మరో రెండు కొత్త ఫీచర్లతో వాట్సప్‌ , అప్‌డేట్ చేసుకోవడం ఎలా ?

|

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ వస్తున్న వాట్సప్ ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్లతో దూసుకొచ్చింది. తాజా బీటావర్షన్‌లో వాట్సాప్‌లో ఈ రెండు ఫీచర్లను జోడించింది. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం Whatsapp Beta 2.18.118 వెర్షన్ వాడుతున్నవారికి ఈ ప్రయారిటీ నోటిఫికేషన్ ఇప్పుడు అందుబాటులో ఉందని వాట్సప్‌ ధృవీకరించింది. ఇప్పటికే పేమెంట్ ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సప్ మళ్లీ ఈ రెండు కొత్త ఫీచర్లను తీసుకురావడంతో యూజర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఫీచర్లు ఎలా అప్ డేట్ చేసుకోవాలి అనే దానికి కొన్ని గైడెన్స్ ఇస్తున్నాం ఓ సారి ఫాలో అవ్వండి.

 

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ QR code సపోర్ట్ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ QR code సపోర్ట్

హై ప్రయారిటీ

హై ప్రయారిటీ

ఇన్‌కమింగ్ నోటిఫికేషన్లు నియంత్రించేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సెటింగ్స్‌లో వెళ్లి ఈ ఆప్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది తీసుకొచ్చిన పిన్‌డ్‌ చాట్స్‌ ఫీచర్‌లాంటిదే ఇది కూడా.

Settings>Notifications అనే విభాగంలో..

Settings>Notifications అనే విభాగంలో..

మీ ఫోన్లో Whatsapp అప్లికేషను ఓపెన్ చేసి Settings>Notifications అనే విభాగంలో దీన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఇది కేవలం వాట్సప్ అప్లికేషన్ కి మాత్రమే పనిచేస్తుంది. మీ ఫోన్లో ఇతర ప్రయారిటీ నోటీఫికేషన్లు సపోర్ట్ చేసే యాప్స్ ఉండి వాటిని వాట్సప్ బదులుగా ప్రయారిటీ చూపించాలనేకుంటే ఈ ఫీచర్ వాట్సప్ లో పనిచేయదు.

 మిగతా అప్లికేషన్ల నోటిఫికేషన్లు..
 

మిగతా అప్లికేషన్ల నోటిఫికేషన్లు..

ఈ ఫీచర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో మిగతా అప్లికేషన్ల నోటిఫికేషన్లు అన్నింటికన్నా పైభాగంలో వాట్సప్ మెసేజ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు ప్రత్యేకంగా కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. వ్యక్తి, అలాగే అందరివీ. లేకుంటే గ్రూపులవీ ఏవి కావాలనుకుంటే ఆ నోటిఫికేషన్లను ప్రయారిటీగా పెట్టుకోవచ్చు.

అడ్మిన్లను తొలగించే ఫీచర్‌

అడ్మిన్లను తొలగించే ఫీచర్‌

వాట్సప్‌ గ్రూప్స్‌ లను దృష్టిలో పెట్టుకుని డిస్సిస్‌ యాజ్‌ అడ్మిన్‌( అడ్మిన్‌గా డిస్సిస్‌) ఆప్షన్‌ను అందిస్తోంది. ఇప్పటివరకూ గ్రూపునుంచి సభ్యులను డిలీట్‌ చేసే అవకాశం అడ్మిన్లకు ఉంది. తాజాగా ఫీచర్‌తో గ్రూపులోని ఇతర అడ్మిన్లను గ్రూప్‌నుంచి డీమోట్‌ చేసే అవకాశమన్నమాట.

 అడ్మిన్లను తొలగించాల్సిన అవసరం లేకుండా..

అడ్మిన్లను తొలగించాల్సిన అవసరం లేకుండా..

అంటే అడ్మిన్లను తొలగించాల్సిన అవసరం లేకుండా వారిని డీమోట్‌ చేయొచ్చు. అంటే గ్రూప్‌ ఇన్ఫో మెనూలో అడ్మిన్‌ నంబర్‌ మనకు కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, వెబ్‌ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
WhatsApp gets 'Dismiss as Admin' and 'High Priority' features More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X