వాట్సప్ యూజర్లకు హెచ్చరిక!
ఎన్క్రిప్షన్ ఫీచర్ ద్వారా మూడో వ్యక్తి మెసేజ్‌లను చదివే అవకాశం లేదు
కొన్ని నెలల క్రితమే 1 మిలియన్ రోజువారీ యూజర్లను సాధించినట్లు వాట్సప్ ప్రకటించింది. అందులో ఉన్న ఎండ్ –టు –ఎండ్ ఎన్ర్కిప్షన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్ర్కిప్షన్ అనేది యూజర్ల డేటాను వాట్సాప్ సేఫ్ గా ఉంచుతుంది.

ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బట్వాడా అయ్యే వాట్సాప్ సందేశాలను మధ్యలో ఎవరూ చదివేందుకు అవకాశం లేకుండా వాట్సాప్ ఈ ఎన్ర్కిప్షన్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తమ ఉద్యోగులు కూడా ఇతరుల మెసేజ్ లను చదివేందుకు అవకాశం లేదని వాట్సాప్ చెబుతోంది.
వాట్సాప్ ఎన్ర్కిప్షన్ సిగ్నల్ ప్రొటోకాల్ ఆధారంగా పనిచేస్తోంది. ఇందులో వాడే సెక్యూరిటీ కీలో మార్పులు చేయడం ద్వారా వాట్సాస్ సందేశాలు వేరే వ్యక్తులు చదివేందుకు వీలుండదు. మన మెసేజ్‌లను అందుకునే వ్యక్తి ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు.. వాట్సాప్ ద్వారా సందేశం పంపితే.. దానికి సంబంధించిన సెక్యూరిటీ కీని వాట్సాప్ సంస్థ మార్చే వీలుందట. ఈ విషయాలేవీ మెసేజ్‌ను పంపిన వ్యక్తికి.. రిసీవ్ చేసుకునే వ్యక్తికి తెలియదట.
సిగ్నల్ అనే యాప్‌లో సెక్యూరిటీ కీని మార్చితే.. ఆ విషయం మేసేజ్‌ను పంపిన వారికి తెలిసిపోతుంది. అలాగే మెసేజ్ సెండింగ్ ఫెయిల్ అవుతుంది. ఈ విషయాన్ని వాట్సస్ కొట్టిపడేసింది. ఎన్క్రిప్షన్ ఫీచర్ ద్వారా మూడో వ్యక్తి మెసేజ్‌లను చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది.
వాట్సాప్ యూజర్లు డివైజ్‌ను మార్చినప్పుడు, వాట్సాప్‌ను రీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మెసేజ్ పంపడానికి ముందుగానే సెక్యూరిటీ కోడ్ మారిన విషయం సూచిస్తూ ఓ మెసేజ్ వస్తుందని వాట్సాప్ తెలిపింది. వెంటనే ఆ సందేశాన్ని రిసీవ్ చేసుకునేవారి డివైజ్ రెస్పాండ్ అవవుతుందని, కొత్త కీ పెయిర్‌తో మళ్లీ ఎన్ర్కిప్ట్ చేయాలని సూచిస్తుందని వాట్సాప్ తెలిపింది. ఇందుకోసం సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోని 'షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్’ను ఆన్‌లో ఉంచుకోవాలని వాట్సాప్ సూచించింది.
వాట్సాప్ మరియు ఫేస్ బుక్ వినియోగదారులు స్లీప్ ప్యాట్రన్స్ తెలుసుకోవడానికి ఆన్ లైన్ ఆడ్వటైజర్స్ ను సేకరించడానికి మరియు మెసేజింగ్ యాప్స్ ఈ బెనిఫిట్స్ కూడా తెలుసుకోని ఉండాలి.


Click it and Unblock the Notifications








