వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్
వాట్సప్ ఓ సరికొత్త ఫీచర్ మీద పనిచేస్తుందని అది లైవులోకి వస్తే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుదందని గతేడాది నుంచి వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
వాట్సప్ ఓ సరికొత్త ఫీచర్ మీద పనిచేస్తుందని అది లైవులోకి వస్తే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుదందని గతేడాది నుంచి వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫీచర్ ఏంటనేద చాలామందికి తెలియలేదు. అయితే ఇప్పుడు అది లైవులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇకై ప్రైవేట్ రిప్లయి ఇచ్చుకోవచ్చు. ఇతరులు ఎవరూ దానిని చూడకుండా మీరు ప్రైవసీగా ఉంచుకోవచ్చు. ఈ బీటా వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ లోని విండోస్లో లైవులోకి వచ్చింది. అయితే ఇది కేవలం కొద్ది సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

వాట్సప్ లీకులను అందించే సంస్థ...
వాట్సప్ లీకులను అందించే సంస్థ WABetaInfo ప్రకారం లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.18.335 లో ఈ ప్రవేట్ రిప్లయి ఫీచర్ ఉంది . ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా గ్రూపులోని వ్యక్తులకు గ్రూపులోనే ప్రైవేట్ మెసేజులు పంపుకునే అవకాశం ఉంది.

గ్రూపులో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది...
అయితే ఇప్పటికే గ్రూపులో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.అయితే ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు నేరుగాగ్రూపు నుంచే అతనికి పర్సనల్ ఛాట్ ద్వారా రిప్లయి ఇవ్వవచ్చు. ఇతరులకు ఏ మాత్రం అనుమానం రాకుండా గ్రూపులోనే మీరు అనుకున్నవారికి మెసేజులు పంపుకోవచ్చు. వచ్చినవాటికి రిప్లయి ఇవ్వవచ్చు.

ఫీచర్ చాలా లాంగ్ ప్రాసెస్ మీద ఉంటుంది...
ఈ ఫీచర్ చాలా లాంగ్ ప్రాసెస్ మీద ఉంటుంది. యూజర్లు ఏదైనా గ్రూపులో ఉన్నప్పుడు రైట్ కార్నర్ దగ్గర మూడు ఆప్షన్లు తో కూడిన విండో ఓపెన్ చేయాలి. అందులో ఓ ఆప్సన్ రిప్లయి ప్రైవేట్ ఫీచర్ అని ఉంటుంది. దాని ద్వారా నేరుగా మీరు ఇతరులకు మెసేజ్ పంపుకోవచ్చు.

చాటింగ్ మొత్తాన్ని మీరు నేరుగా చూసుకోవచ్చు...
ఈ చాటింగ్ మొత్తాన్ని మీరు నేరుగా చూసుకోవచ్చు. individual reply గ్రూపులోనే ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త private reply feature నేరుగా కాంటాక్ట్ లోకి మిమ్మలల్ని తీసుకువెళుతుంది.

కేవలం ఆండ్రాయిడ్ వర్షన్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది...
అయితే ఈ ఫీచర్ ఇప్పుడు కేవలం ఆండ్రాయిడ్ వర్షన్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐవోఎస్ ఫోన్లకు అందుబాటులో లేదు. అయితే అతి త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి.

Swipe to Reply featureని కూడా...
దీంతో పాటు వాట్సప్ Swipe to Reply featureని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంలకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








