వాట్సాప్, ఫేస్‌బుక్ ఏమాత్రం సురక్షితం కాదు

ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నప్పటికి ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి మెసేజింగ్ యాప్స్ ఏమాత్రం సురక్షితం కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మెసేజింగ్ యాప్‌లలో 'authentication ceremony' అనే ముఖ్యమైన సెక్యూరిటీ టూల్ లోపించినట్లు Brigham Young University పరిశోధకులు గుర్తించారు.

Read More : రూ.14,000కే 6జీబి ర్యామ్‌ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఫీచర్ గురించి తెలియక...

ఈ ఫీచర్ గురించి చాలా మందికి తెలియకపోవటంతో చాలా మంది యూజర్లు తమ ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్, వైబర్ వంటి మెసేజింగ్ అకౌంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానరని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

‘authentication ceremony' అనేది...

‘authentication ceremony' అనేది డేటాను పంపించినపుడు దాన్ని ఎన్‌క్రిప్ట్ చేయ్యటమే కాకుండా అవతల సరైన వ్యక్తికే అది చేరుతుందా లేదా అన్నది నిర్థారించుకుంటుంది.

థర్డ్ పార్టీ లేదా మిడిల్ అటాకర్లు..

ఈ విధమైన అథంటికేషన్ లేకపోయినట్లయితే యూజర్ల మధ్య జరిగే సంభాషణలను థర్డ్ పార్టీ లేదా మిడిల్ అటాకర్లు సులువుగా హ్యాక్ చేయగలుగుతారని పరిశోధకలు చెబుతున్నారు. కాబట్టి వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో వీలైనంత త్వరగా authentication ceremony విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వీరు సూచిస్తున్నారు.

సోషల్ మీడియా అకౌంట్లకు భద్రత అనేది చాలా ముఖ్యం

వ్యక్తిగత సమచారాన్ని కలిగి ఉండే మన సోషల్ మీడియా అకౌంట్లకు భద్రత అనేది చాలా ముఖ్యం. డేటా సెక్యూరిటీ విషయంలో పరిస్థితి చేజారిపోయిన తరువాత ఆలిచించే కంటే ముందస్తుగా మేల్కొవటం ఎంత ఉత్తమం. మీ ఆన్‌లైన్ అకౌంట్‌లను పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ప్రూఫ్‌గా ఉంచుకునేందుకు పలు కీలక సూచనలు..

ట్విట్టర్ సెక్యూరిటీ..

మీ ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించిన సెక్యూరిటీ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే, శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవటంతో పాటు లాగిన్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను సెట్ చేసుకోండి. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే మీ ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించిన సెట్టింగ్స్‌లోకి వెళ్లి Security & Privacy Settings ఆఫ్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. లాగిన్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకునేముందు, మీ ఈమెయిల్ ఐడీని కన్ఫర్మ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ ట్విట్టర్ అకౌంట్‌ను వేరొకరు యాక్సెస్ చేసుకునేందుకు సాధ్యపడదు.

ఫేస్‌బుక్ ప్రైవసీ ఫీచర్స్

సెక్యూరిటీ పరంగా మీ అకౌంట్‌లను కట్టుదిట్టంగా ఉంచేందుకు ఫేస్‌బుక్ కూడా లాగిన్ వెరిఫికేషన్ తరహాలో ప్రైవసీ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. వీటిని ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ ఫేస్‌బుక్ మరింత సురక్షితంగా ఉంటుంది.

వేరొక డివైస్‌లో ఓపెన్ చేసి ఉంటే..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను వేరొక డివైస్‌లో ఓపెన్ చేసి లాగ్ అవుట్ చేయటం మర్చిపాయారు. అయితే ఆ సెషన్‌ను రిమోట్ విధానం ద్వారా సైన్ అవుట్ చేయవచ్చు. అది ఏలా సాధ్యం అంటారా..? మీరు కాకుండా వేరొకరు వాడుతున్నట్లు తెలిస్తే ఆ యాక్టివిటీని ఎండ్ చేసేందుకు Settings -> Security -> 'Where You're Logged In' ఆప్షన్‌లోకి వెళితే సరిపోతుంది.

2-factor authentication

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి లాగిన్ అప్రూవల్స్‌ను సెట్ చేసుకోవటం ద్వారా మీ అకౌంట్ సెక్యూరిటీ పరంగా మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇందుకుగాను "2-factor authentication" సౌలభ్యతను ఫేస్ బుక్ అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు Settings -> Security -> 'Login Approvals'లోకి వెళ్లండి.

ఎంట్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌

మీ చాట్‌లను మరింత సెక్యూర్‌గా ఉంచేందుకు ఫేస్‌బుక్ ఇప్పటికే ఎంట్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించుకుంటోంది. ఈ సౌలభ్యతను మీ వాట్సాప్ అకౌంట్‌లకు కల్పించటం ద్వారా వాట్సాప్‌లో పనిచేసే ఉద్యోగులు కూడా మీ చాట్ లను చూడాలేరు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp and Facebook Messenger leave users vulnerable to fraud. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot