Home
Apps

వాట్సప్ గ్రూపు అడ్మిన్ అయినందుకు 5 నెలలుగా జైల్లోనే, మెసేజ్ ఏంటో తెలుసా ?

సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్‌తో జాగ్రత్తగా లేకుంటే కొన్ని అనుకోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందనేదానికి అసలైన నిదర్శనం ఈ సంఘటన.

By Hazarath Aiah

సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్‌తో జాగ్రత్తగా లేకుంటే కొన్ని అనుకోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందనేదానికి అసలైన నిదర్శనం ఈ సంఘటన. వాట్సప్‌లో డీఫాల్ట్‌గా అడ్మినిస్ట్రేటర్‌ అయిన ఓ యువకుడు ఏ పాపం ఎరుగకున్నా గత 5 నెలులుగా జైలు ఊచలు లెక్కిస్తున్నాడు! నమ్మలేకున్నారా..అయితే కొన్ని నిజాలు మనదాకా వస్తేగాని నమ్మిలేము కాని ఈ విషయం మాత్రం నమ్మి తీరాల్సిందే. సోషల్‌ మీడియా, మెసేంజింగ్‌ బృందాల్లో ఉండే సభ్యులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఈ సంఘటన పూర్తి వివరాల్లోకెళితే..

జాతి వ్యతిరేక సందేశం

జాతి వ్యతిరేక సందేశం

Talen police station in-charge Narmada Prasad Dahima చెప్పిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌లోని తాలెన్‌కు చెందిన ఓ 17 ఏళ్ల యువకుడు ఫిబ్రవరి 14న వాట్సప్‌ గ్రూప్‌లో జాతి వ్యతిరేక సందేశం ఒకటి పెట్టాడు.

 పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఆ గ్రూప్‌లోని చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆ యువకుడు, గ్రూప్‌ అడ్మిన్ రాజా గుర్జర్‌‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

వాట్సప్‌ నిబంధనల ప్రకారం..

వాట్సప్‌ నిబంధనల ప్రకారం..

ఈ విషయం తెలుసుకున్న గుర్జర్‌ గ్రూప్‌ నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు ఆ గ్రూప్‌ అడ్మిన్లు అయ్యారు. వారూ వెంటనే గ్రూప్‌ వదిలేశారు. వాట్సప్‌ నిబంధనల ప్రకారం గ్రూప్‌లో సీనియర్‌ సభ్యుడైన ‘జునైద్‌ మేవ్‌' అనే వ్యక్తి అడ్మిన్‌ అయ్యారు.

సమాచార సాంకేతిక చట్టం కింద కేసులు

సమాచార సాంకేతిక చట్టం కింద కేసులు

అయితే ఫిబ్రవరి 14నే అభ్యంతరకర సందేశం పెట్టిన వ్యక్తిపై, జునైద్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 124 (దేశద్రోహం), 295ఏ (మత వ్యతిరేక కార్యకలాపాలతో కొన్ని వర్గాల మనోభావాలు కించపరచడం), సమాచార సాంకేతిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిద్దరినీ వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు.

కేసు విచారణ

కేసు విచారణ

పద్దెనమిది ఏళ్లు నిండకపోవడంతో సందేశం పెట్టిన యువకుడికి బాల నేరస్థుల గృహానికి పంపించగా జునైద్‌ మేవ్‌ను మాత్రం జైల్లోనే ఉంచారు. పోలీసులు కేసు విచారణను వేగంగా పూర్తిచేయకపోవడంతో మేవ్‌ ఇబ్బంది పడుతున్నాడని, ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తోందని అతడి సోదరుడు ఫక్రుద్దీన్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

దేశద్రోహం కేసు

దేశద్రోహం కేసు

ప్రస్తుతం జునైద్‌ మేవ్‌ బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడిపై దేశద్రోహం కేసు నమోదు చేయడంతో హైకోర్టు నుంచి బెయిల్‌ సైతం దొరకడం లేదని ఫక్రుద్దీన్‌ విచారం వ్యక్తం చేస్తున్నాడు.

కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని..

కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని..

కాగా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, పోలీసులు అలసత్వం వహిస్తున్నారని తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సారంగాపుర్‌ ఉప ప్రాంతీయ పోలీసు అధికారి ప్రకాశ్‌ మిశ్రా మీడియాకు తెలిపారు. ఒకవేళ ఫిర్యాదు అందితే మాత్రం పోలీసులు విచారణ చేపడతాని చెప్పారు.

Best Mobiles in India

English summary
WhatsApp Group Admin In Jail For After Member's "Anti-National" Message more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X