WhatsApp నకిలీ అకౌంటులు మీ డేటాను దొంగిలిస్తున్నాయి!! సురక్షితంగా ఉండడం ఎలా?

|

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు చాలా తక్కువ సమయంలో వేగంగా మెసేజ్ లను పంపడానికి మరియు వాటిని వారు చూసారు అని నిర్దారించుకోవడానికి ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఎక్కువ మంది యూజర్ బేస్ ని కలిగి ఉన్న వాట్సాప్ నే తరచుగా స్కామర్లు లక్ష్యంగా చేసుకొని వారి యొక్క డేటాను దొంగిలించడానికి ఉపాయోగిస్తున్నారు. వాట్సాప్ వినియోగదారుల యొక్క వ్యక్తిగత డేటాను దొంగలించడానికి మోసగాళ్లు ఎటువంటి ఉపాయాలను ఎలా ఉపయోగిస్తున్నారో వివరించే నివేదికలు చాలానే విడుదలయ్యాయి. స్కామర్లు ఇటీవల అమాయక వినియోగదారులను లక్ష్యంగా చేసుకోని వారి డేటాను దొంగిలించడానికి వాట్సాప్ నకిలీ అకౌంటులను ఉపయోగిస్తున్నారు.

 
WhatsApp Fake Accounts Are Trying to Steal Users Personal Data! Follow These Safe Steps

WABetaInfo యొక్క నివేదిక ప్రకారం వాట్సాప్ మద్దతుగా నటిస్తూ నకిలీ అకౌంట్ నుండి అనుమానాస్పద మెసేజ్లు అందుతున్నాయి. ఈ మెసేజ్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ఉద్దేశించిన నకిలీ అకౌంట్ నుండి వచ్చినవిగా గుర్తించారు. ఇందులో యూజర్ల యొక్క క్రెడిట్ కార్డ్ వివరాలు మరియు వారి బ్యాంక్ అకౌంట్లకు లాగిన్ చేయడానికి వారి ఆరు అంకెల కోడ్ వంటివి ఉన్నాయి. ఇటువంటి వివరాలను పంచుకోవడంతో వాటి ఆధారంగా ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అయితే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ మెసేజ్లు అసలైనవిగా అనిపించే వాట్సాప్ అకౌంటుల ద్వారా షేర్ చేయబడుతున్నాయి. కాబట్టి మీరు నిజమైన అకౌంటులకు మరియు నకిలీ అకౌంటులను సులభంగా ఎలా గుర్తించవచ్చునో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
WhatsApp Fake Accounts Are Trying to Steal Users Personal Data! Follow These Safe Steps

నకిలీ మరియు నిజమైన వాట్సాప్ అకౌంటుల మధ్య తేడాను గుర్తించే విధానం

** మీకు తెలియని మరియు ధృవీకరించబడిన వాట్సాప్ పరిచయంతో చాట్ చేస్తున్నప్పుడు ఏదైనా ధృవీకరించబడిన బ్యాడ్జ్ సంభాషణ స్క్రీన్‌లో కనిపిస్తే కనుక వారి చాట్ సమాచారం పక్కన ఉంచడం ఉత్తమం. ఉదాహరణకు ప్రొఫైల్ ఫోటోలో వారు ధృవీకరించబడినట్లు నటిస్తే కనుక వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని అర్థం.

WhatsApp Fake Accounts Are Trying to Steal Users Personal Data! Follow These Safe Steps

** వాట్సాప్ సంస్థ ఎప్పటికి కూడా యూజర్ల యొక్క క్రెడిట్ కార్డ్ వివరాలు మరియు వారి ఆరు-అంకెల కోడ్ లేదా రెండు-దశల ధృవీకరణ పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడగదని గమనించాలి. "వాట్సాప్ అకౌంటులను రద్దు చేయకుండా ఉండటానికి డబ్బు లేదా రహస్య సమాచారాన్ని కూడా అడగదు" అని బ్లాగ్ సైట్ పేర్కొంది. అంటే ఏదైనా ఒక వాట్సాప్ అకౌంట్ ఈ సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటే అది నకిలీ అకౌంట్ అని మరియు అది మిమ్మల్ని స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తోందని అర్థం.

WhatsApp Fake Accounts Are Trying to Steal Users Personal Data! Follow These Safe Steps

** అటువంటి సందర్భంలో వారిని బ్లాక్ చేయడం లేదా ఆ చాట్ కి రిప్లై ఇవ్వకపోవడం ఉత్తమ చర్య. అలా చేయడం ద్వారా ఈ చాట్ నుండి వచ్చిన చివరి ఐదు మెసేజ్లు అధికారిక వాట్సాప్ మోడరేషన్ బృందంతో షేర్ చేయబడతాయి. తద్వారా వారు సంభాషణ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోగలరు మరియు వారు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయగలరు.

Best Mobiles in India

English summary
WhatsApp Fake Accounts Are Trying to Steal Users Personal Data! Follow These Safe Steps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X