Whatsapp Statusలలో యాడ్స్? వైరల్ అవుతోన్న లీక్!

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను కొత్తకొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తోన్న విషయం తెలిసిందే.

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను కొత్తకొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తోన్న విషయం తెలిసిందే. వాట్సాప్ లాంచ్ చేస్తోన్న కొత్త ఫీచర్లలో కొన్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంటే మరికొన్ని మాత్రం నిరుత్సహా పరిచే విధంగా ఉంటున్నాయి.

@WABetaInfo రిపోర్ట్స్ ప్రకారం..

@WABetaInfo రిపోర్ట్స్ ప్రకారం..

తాజాగా రివీల్ అయిన మరో రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ తన యూజర్లకు సంబంధించిన Statusలలో యాడ్‌లను ప్రదర్శించటం మొదలుపెట్టింది. మొదటి నుంచి వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉన్న వాట్సాప్ తాజాగా ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పట్ల విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. @WABetaInfo రివీల్ చేసి వివరాలను వాట్సాప్ తన iOS వెర్షన్‌లో యాడ్స్‌ను ఇంప్లిమెంట్ చేయబోతోంది.

 

 

వాళ్లు వ్యతిరేకం..?

వాళ్లు వ్యతిరేకం..?

వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత నుంచి పరిణమాలు శరవేగంగా మారిపోతున్నాయి. వాట్సాప్‌లో యాడ్స్‌ను ఇంప్లిమెంట్ చేసే విషయాన్ని సంస్థ సహ-వ్యవస్థాపకులైన జాన్ కౌమ్ ఇంకా బ్రెయిన్ ఆక్టన్‌లు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

 

 

ముందు నుంచే ఆ ఆలోచన..
 

ముందు నుంచే ఆ ఆలోచన..

ఇటువంటి ప్రతికూల పరిస్థితుల కారణంగానే బ్రెయిన్ ఆక్టన్‌ వాట్సాప్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా బ్రెయిన్ ఆక్టన్ స్పందిస్తూ వాట్సాప్‌ను కొనుగోలు చేయకముందునుంచే ఈ మెసేజింగ్ యాప్‌లో యాడ్స్‌ను ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు ఉందని అన్నారు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ తరహాలో..

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ తరహాలో..

వాట్సాప్ త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతోన్న యాడ్స్, ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మనం చూస్తున్న యాడ్స్ మాదిరిగా ఉంటాయట. ఈ యాడ్స్ టార్గెటెడ్ ఆడియన్సుకు మాత్రమేనా లేక అందరికి వర్తిసాయా అన్న విషయం పై ఇంకా స్పష్టత లేదు. వాట్సాప్ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి, యూజర్ డేటాను ఫేస్‌బుక్ ఏ మాత్రం తెలుసుకునే వీలుండదు.

 

 

యాడ్ బేసిడ్ ఫార్మాట్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం..

యాడ్ బేసిడ్ ఫార్మాట్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం..

అయితే ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌తో అసోసియేట్ అయి ఉన్న ఫోన్ నెంబర్స్‌ను బట్టి ఈ యాడ్స్‌ను పొస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఫేస్‌బుక్ తన వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను యాడ్ బేసిడ్ ఫార్మాట్‌లోకి తీసుకువచ్చేందుకు ఆగష్టు నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ స్టేటస్‌లలో పోస్ట్ అయ్యే యాడ్స్‌ను ఫేస్‌బుక్ అడ్వర్టైజింగ్ సిస్టం మానిటర్ చేస్తుందట.

 

 

Best Mobiles in India

English summary
WhatsApp for iOS to start showing ads in Status.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X