త్వరలో వాట్సాప్ గ్రూప్ వాయిస్ కాల్స్!
100 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో, ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా అవతరించిన వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్‌తో అలరిస్తోంది. ఇటీవల లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన వాట్సాప్ త్వరలోనే గ్రూప్ వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

iOS యూజర్ల కోసం తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన 2.17.70 బేటా వర్షన్‌లో భాగంగా గ్రూప్ వాయిస్ కాల్స్ సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులో ఉంచినట్లు WABetaInfo తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. 2.17.70 వర్షన్ నెంబర్‌తో వచ్చిన ఐఓఎస్ అప్‌డేట్‌లో గ్రూప్ వాయిస్ కాల్స్‌కు సంబంధించిన రిఫరెన్స్‌లు ఉన్నాయని, కాబట్టి దీనిని వాట్సాప్ గ్రూప్ వాయిస్ కాల్స్ ఉనికికి పాక్షిక నిర్ధారణగా భావించవచ్చిని ఈ ట్వీట్ పేర్కొంది.
తాము ఇప్పటికే గ్రూప్ వీడియో కాల్స్ పై వర్క్ చేస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి ఈ సదుపాయాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాగలుగుతామని వాట్సాప్ గతంలోనే ప్రకటించింది. WABetaInfo ట్వీట్ ప్రకారం.. వాట్సాప్ 2.17.70 బేటా వర్షన్, గ్రూప్ వాయిస్ కాలింగ్ ప్రాసెస్‌లో భాగంగా ముందుగా సర్వర్‌కు ఓ రిక్వస్ట్ పంపుతుంది. ఈ అభ్యర్థన ద్వారా గ్రూప్‌లోని యూజర్ కాల్ రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా లేక వేరొక గ్రూప్ కాల్‌లో బిజీగా ఉన్నారా అన్నది తెలిసిపోతుంది.
ఫేస్‌బుక్ ఇప్పటికే తన మెసెంజర్ యూజర్స్ కోసం గ్రూప్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. దీంతో మెసెంజర్ యూజర్లు గ్రూప్ మెసేజింగ్‌తో పాటు గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. స్కైప్, గూగుల్ డ్యుయో యాప్‌లకు పోటీగా నిలిచే క్రమంలో ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది.
వాట్సాప్ ఇటీవల తన ఆండ్రాయడ్ యూజర్ల కోసం లైవ్ లొకేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసకువచ్చిన విషయం తెలసిందే. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌ను వినియోగించుకుంటోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ రియల్‌టైమ్ అప్‌డేట్‌లను లొకేషన్ ద్వారా షేర్ చేసుకునే వీలుంటుంది.
వ్యాపారం ప్రయోజనాల కోసం వాట్సాప్ బిజినెస్ పేరుతో మరో సదుపాయాన్ని కూడా బేటా వర్షన్ రూపంలో వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా వ్యాపార సంస్థలు తమ కస్టమర్‌లతో నిరంతరం టచ్ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా, కస్టమర్‌లు కూడా వాట్సాప్ ద్వారా తమకు కావల్సిన వస్తువు లేదా సర్వీసుకు సంబంధించి ఆయా వ్యాపార సంస్థలతో సంప్రదింపులు జరిపే వీలుటుంది.


Click it and Unblock the Notifications








