వాట్సప్ యూజర్లు.. ముందుగా ఈ నిజాన్ని తెలుసుకోండి !

ఒకప్పుడు సమాచారాన్ని పంచుకోవడానికి ఎస్‌ఎంస్‌లను విరివిగా వాడేవాళ్లు. వాట్సప్‌ రాకతో ఎస్‌ఎంస్‌లకు కాలం చెల్లిందనే చెప్పవచ్చు.

By Hazarath
|

ఒకప్పుడు సమాచారాన్ని పంచుకోవడానికి ఎస్‌ఎంస్‌లను విరివిగా వాడేవాళ్లు. వాట్సప్‌ రాకతో ఎస్‌ఎంస్‌లకు కాలం చెల్లిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా డేటా వినియోగం పెరగడంతో వాట్సప్‌ను వినియోగించే వారి సంఖ్యా పెరిగింది.

రూ. 299కే ఫీచర్ ఫోన్, ఇక జియో ఫోన్ తుస్సేనా ..?రూ. 299కే ఫీచర్ ఫోన్, ఇక జియో ఫోన్ తుస్సేనా ..?

WhatsApp

ఒకరకంగా చెప్పాలంటే వాట్సప్‌ లేకుండా రోజు గడవని పరిస్థితి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో వాట్సప్‌ వేదికగా చక్కర్లు కొట్టే అబద్ధపు, అసత్య, అవాస్తవ సమాచారానికి కొదవలేదు. మరి దీన్ని ఎలా అరికట్టాలి. వాట్సప్ దీనిపై పరిశోధన చేస్తుందా..ఓ లుక్కేద్దాం.

జియోకి కౌంటర్, దీపావళి గిఫ్ట్‌గా Airtel 4జీ స్మార్ట్‌ఫోన్..జియోకి కౌంటర్, దీపావళి గిఫ్ట్‌గా Airtel 4జీ స్మార్ట్‌ఫోన్..

వాట్సప్‌ వేదికగా

వాట్సప్‌ వేదికగా

వాట్సప్‌ వేదికగా చక్కర్లు కొట్టే అబద్ధపు, అసత్య, అవాస్తవ సమాచారం తమ ఫ్లాట్‌ఫాం వేదికగా వ్యాప్తిచెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని వాట్సప్‌ వెల్లడించింది.

ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌

ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌

ప్రస్తుతం పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా కేవలం పంపే వ్యక్తి, ఆ సమాచారాన్ని అందుకునే వ్యక్తి మాత్రమే దానిని చదవగలరు.

 వేరొకరి సమాచారాన్ని

వేరొకరి సమాచారాన్ని

ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కారణంగా వేరొకరి సమాచారాన్ని మేము చదివే వీలు లేదు. దీంతో వాట్సప్‌ వేదికగా పంచుకునే సమాచారం నిజమైనదా? అసత్యమైనదా? అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాం' అని వాట్సప్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అలన్‌ కాయ్‌ తెలిపారు.

అసత్య సమాచారం

అసత్య సమాచారం

అసత్య సమాచారం వ్యాప్తి చెందుతోందని అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని, వాటిలో రూమర్స్‌, కొత్త కరెన్సీ నోట్లలో జీపీఎస్‌ చిప్‌, ముజఫర్‌నగర్‌ ఆందోళనల వీడియోలు.. ఇలా అనేకం వాట్సప్‌ ద్వారా వైరల్‌గా మారాయని అన్నారు.

కొందరు నిజమని

కొందరు నిజమని

వీటిని కొందరు నిజమని భావిస్తున్నారని, ఇలాంటి సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఇతరులతో పంచుకునే సమయంలో

ఇతరులతో పంచుకునే సమయంలో

ఒక సమాచారాన్ని ఇతరులతో పంచుకునే సమయంలో ప్రతి వాట్సప్‌ వినియోదారుడు అందులో నిజమెంతో గ్రహించాలని, అప్పుడు మాత్రమే దానిని ఇతరులతో పంచుకోవాలని సూచించారు.

ఫేస్‌బుక్‌కు చెందిన మెస్సేజింగ్‌ యాప్‌

ఫేస్‌బుక్‌కు చెందిన మెస్సేజింగ్‌ యాప్‌

ఫేస్‌బుక్‌కు చెందిన మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సప్‌నకు ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్‌ యూజర్లు ఉండగా, ఒక్క భారతదేశంలోనే 200 మిలియన్ల మందికి పైగా యూజర్లు వాట్సప్‌ను వినియోగిస్తున్నారు.

Best Mobiles in India

English summary
WhatsApp Fake news and Privacy: How safe are you? Here’s what you need to know Read More At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X