వాట్సప్ sexting ట్రాప్, పురుషులే టార్గెట్, కొత్త దందా
వాట్సప్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న పదం. సులువుగా డబ్బు సంపాదించాలనే మోజులో అందరూ దీన్ని అవాంచిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు.
వాట్సప్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న పదం. సులువుగా డబ్బు సంపాదించాలనే మోజులో అందరూ దీన్ని అవాంచిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు పేక్ న్యూస్ ల దెబ్బకు వాట్సప్ సైతం కుదలేవుతూ పోతోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో స్కాకం వాట్సప్ ని వణికిస్తోంది. ఈ యాప్ ముఖ్యంగా పురుషులను ముప్పతిప్పలను పెడుతోంది. ఈ విషయంలో వారు అప్రమత్తంగా లేకుంటే ఒళ్లు ఇళ్లు గుల్ల చేసుకోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పూర్తి వివరాల్లోకెళితే..

sexting’ trap అంటే
నిపుణుల అభిప్రాయం ప్రకారం sexting' trap అంటే అబ్బాయిలే అమ్మాయిల ఫోటోలతో వాట్సప్ లో పరిచయం చేసుకుని డబ్బులు గుంజడం.. అందమైన డిపి పిక్ పెట్టి కొత్త వాళ్లతో ఛాటింగ్ చేస్తారు. దీంతో పాటు న్యూడ్ ఫోటోలను పంపించి బుట్టలో వేసుకుంటారు.

అట్రాక్ట్ అయి..
మీరు దానికి అట్రాక్ట్ అయి పర్సనల్ ఫోటోలు పంపితే బుక్కయిపోయినట్లే. వాటితో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు. దురదృష్టం కొద్ది ఎవరైనా మరింత ముందుకెళ్లి వారి న్యూడ్ ఫోటోలను పంపితే ఇక అంతే సంగతులు

కొత్త నంబర్ నుంచి వచ్చే ఛాటింగ్ లో
కొత్త నంబర్ నుంచి వచ్చే ఛాటింగ్ లో చాలామంది రిప్లయి ఇస్తుంటారు. ఇదే వాళ్ళకు ఆయుధంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారినే ..
దీనికి ప్రధానంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారినే ఎంచుకుంటున్నారు. వారి అకౌంట్ నుంచి ఫోన్ నంబర్ సేకరించి వారి వ్యక్తిగత సమాచారం తెలుసుకుని వారిని బుట్టలో వేసుకుంటున్నారు.

ఛాటింగ్ గడుస్తున్న కొద్ది
ఛాటింగ్ గడుస్తున్న కొద్ది వారిలో మార్పు వస్తుంది. వారి ముందుగా వారి ఫోటోషాప్ చిత్రాలను పంపించి మిమ్మల్ని ఫోటోలు అడుగుతారు.మీరు అలా పంపించిన తరువాత వారు బ్లాక్ మెయిల్ కి దిగుతారు. మనం పంపకపోయినా మన ఫోటోలను ఎక్కడో చోట సేకరించి మార్పింగ్ చేసి మరీ బ్లాక్ మెయిల్ చేస్తారు.

బ్లాక్ మెయిల్ లో..
ఈ రకమైన ఛాటింగ్ బ్లాక్ మెయిల్ లో ముందుగా తక్కువ అమౌంట్ తో మెదలుపెట్టి వీలైనంత ఎక్కువ గుంజేందుకు ప్రయత్నిస్తుంటారు. తక్కువ అమౌంట్ అయితే పోలీసుల దాకా వెళ్లదనే నమ్మకం కూడా ఉండటలం వల్ల వారు ఈ రకమైన దందాలకు తెరలేపుతున్నారు.

విదేశాల్లో ఈ సంఘటనల వల్ల..
ప్రస్తుతం మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరగలేదు కాని విదేశాల్లో ఈ సంఘటనల వల్ల చాలామంది మోసపోతున్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి.

ఫార్వాడ్ మెసేజ్
వాట్సప్ త్వరలో ఫార్వాడ్ మెసేజ్ తీసుకువస్తున్న నేపథ్యంలో కొన్ని రకాల ఫేక్ న్యూస్ లకు చరమగీతం పాడే అవకాశం ఉంది. సో మీరు కూడా ఏది బడితే అది పోస్ట్ చేయకుండా అలాగే ఫార్వార్డ్ చేయకుండా ఆలోచించి చేయడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








