Home
Apps

వాట్సప్ తో జర భద్రం గురు.....

ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు.

By Anil

ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు.ఇప్పటివరకు ఎన్నో చాటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్న చాలా మంది ప్రజలు వాట్సాప్ నే వాడడానికి ఇష్టపడతారు . ఈ నేపధ్యంలో కొందరు ఈ వాట్సాప్ నీ చెడు చేయడానికి ఉపయోగిస్తున్నారు.తప్పుడు వార్తలు సర్క్యూలేట్ చేయడం దాటించి అమాయక ప్రజలను బ్ల్యాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.

సోషల్ మీడియా ద్వారా  టార్గెట్....

సోషల్ మీడియా ద్వారా టార్గెట్....

ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్ ద్వారా టార్గెట్ చేస్తున్నారు.ఈ విషయంలో ఎక్కువుగా మగవారే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి మోసాలకు ఎక్కువగా ఆడవాళ్లే పాల్పడుతున్నారు. మరి కొందరు అమ్మాయి కాకపోయినా అమ్మాయి అని చెప్పుకుంటూ ఇలాంటి మోసాలను మగవారే చేస్తున్నారు.

నంబర్లు సంపాదించి...

నంబర్లు సంపాదించి...

నంబర్లు సంపాదించి వారితో మాములుగా చ్యాట్ చేయడం మొదలు పెడ్తారు.మాటలు మొదలెట్టాక మెల్లగా వారి మాటలను అస్లీలత వైపు మళ్లిస్తారు. తరువాత వారి న్యూడ్ ఫొటోస్ నో లేక మార్ఫింగ్ ఫొటోస్ ను పంపిస్తారు అలా న్యూడ్ ఫోటోస్ తో అమాయకులను ప్రేరేపించి తిరిగి వారి న్యూడ్ ఫొటోస్ ను సంపాదిస్తారు.

డబ్బు డిమాండ్ కూడా 3000 రూపాయల లోపే....

డబ్బు డిమాండ్ కూడా 3000 రూపాయల లోపే....

న్యూడ్ ఫొటోస్ ను సంపాదించక వాటిని అడ్డం పెట్టుకొని బెదిరించి డబ్బులు అడగడం మొదలుపెడతారు.ఈ మోసగాళ్లు డిమాండ్ చేసేది కూడా 3000 రూపాయల లోపే ఎందుకంటే ఎక్కువ డబ్బులు అడిగితే బాధితులు పోలీసులను ఆశ్రయించే ప్రమాదం ఉంటుందని వారి భయం.తక్కువ అడగడం వల్ల ఫెద్దగా పట్టించుకోకుండా పోతారన్నది వారి బలం.

ఇలాంటి కేసులు ఎక్కువగా సౌత్ ఆఫ్రికా లో....

ఇలాంటి కేసులు ఎక్కువగా సౌత్ ఆఫ్రికా లో....

ఇలాంటి మోసాలు ఇండియా లో ఎక్కువ నమోదు కాకపోనప్పిటికి ఇతర దేశాలలో చాలా జరిగాయి. ముక్యంగా ఇలాంటి కేసులు సౌత్ ఆఫ్రికా లో ఎక్కువ నమోదు అయ్యాయి.

మొదట ఎవరో తెలుసుకోండి....

మొదట ఎవరో తెలుసుకోండి....

కొత్త వ్యక్తితో చాట్ చేసేటప్పుడు మొదట వారి వివరాలు తెలుసుకోండి. ఒక వేళా మీకు వారి మీద అనుమానం ఉంటె వారిని బ్లాక్ చేయడం ఉత్తమమైన పని.

Best Mobiles in India

English summary
WhatsApp fraud: Men, beware of this ‘sexting’ trap.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X