ఇకపై వాట్సప్‌లో ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు

Written By:

మేసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న యాప్ వాట్సప్ ఇప్పుడు తన కష్టమర్ల కోసం అదిరే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. మీరు వాట్సప్‌లో ఇప్పుడు చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేయవచ్చు. అంటే మీరు రాసుకోవాలన్నా అలాగే డ్రాయింగ్ గీయాలన్నా,ఢిఫరెంట్ గా ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలన్నా ఈ సౌకర్యాలన్నీ వాట్సప్ లో మీకు దొరకనున్నాయి. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

వాట్సప్, తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తాజా బీటా 2.16.264 అప్‌డేషన్‌తో స్నాప్‌చాట్ మాదిరిగా యూజర్లు తమ ఇమేజ్‌పై ఏదైనా టెక్ట్స్ రాసుకునేందుకు, డ్రాయింగ్ వేసుకునేందుకు సౌకర్యం కల్పించనుంది.

#2

ఇక నుంచి వాట్సప్ యాప్ ద్వారా ఫ్రంట్ పేసింగ్ ఫ్లాష్‌తో ఫోటో తీసుకున్నప్పుడు, ఎడిటింగ్ టూల్స్‌ను తాజా అప్‌డేషన్‌తో యూజర్లు పొందుతారు. ఫోటోపై ఏదైనా టెక్ట్స్‌ను రాసుకునే విధంగా, డ్రాయింగ్ వేసుకునేందుకు వీలుగా పెన్సిల్, టీ బటన్స్ కనిపిస్తాయి.

#3

ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ మాదిరిగా వివిధ రంగులను వాడుకుంటూ యూజర్లు తమ ఫోటోలను ఈ ఫీచర్ ద్వారా డిజైన్ చేసుకోవచ్చు. యూజర్ల ఇమేజ్‌లను మరింత తీర్చిదిద్దడానికి స్టికర్ల కూడా వాడుకుని ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చట.

#4

మొదట ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్ ప్రవేశపెట్టింది. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇదేమాదిరి ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా వాట్సప్ కూడా మెసేజింగ్ ప్రేమికుల కోసం ఈ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

#5

అయితే ఈ ఎడిటింగ్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఇలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు.

#6

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. ఈ అధికారిక వెర్షన్‌ను వాట్సప్ త్వరలో విడుదల చేయనుంది. టెస్ట్ చేయాలనుకునే యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో తాజా వాట్సప్ వెర్షన్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు యూజర్లకు ఇన్‌స్టాల్ అవుతాయి.

#7

దీంతో పాటు త్వరలోనే యూజర్ల చాట్‌ను వాట్సప్ చదివి వినిపించేలా టెస్టింగ్ జరుగుతుందట. మెసేజ్‌లో ఉన్న టెస్ట్‌ను వాట్సపే బయటికి చదివేలా స్పీక్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఐఓఎస్ డివైజ్‌లన్నింటికీ ఒకేసారి ఈ ఫీచర్ అందుబాటులోకి రాదంట.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp goes after Snapchat with stickers and photo editing red more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting