Home
Apps

వాట్సాప్ కొత్త అప్‌డేట్స్ (2016)

వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన సంచలనాత్మక ఫీచర్లు..

By Sivanjaneyulu Bommu

నిత్యం సరికొత్త అప్‌డేట్‌లతో వాట్సాప్ శక్తివంతమైన యాప్‌గా రూపాంతరం చెందుతోంది. వాట్పాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన నాటినుంచి మార్కెట్లో వాట్సాప్ దూకుడు మరింతగా పెరిగింది. ఇన్‌స్టెంట్ మెసెజింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 2016కుగాను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన సంచలనాత్మక ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

Read More : ఇక 3జీ ఫోన్‌లలో రిలయన్స్ Jio!

వాట్సాప్ మెసెజ్‌లను బోల్ట్, ఇటాలిక్స్  ఇంకా అండర్‌స్ట్రైక్‌లోకి

వాట్సాప్ మెసెజ్‌లను బోల్ట్, ఇటాలిక్స్ ఇంకా అండర్‌స్ట్రైక్‌లోకి

వాట్సాప్‌లో మీరు పంపే మెసెజ్ బోల్డ్‌గా ఉండాలంటే అక్షరాలకు ముందూ చివరా ‘*' (స్టార్) సింబల్ ను యాడ్ చేయండి. ఇదే సమయంలో మీరు పంపే మెసెజ్ ఇటాలిక్స్ రూపంలో ఉండాలటే అక్షరాలకు ముందు చివరూ ‘_' (అండర్ స్కోర్) సింబల్‌ను యాడ్ చేయండి. మీరు పంపే మెసెజ్ టెక్స్ట్ పై అండర్‌స్ట్రైక్ ఉండాలంటే పదాలకు ముందు చివరాల ‘~' సింబల్‌ను యాడ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పీడీఎఫ్ డాక్యుమెంట్‌లను షేర్ చేసుకునే అవకాశం..

పీడీఎఫ్ డాక్యుమెంట్‌లను షేర్ చేసుకునే అవకాశం..

ఆండ్రాయిడ్ యూజర్లు, యాప్ ఇంటర్‌ఫేస్ టాప్ రైట్ కార్నర్ భాగంలో కనిపించే అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా పీడీఎఫ్ ఫైల్ షేరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. యాపిల్ ఐఓఎస్ యూజర్లు, యాప్ ఇంటర్‌ఫేస్ అడుగున కనిపించే Arrow up ఐకాన్ పై టాప్ చేయటం ద్వారా పీడీఎఫ్‌లను పంపుకోగలిగే డాక్యుమెంట్‌ ఆప్షన్‌ను చూడగలుగుతారు.

వెబ్‌సైట్ షేరింగ్ లింక్‌ ఆప్షన్..

వెబ్‌సైట్ షేరింగ్ లింక్‌ ఆప్షన్..

గతంలో ఇత‌ర వెబ్‌సైట్‌ లింక్‌ల‌ను షేర్ చేయ‌డం వాట్సాప్‌లో వీల‌య్యేది కాదు. తాజా అప్‌డేట్‌లో ఫేస్‌బుక్‌ తరహా వెబ్‌సైట్ షేరింగ్ లింక్‌ను వాట్సాఫ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి వాట్సాప్‌లో కూడా వివిధ వెబ్‌సైట్స్ లింక్‌ల‌ను షేర్ చేసుకోవచ్చు.

వీడియో కాలింగ్

వీడియో కాలింగ్

వాట్సాప్ ఎట్టకేలకు తన ఆండ్రాయిడ్ వర్షన్ యూజర్ల కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త వీడియో కాలింగ్ సదుపాయాన్ని వాట్సాప్ కాల్స్ టాబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ చేసుకునే క్రమంలో డైలర్ ఐకాన్ పై టాప్ చేయవల్సి ఉంటుంది. డైలర్ ఐకాన్ పై ప్రెస్ చేయగానే వీడియో లేదా వాయిస్ కాల్ అని అడుగుతుంది. వీడియో కాల్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా కాల్ వెళుతుంది. మీరు వీడియో కాల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవతలి వ్యక్తులు కూడా వాట్సాప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉండాలి.

GIF ఫైల్‌‌ సపోర్ట్..

GIF ఫైల్‌‌ సపోర్ట్..

వాట్సాప్ ద్వారా GIF ఫైల్‌‌ను తయారు చేయాలంటే ముందుగా యాప్ పేజీలోని అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మీకు 6 రకాల ఆప్షన్స్ మీకు కనపిస్తాయి. వాటిలో కెమెరా ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే Take picture, Record Video పేరుతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో రికార్డ్ వీడియో ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే వీడియో రికార్డింగ్ ఓపెన్ అవుతుంది. మీరు రికార్డ్ చేసే వీడియో 6 సెకన్ల కంటే తక్కువ టైమ్ వ్యవధిలో ఉండాలి. వీడియో అటాచ్ మెంట్ సిద్ధమైన వెంటనే క్యామ్ కార్డర్ ఐకాన్ తో పాటు ట్రిమ్మింగ్ పేజీ మీకు కనిపిస్తుంది. ఈ పేజీలో GIF ఫైల్ కావల్సిన విధంగా ట్రిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెండ్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే వీడియో కాస్తా GIF ఫైల్ గా మారిపోతుంది.

ఫోటో ఎడిటింగ్ టూల్స్...

ఫోటో ఎడిటింగ్ టూల్స్...

వాట్సాప్ ద్వారా మీరో ఇమేజ్‌ను చిత్రీకరించిన వెంటనే, ఆ ఫోటో క్రింద కొన్ని ఎడిటింగ్ టూల్స్ మీకు కనిపిస్తాయి. Cropping, Emojis, Type option, Pencil, draw or scribble వంటి ఆప్షన్‌లను మీరు చూడొచ్చు. అవసరాన్ని బట్టి వీటిని వాడుకోవచ్చు.

పబ్లిక్ గ్రూప్ ఇన్వైట్ లింక్స్

పబ్లిక్ గ్రూప్ ఇన్వైట్ లింక్స్

పబ్లిక్ గ్రూప్ ఇన్వైట్ లింక్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేసింది. ఈ ఇన్విటేషన్ లింక్‌ను అందుకున్న వ్యక్తి ఆ గ్రూపు‌ను ఎవరు రన్ చేస్తున్నారు, దానిలో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు వంటి వివరాలను మెసెజ్ రూపంలో పొందుతారు. తద్వారా ఆ గ్రూపులో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

న్యూ జూమ్ ఫీచర్..

న్యూ జూమ్ ఫీచర్..

New zoom feature వాట్సాప్ తీసుకువచ్చిన తాజా అప్‌డేట్‌లో న్యూ జూమ్ ఫీచర్ కూడా ఒకటి. ఈ ఫీచర్ ద్వారా చాలా దూరంలో కనిపించే దృశ్యాలను వీడియో లేదా ఫోటో రూపంలో క్యాప్చర్ చేయవచ్చు. మీ వేలును పైకి క్రిందకు జరపటం ద్వారా జామ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. డబల్ ట్యాప్ చేయటం ప్రంట్ర అలారే రేర్ ఫేసింగ్ కెమెరాల మధ్య స్విచ్ కావొచ్చు.

Editing tools

Editing tools

వాట్సాప్ తీసుకువచ్చిన రీసెంట్ అప్‌డేట్స్‌లో ఎడిటింగ్ టూల్స్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా మీరు పంపే ఫోటోస్ అలానే వీడియోలకు అదనపు హంగులను జోడించవచ్చు. ఫోటల పై మీకు నచ్చిన టెక్స్ట్‌ను యాడ్ చేయటం, ఫాంట్ స్టైల్ మార్చటం, వివిధ రంగలను అప్లై చేయటం వంటి ఈ ఎడిటింగ్ టూల్ ద్వారా సాధ్యమవుతాయి.

Selfie flash

Selfie flash

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం Selfie flash పేరుతో సరికొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింటి. ఈ టూల్ ద్వారా యూజర్లు తక్కువ వెళుతరులోనూ నాణ్యమైన సెల్ఫీలను చిత్రీకరించుకోగలుగుతారు.

వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌

వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌

నిన్న మొన్నటి వరకు ఏదైనా వాట్సాప్ వీడియోను ఓపెన్ చేయాలంటే, ఆ వీడియోను పూర్తిగా డౌన్లోడ్ చేుసుకుని ఓపెన్ చేయవల్సి వచ్చేది. ఇక పై ఆ పరిస్థితి ఉండబోదు. తాజాగా, వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌లో భాగంగా, వాట్సాప్ వీడియోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ట్రీమ్ చేసుకోవచ్చు. వీడియో ఉపయోగపడుతుందనుకుంటేనే డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. దీని వల్ల బోలెడంత డేటా ఆదా అవుతుంది. ఇటీవల వీడియో కాలింగ్ ఫీచర్‌ను లాంచ్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తాజాగా వీడియో స్ట్రీమింగ్ పేరుతో మరో ఫీచర్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బేటా వర్షన్ 2.16.365లో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది.

లాస్ట్ సీన్ ఆప్షన్‌

లాస్ట్ సీన్ ఆప్షన్‌

వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. మాన్యువల్‌గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు.ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ ‘కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి.మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి.ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి.వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

Media auto-download

Media auto-download

వాట్సాప్ అకౌంట్‌లో నిత్యం అనేక మీడియా ఫైల్స్ షేర్ అవుతుంటాయి. వీటిని ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది.ఈ కారణంగా బోలెడంత మొబైల్ డేటా ఖర్చవుతుంటుంది. అయితే, ఈ డేటా ఖర్చును కంట్రోల్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్లి Media auto-download ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Whats app got these top updates in 2016. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X