వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

Written By:

ఈ మధ్య వాట్సప్ లో ఓ మెసేజ్ తెగ హల్‌చల్ చేస్తోంది. వాట్సప్ ఇప్పుడు గోల్డ్ కలర్ లో వస్తోంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సప్ ని గోల్డ్ కలర్ లోకి మార్చుకోవచ్చు అని. ఇది వాట్సప్ కొత్తగా పెట్టిన అప్ గ్రేడ్ వర్షన్ అంటూ వాట్సప్ లో వెంటనే దీన్ని డౌన్ లోడ్ చేసుకోండని ఓ మెసేజ్ అందరికీ వస్తోంది. అయితే ఈ మెసేజ్ అంతా ఫేక్ తో కూడుకున్నది. మీరు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారంటే మీ ఫోన్ లోకి 404 మెసేజ్ వస్తుంది.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

Read more: భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

అంటే మీ అకౌంట్ హ్యాక్ అయి మీ మొబైల్ డేటా సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇదొక పెద్ద స్కాం అని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాట్సప్ ఏదైనా రిలీజ్ చేస్తే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుందని ఇలాంటి మెసేజ్ లు నమ్మవద్దని వాట్సప్ సైతం చెబుతోంది. సో మీరు ఆ మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి. మీ కొంప కొల్లేరు చేసుకోకండి. వాట్సప్ లో మీకు తెలియని ట్రిక్స్ చాలానే ఉన్నాయి. అవేంటో చూడండి.

Read more: వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

వాట్సప్‌లో వచ్చే చెత్త ఇమేజ్‌లు కెమెరా రోల్లో కనిపించకుండా పెట్టుకోవచ్చు. ఇందుకోసం ఫైల్ ఎక్స్‌ఫ్లోరర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్డీకార్డ్ / వాట్సప్ / మీడియాలోకి వెళ్లి వాట్సప్ ఇమేజెస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేయాలి.అక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ని ట్యాప్ చేయాలి. కొత్త ఫోల్డర్ వస్తుంది. దానికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఫోటోలు అక్కడికి వెళ్లిపోతాయి. కెమెరా రోల్లో కనిపించవు.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

వాట్సప్ లోని బ్యాకప్ హిస్టరీని మైక్రో ఎస్డీ కార్డు ఉంటే కొన్ని నిమిషాల్లోనే పొందవచ్చు. ముందుగా వాట్సప్ హిస్టరీ ఉన్న డివైజ్లో మైక్రో ఎస్డీ కార్డు కార్డ్ ను ఇన్సర్ట్ చేయాలి. తరువాత వాట్సప్‌లో సెట్టింగ్స్, చాట్స్ అండ్ కాల్స్ లోకి వెళ్లి బ్యాకప్ చాట్స్ ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు ఎస్డీకార్డుని తీసి కొత్త డివైజ్ లో వేయాలి. డివైజ్లో వాట్సప్‌ని ఇన్స్టాల్ చేయగానే ఆటోమెటిక్ గా బ్యాకప్ ని గుర్తించి రీస్టోర్ చేస్తుంది.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

వాట్సప్ నోటిఫికేషన్స్ స్క్టాప్ పై కనిపించాలంటే WAToolkit ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తరువాత బ్రౌజర్ టూల్ బార్ పై కొత్త ఐకాన్ కనిపిస్తుంది.వాట్సప్‌లో ఏవైనా మెసేజ్ రాగానే ఆ ఐకాన్ పైకి కర్సర్ వెళుతుంది. వాట్సప్ వెబ్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా నోటిఫికేషన్స్ చూడవచ్చు. క్రోమ్ ఓపెన్ చేసి లేకపోయినా మెసేజ్ లను ఇది డెస్క్‌టాప్ పై నోటిఫై చేస్తుంది.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

వాట్సప్‌లో బల్క్ ప్రైవేట్ మెసేజ్ లు పంపుకోవాలంటే గ్రూప్ మెసేజ్ పనికిరాదు. కాబట్టి ఎవరికైతే మెసేజ్లు పంపుకోవాలనుకుంటున్నారో వారికే చేరాలంటే చాలా సింపుల్. కుడివైపు పైభాగంలో త్రీడాట్స్ లో కనిపిస్తున్న ఆప్షన్స్ ఐకాన్ పై ట్యాప్ చేయాలి. తరువాత న్యూబ్రాడ్ కాస్ట్ ని ఎంచుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే ప్రైవేట్ మెసేజ్లు పంపించాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్స్ కి ఎంటర్ చేసి సెండ్ చేయాలి.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

గ్రూప్స్లో ఉన్నప్పుడు నిమిషానికో మెసేజ్ వస్తుంటుంది. పనిలో బిజీగా ఉన్నప్పుడు అలాంటి నోటిఫికేషన్స్ అన్నీ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఆ చాట్ని వదిలేయకుండా మ్యూట్లో పెట్టి నోటిఫికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. వాట్స్పలో చాట్స్ ట్యాబ్లోకి వెళ్లి గ్రూప్ ని ఓపెన్ చేసి అక్కడ మ్యూట్ ఆప్సన్ ని ఎంచుకువచ్చు.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

ప్రతిరోజు ఉదయం 4 గంటలకు అన్ని మెసేజ్ లను వాట్సప్ డీఫాల్ట్ గా బ్యాకప్ చేస్తుంది. అంటే ఒకవేళ మీరు ఎవైనా మెసేజ్ డిలీట్ చేసి ఉంటే ఆ తరువాత అటో బ్యాకప్ కన్నా ముందు రికవరీ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు వాట్సప్ ని అన్ ఇన్ స్టాల్ చేసి ఇన్ స్టాల్ చేసినప్పుడు బ్యాకప్ ఆప్సన్ వస్తుంది. రీ స్టోర్ ని ఎంచుకోవడం ద్వారా మీరు డిలీట్ మెసేజ్ లను పొందవచ్చు.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

మెసేజ్ లు చదివింది తెలుసుకోవడానికి బ్లూటిక్స్ ఉపయోగపడతాయి. అయితే వీటిని హైడ్ చేసే మార్గం కూడా ఉంది. మీరు ఇందుకోసం సెట్టింగ్స్ లో కెళ్లి అకౌంట్స్ ఓపెన్ చేస్తే అక్కడ ప్రైవసీ ఆప్సన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు రీడ్ రిసిపింట్ ఆప్సన్ కనిపిస్తుంది. దాని మార్క్ ని తీసారంటే మీకు బ్లూ టిక్స్ కనపడవు.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

ముఖ్యమైన స్నేహితులతో మాత్రమే చాట్ చేసేందుకు షార్ట్ కట్ ఉపయోగించవవచ్చు. ఇందు కోసం మీరు చాట్ లో కెళ్లి మీ స్నేహితుల నంబర్ ని అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు షార్ట్ కట్ అని చూపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాలు. వాట్సప్ లోకి వెళ్లకుండానే మీరు నేరుగా చాట్ చేయవచ్చు.

వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరే

వాట్స్పతో డీఫాల్ట్ గా వచ్చిన వాల్ పేపర్ ను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం మీరు సెట్టింగ్ లోకెళ్లి చాట్ ఆప్సన్ లో కెళ్లితే అక్కడ మీకు వాల్ పేపర్ ఆప్సన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు మీకు నచ్చిన దాన్ని సెట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write WhatsApp Gold Scammers trick mobile users into downloading malware
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot