WhatsApp Business గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. భారత్‌లో ఈ సంఖ్య 200 మిలియన్లుగా ఉంది.

|

వాట్సాప్ నుంచి సరికొత్త బిజినెస్ యాప్ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. WhatsApp Business పేరుతో అందుబాటులో ఉండే ఈ యాప్ ద్వారా వ్యాపార సంస్థలు తమ కస్టమర్‌లతో మరింత క్లోజ్‌గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశముంటుంది.

రూ.30లో బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే..రూ.30లో బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే..

1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు..

1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు..

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. భారత్‌లో ఈ సంఖ్య 200 మిలియన్లుగా ఉంది. వాట్సాప్ యూజర్లు అత్యధికంగా ఉన్న భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల్లో వాట్సాప్ బిజినెస్ మరింత ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

నిరంతరం టచ్ ఉండేందుకు ఆస్కారం..

నిరంతరం టచ్ ఉండేందుకు ఆస్కారం..

వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా వ్యాపార సంస్థలు తమ కస్టమర్‌లతో నిరంతరం టచ్ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా, కస్టమర్‌లు కూడా వాట్సాప్ ద్వారా తమకు కావల్సిన వస్తువు లేదా సర్వీసుకు సంబంధించి ఆయా వ్యాపార సంస్థలతో సంప్రదింపులు జరిపే వీలుటుంది.

గ్రీన్ టిక్‌తో కూడిన వెరిఫైడ్ ప్రొఫైల్‌..

గ్రీన్ టిక్‌తో కూడిన వెరిఫైడ్ ప్రొఫైల్‌..

వాట్సాప్ బిజినెస్ యాప్‌లో భాగంగా వ్యాపార సంస్థలకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్‌లకు గ్రీన్ టిక్‌తో కూడిన వెరిఫైడ్ ప్రొఫైల్‌ కేటాయించ బడుతుంది. ఈ ప్రొఫైల్‌లో కస్టమర్ సర్వీస్ నెంబర్‌తో పాటు కంపెనీ అడ్రస్ ఇంకా వెబ్‌సైట్ లింక్స్ కనిపిస్తాయి.

BookMyShowతో ఒప్పందం...

BookMyShowతో ఒప్పందం...

ఇప్పటికే BookMyShow వంటి సంస్థలు వాట్సాప్ బిజినెస్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ బిజినెస్ అఫీషియల్ అందుబాటులోకి వచ్చిన తరువాత మరిన్ని వ్యాపార సంస్థలు వాట్సాప్ ద్వారా తమ కస్టమర్‌లకు చేరువయ్యే అవకాశముంది.

ఆర్డర్ కన్ఫర్మేషన్‌తో పాటు డెలివరీ అలర్ట్స్‌ కూడా..

ఆర్డర్ కన్ఫర్మేషన్‌తో పాటు డెలివరీ అలర్ట్స్‌ కూడా..

వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా ఆయా వ్యాపార సంస్థలతో కస్టమర్స్ ఇంటరాక్ట్ అయ్యే వీలుంటుంది. ఇంటరాక్షన్‌కు సంబంధించిన నోటిఫికేషన్స్ అలానే అలర్ట్స్ నేరుగా వారి వాట్సాప్ అకౌంట్‌లకే అందుతాయి. ఈ ప్రాసెస్‌లో భారంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఆర్డర్ చేసే వస్తువులకు సంబంధించిన ఆర్డర్ కన్ఫర్మేషన్ అలానే డెలివరీ అలర్ట్స్‌ను కూడా ఆయా కంపెనీలకు సంబంధించిన వెరిఫైడ్ వాట్సాప్ అకౌంట్స్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌‌తో...

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌‌తో...

బిజినెస్ అకౌంట్న్ ద్వారా యాజర్‌కు షేర్ అయ్యే అన్ని మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటాయని వాట్సాప్ చెబుతోంది. కాబట్టి ఈ సమచారాన్ని వేరొకరు హ్యాక్ చేసే వీలుండదు. యూజర్ కావాలనుకుంటే బిజినెస్ అకౌంట్స్‌తో జరిపిన చాట్‌లను డిలీట్ చేసేసుకోవచ్చు. ఇదే సమయంలో ఆ సర్వీసును కూడా బ్లాక్ చేసే అవకాశముంటుంది. ప్రస్తుతానికి వాట్సాప్ బిజినెస్ వర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ ప్రోగ్రామ్ కమర్షియల్ హంగులను అద్దుకోబోతోంది.

Best Mobiles in India

English summary
WhatsApp to have a new Business app: what it will mean for users. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X