వాట్సాప్‌లో 5 కొత్త ఫీచర్లు, అవేంటో తెలుసా..?

తాజాగా వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 సరికొత్త కెమెరా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

వాట్సాప్‌లో 5 కొత్త ఫీచర్లు, అవేంటో తెలుసా..?

Read More : ఫ్లిప్‌‍కార్ట్ దుమ్ము రేపింది.. ఒక్క రోజులో 8 లక్షలు ఫోన్‌లు సేల్

ఈ ఫీచర్స్ ద్వారా యూజర్లు తామ వాట్సాప్ అకౌంట్ ద్వారా షేర్ చేయబోయే ఫోటోస్ అలానే వీడియోస్‌ను కావల్సిన విధంగా ఎడిట్ చేసుకునే అవకాశముంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్‌ను పొందటం ద్వారా కొత్త ఫీచర్లను ఆస్వాదించవచ్చు. వాట్సాప్ ఆఫర్ చేస్తున్న కొత్త ఫీచర్లను పరిశీలించినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Write and draw on photos and videos

వాట్సాప్ తీసుకువచ్చిన తాజా అప్‌డేట్‌లో భాగంగా యూజర్లు షేర్ చేయబోయే ఫోటోస్ అలానే వీడియోస్ పై మీకు నచ్చిన టెక్స్ట్‌ను రాయటంతో పాటు బొమ్మలను కూడా గీసే అవకాశాన్ని కల్పించారు. వీటి పై emojis కూడా యాడ్ చేసుకోవచ్చు.

New zoom feature

వాట్సాప్ తీసుకువచ్చిన తాజా అప్‌డేట్‌లో న్యూ జూమ్ ఫీచర్ కూడా ఒకటి. ఈ ఫీచర్ ద్వారా చాలా దూరంలో కనిపించే దృశ్యాలను వీడియో లేదా ఫోటో రూపంలో క్యాప్చర్ చేయవచ్చు. మీ వేలును పైకి క్రిందకు జరపటం ద్వారా జామ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. డబల్ ట్యాప్ చేయటం ప్రంట్ర అలారే రేర్ ఫేసింగ్ కెమెరాల మధ్య స్విచ్ కావొచ్చు.

Editing tools

వాట్సాప్ తీసుకువచ్చిన రీసెంట్ అప్ డేట్స్‌లో ఎడిటింగ్ టూల్స్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా మీరు పంపే ఫోటోస్ అలానే వీడియోలకు అదనపు హంగులను జోడించవచ్చు. ఫోటల పై మీకు నచ్చిన టెక్స్ట్‌ను యాడ్ చేయటం, ఫాంట్ స్టైల్ మార్చటం, వివిధ రంగలను అప్లై చేయటం వంటి ఈ ఎడిటింగ్ టూల్ ద్వారా సాధ్యమవుతాయి.

Send GIF images to your friends!

వాట్సాప్ తీసుకువచ్చిన తాజా అప్‌డేట్‌లో భాగంగా ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు GIF ఫోటోలను చాట్ conversations ద్వారా పంపుకునే అవకాశం ఉంటుంది. టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే అటాచ్‌మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా GIF ఫైల్ ను పంపుకునే అవకాశం ఉంటుంది.

Selfie flash

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం Selfie flash పేరుతో సరికొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింటి. ఈ టూల్ ద్వారా యూజర్లు తక్కువ వెళుతరులోనూ నాణ్యమైన సెల్ఫీలను చిత్రీకరించుకోగలుగుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp for Android Gets Updated with 5 New Camera Features. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot