Home
Apps

ఆ ఫీచర్లు వాట్సప్‌లో అందరికీ, సింబల్ కనిపించిందేమో చెక్ చేసుకోండి

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath Aiah

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది. ఈ ఫీచర్లు బీటా వర్షన్ లో ఉన్నవారికి మాత్రమే అప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు అందరూ వీటిని ఉపయోగించుకునేలా అందుబాటులోకి తీసుకువచ్చింది. గత కొన్ని రోజుల కింద లిమిటెడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్ ఫీచర్లను ఇప్పుడు అందరూ ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎలా పొందాలో చూద్దాం.'

వాట్సప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌..

వాట్సప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌..

ముందుగా యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా వాట్సప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త సభ‍్యుడిని చేర్చుకునే ఓ సింబల్‌..

కొత్త సభ‍్యుడిని చేర్చుకునే ఓ సింబల్‌..

వాట్సప్ వీడియో కాలింగ్ లోకి ఎంటరయిన తరువాత కుడివైపు పైన ఒక కొత్త సభ‍్యుడిని చేర్చుకునే ఓ సింబల్‌ కనిపిస్తుంది. అది మీ వాట్సప్ లో ఉంటే ఈ ఫీచర్లు మీకు లైవ్‌లో అందుబాటులోకి వచ్చినట్టేనని కంపెనీ తెలిపింది.

ఒకే సమయంలో నలుగురు యూజర్లు

ఒకే సమయంలో నలుగురు యూజర్లు

ఈ ఫీచర్‌ ద్వారా ఒకే సమయంలో నలుగురు యూజర్లు మాట్లాడుకునే అవకాశముంటుంది. అంటే మీతో కలిపి మరో ముగ్గురితో మాత్రమే ఈ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్లలో మాట్లాడే అవకాశముంటుంది.

గ్రూప్‌ కాల్‌ చేయాలంటే

గ్రూప్‌ కాల్‌ చేయాలంటే

ఈ ఫీచర్‌ను చాలా సులభతరంగా, తేలికగా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్‌ కాల్‌ చేయాలంటే, తొలుత ఒక యూజర్‌తో వీడియో కాల్‌ ప్రారంభించాలి.

 యాడ్‌ పార్టిసిపెంట్‌ బటన్‌

యాడ్‌ పార్టిసిపెంట్‌ బటన్‌

ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న యాడ్‌ పార్టిసిపెంట్‌ బటన్‌ను ట్యాప్‌ చేయాలి. ఇతర యూజర్లను కూడా గ్రూప్‌ వీడియో/వాయిస్‌ కాల్‌కి ఆ‍హ్వానించవచ్చు.

32 మందితో ఒకేసారి

32 మందితో ఒకేసారి

కాగా కంపెనీ కేవలం సింగిల్ కాల్ వీడియో వాయిస్ కాల్ ద్వారా మొత్తం 32 మందితో ఒకేసారి సంభాషించేలా కొత్త ఫీచర్ ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

గత నెలలో

గత నెలలో

కాగా గత నెలలో ఎఫ్‌8 కాన్ఫరెన్స్‌లో ఈ ఫీచర్లను ఫేస్‌బుక్‌ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp Group Voice And Video Calling Feature Rolling Out: Here’s How To Get It More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X