట్సప్‌లోకి కొత్త ఫీచర్, Spam మెసేజ్‌లు అవుట్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త బీటా 2.18.69 వెర్షన్‌లో..

ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అభివృద్ధి చేసిన కొత్త బీటా 2.18.69 వెర్షన్‌లో ఈ వ్యవధిని పెంచింది. వాట్సప్‌ గురించి ఎప్పడికప్పుడు అప్‌డేట్స్‌ అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ఫీచర్‌, ఐఓఎస్‌, విండోస్‌ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. డిలీట్‌ మెసేజ్‌ ఫీచర్‌ సమయాన్ని పెంచడం మాత్రమే కాక, ఈ కొత్త అప్‌డేట్‌లో స్వల్ప మార్పులు కూడా చేసింది. ఈ బీటాలోనే లాక్డ్‌ రికార్డింగ్‌, స్టికర్‌ ప్యాక్‌ డిస్‌ప్లే సైజ్‌ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్‌ తీసుకొచ్చింది.

వాట్సప్‌లో ఫార్వార్డెడ్ మెసేజ్

ఈ మధ్యే పేమెంట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాగా త్వరలో మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. వాట్సప్‌లో ఫార్వార్డెడ్ మెసేజ్ పేరిట రానున్న ఈ ఫీచర్ వల్ల ఇకపై అందులో యూజర్లు స్పాం మెసేజ్‌లను పంపడం కుదరదు. ఏదైనా ఒక మెసేజ్ కనీసం 25 సార్లకు పైగా ఫార్వార్డ్ అయితే దాన్ని వాట్సప్ ఫార్వార్డెడ్ మెసేజ్‌గా గుర్తిస్తుంది. దీంతో ఆ మెసేజ్‌ను యూజర్లు బ్లాక్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ క్రమంలో వాట్సప్‌లో పెద్ద ఎత్తున నకిలీ, స్పాం మెసేజ్‌లను పంపడానికి ఇకపై వీలు కాదు.

ఆండ్రాయిడ్‌ వీ2.18.67 వాట్సప్‌ బీటాలో

ప్రస్తుతం వాట్సప్ ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలో యూజర్లకు దీన్ని అందుబాటులోకి తేనుంది. వాట్సప్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ ఫీచర్‌ను స్పాట్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ వీ2.18.67 వాట్సప్‌ బీటాలో ఈ ఫీచర్‌ కనిపించింది.

స్టికర్స్‌ ఫీచర్‌ కూడా..

దీంతో పాటు స్టికర్స్‌ ఫీచర్‌ కూడా విండోస్‌ ఫోన్‌ బీటాపై స్పాట్‌ అయింది. ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌కు కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. వాట్సాప్‌ ఇటీవలే గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ అనే ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, విండోస్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులెవరైనా సరే గ్రూప్ డిస్క్రిప్షన్‌ను ఎడిట్ చేసే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp extends time limit to delete messages to 4,096 seconds on Android More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot